👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2.3K views
1 months ago
రుద్ర కవచము అర్థాలతో .................!! ఈ కవచం పఠించడం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగును. శ్లో: ప్రణమ్యామి శిరసా దేవం స్వయం భుం పరమేశ్వరం. ఏకం సర్వ గతం దేవం సర్వ దేవ మయం విభుం. భావము:- తనకు తానుగా ఉద్భవించిన వాడును, అంతటను నిండి యున్న యేకైక దైవమును, సకల దేవతా స్వరూపుడును, అగు పరమేశ్వరునకు శిరసు వంచి నమస్కరింతును. శ్లో:-రుద్ర వర్మ ప్రవక్షామి అంగ ప్రాణస్య రక్షయే. అహో రాత్ర మయం దేవం రక్షార్థం నిర్మితం పురా. భావము:- అంగ ప్రాణముల రక్షణ కొఱకు రుద్ర కవచమును - అహో ర్తమయుడైన ఆ దేవ దేవుని చేత రక్షణ కొఱకు అతి పురాతన కాలములోనిర్మింప బడిన రుద్ర కవచమును అంగ ప్రాణ రక్షణ కొఱకు చెప్పు చున్నాను. శ్లో:-రుద్రో మే చాగ్రతః పాతు ముఖం పాతు మహేశ్వరః శిరో మే యీశ్వరః పాతు లలాటం నీలలోహితః భావము:- రుద్రుడు ముందు నన్ను రక్షించు గాక. నా ముఖమును మహేశ్వరుడు రక్షించు గాక. నా శిరమును ఈశ్వరుడు రక్షించు గాక. నా లలాటమును నీలలోహితుడు రక్షించు గాక. శ్లో:-నేత్రయోస్త్రయంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః కర్ణయోః పాతుమే శంభుర్నాసికాయాం సదాశివః. భావము:- నా నేత్రములను త్ర్యంబకుడు రక్షించు గాక. నా ముఖమును మహేశ్వరుడు రక్షించు గాక. నా చెవులను శంభుడు రక్షించు గాక. నా ముక్కును సదా శివుడు రక్షించు గాక. శ్లో:-వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠా పాతంబికాపతిః శ్రీ కంఠః పాతు మే గ్రీవాం బాహూంశ్చైవ పినాక ధృత్. భావము:- నా నాలుకను వాగీశుడు రక్షించు గాక. నా పెదవులను అంబికా పతి రక్షించు గాక. నా కంఠమును శ్రీ కంఠుడు రక్షించు గాక. నా బాహువులను పినాక ధారి రక్షించు గాక. శ్లో:-హృదయం మే మహా దేవ ఈశ్వరో వ్యాత్ స్తనాంతరం నాభిం కటిం స వక్షశ్చ పాతుస్ఛర్వ ఉమాపతిః భావము:- నా హృదయమును మహా దేవుడు రక్షించు గాక. నా స్తనాంతరమును ఈశ్వరుడు రక్షించు గాక. నా నాభిని, కటిని, వాటితో పాటు వక్ష స్తలమును ఉమా పతి రక్షించు గాక. శ్లో:-బాహు మధ్యాంతరంచైవ సూక్ష్మ రూపస్సదా శివః సర్వం రక్షతు సర్వేశో గాత్రానిచ యధా క్రమం భావము:- బాహు మధ్యాంతరమును కూడా సూక్ష్మ రూపియైన సదా శివుడు రక్షించు గాక. నా శరీరమును యధా క్రమముగా అన్నిటినీ సర్వేశ్వరుడు రక్షించు గాక. శ్లో:-వజ్ర శక్తి ధరంచైవ పాశాంకుశధరం తధా. గండ శూల ధరం నిత్యం రక్షతు త్రి దశేశ్వరః భావము:- వజ్ర శక్తిని ధరించిన వాడును, పాశమును అంకుశమును ధరించిన వాడును గండ శూల ధారియు నగు త్రిదశేశ్వరుడు నన్ను నిత్యము రక్షించు గాక. శ్లో:-ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీ తటే సంధ్యాయాం రాజ భవనే విరూపాక్షస్తు పాతు మాం. భావము:- ప్రయాణముల యందును, మార్గముల యందును, వృక్ష మూలమునందు, నదీ తటముల యందు, సంధ్యా సమయము లందు, రాజ భవనముల యందు, నన్నా విరూపాక్షుడు రక్షించు గాక. శ్లో:-శీతోష్ణాదధ కాలేషు తుహిన ధ్రుమ కంటకే