👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
537 views
1 days ago
*🕉️కాటమ రాజే కనుమ దేవుడు !* సంక్రాంతి పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. కనుమ పండుగకు, కాటమ రాజుకు చాలా సంబంధం ఉంది. ఆయన నిర్మించిన గోదావరి తెలుగు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేసింది.అందుకే సంక్రాంతి చివరి రోజు సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు. వచ్చే ఏడాదిలో కూడా పాడిసంపద వృద్ధి చెంది, పంటలు సమృద్ధిగా పండితే మరింత ఘనంగా పూజలు చేస్తామని కాటమరాజుకు మొక్కులు సమర్పించుకుంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఏడాదికాలంగా తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు. కనుమరోజు అడవిలో దొరికే వివిధ వనమూలికతో కూడిన మిశ్రమాన్ని పశువులకు తినిపిస్తారు. దీనిని #ఉప్పుచెక్క అని కూడా అంటారు. ఏడాది కొకసారి పశువులకు ఉప్పుచెక్కను తినిపిస్తే అది వాటికి సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని రైతుల నమ్మకం. ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తీసుకెళ్లి, వాటికి శుభ్రంగా స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను రంగులు అద్దుతూ, ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలతో అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలి వేసి వాటికి విశ్రాంతినిస్తారు. మూడు రోజుల సంక్రాంతి పండుగలో ముఖ్యమైనది కనుమ. దీనికే పశువుల పండగని కూడా పేరు. సంవత్సరం పాటు పొలాల్లో పనిచేసి పంటలు ఇంటికి వచ్చేవరకు కష్టంలో పాలు పంచుకున