నిర్మానుష్యే సమే మార్గే త్రాహి మాం వృషభ ధ్వజ. భావము:- సీతా కాలమునందు, వేసవి కాలము నందు, మంచునందు, వృక్ష కంటకములయందు, నిర్మానుష్య ప్రదేశములయందు,సమ మార్గమునందు, వృషభ ధ్వజుడు నన్ను రక్షించు గాక. శ్లో:-ఇత్యేతద్రుద్ర కవచం పవిత్రం పాప నాశనం మహాదేవ ప్రసాదేవ దుర్వాసో ముని కల్పితం. భావము:- అను యీ విధమైనటువంటి రుద్ర కవచము పవిత్రమైనదియు, పాప నాశనమును కూడ. ఆ మహా దేవుని ప్రసాదము చేత దుర్వాస మునిచే కల్పింప బడినది. శ్లో:-మమాఖ్యాతం సమాసేన స భయం విందతే క్వచిత్. ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్యమాయుష్య వర్ధనం భావము:- నా చేత సంక్షిప్తముగా చెప్పబడిన దీనిని భయ భక్తులతో యెవరు వింటారో పరమ ఆరోగ్యము పొందుతారు. పుణ్యము, ఆయుర్దాయము, పెరుగును. శ్లో:-విద్యార్థీ లభతే విద్యా ధనార్థీ లభతే ధనం. కన్యార్థీ లభతే కన్యాం స భయం విందతే క్వచిత్. భావము:- విద్య కోరు వారికి విద్య లభించును. ధనము నాశించు వారికి ధనము లభించును. కన్య నాశించు వారికి కన్య లభించును. భయ రహితులై యుందురు. శ్లో:-అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ త్రాహి త్రాహి మహా దేవ త్రాహి త్రాహి త్రయీ మయ. భావము:- సంతానము లేని వారికి సంతానము కలుగును. మోక్షము కోరు వారికి మోక్షము లభించును. రక్షించు మహాదేవా రక్షించు. రక్షించు త్రయీమయా రక్షించు. శ్లో:-త్రాహి మాం పార్వతీ నాథ త్రాహి మాం త్రిపురాంతక పాశం ఖట్వాంగ దివ్యాస్త్రం త్రి శూలం రుద్రమేవచ. భావము:- ఓ పార్వతీ పతీ! నన్ను రక్షించుము. ఓ త్రిపురాంతకా! నన్ను రక్షించుము. పాశము, ఖట్వాంగ దివ్యాస్త్రము, త్రిశూలము ధరించిన రుద్రునకు నమస్కరింతును. శ్లో:-నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర శత్రు మధ్యే సభా మధ్యే గ్రామ మధ్యే గృహాంతరే. భావము:- దేవేశా! నమస్కరిస్తున్నాను. ఓ జగదీశ్వరా! శత్రు మధ్యమున, సభా మధ్యమున, గ్రామ మధ్యమున, గృహాంతరమున, నన్ను రక్షించుము. శ్లో:-గమనాగమనేచైవ త్రాహి మాం భక్త వత్సల త్వం చిత్తం త్వం మానసంచ త్వం బుద్ధిస్త్వం పరాయణం. భావము:- ఓ భక్త వత్సలా! ప్రయాణ సమయములలో వెళ్ళి వచ్చే సమయములందు నన్ను కాపాడుము. నీవే చిత్తము, నీవే మనస్సు, నీవే బుద్ధి. సర్వము నిన్నే పరాయణుడిగా కలవాడను. శ్లో:-కర్మణా మనసాచైవ త్వం బుద్ధిశ్చ యధా సదా జ్వర భయం ఛింది సర్వ జ్వర భయం ఛింది గ్రహ భయం. ఛింది భావము:- కర్మ చేత, మనసు చేత, బుద్ధి చేత ఎల్లప్పుడూ నాకు నీవే సుమా. జ్వరభయము నశించు గాక, సమస్త జ్వర భయము నశించు గాక. గ్రహ భయము నశించు గాక. శ్లో:- సర్వ శత్రూన్నివత్యాపి సర్వ వ్యాధి నివారణం. అస్య రుద్ర లోకం గచ్ఛతి శ్రీ రుద్ర లోకం స గచ్ఛతి. భావము:- నమస్త శత్రువులను నశింపఁ బడును సమస్త వ్యాధులు నివారింపఁ బడును. ఇది పఠించిన వారు రుద్రలోకమును చేరుదురు. అట్టి వారు తప్పక రుద్ర లోకమును చేరుదురు. ఓం నమః ఇతి స్వస్త్యస్తు. #తెలుసుకుందాం #🕉️హర హర మహాదేవ 🔱 #ఓం శివోహం... సర్వం శివమయం #చిదానంద రూప శివోహం శివోహం #om Arunachala siva🙏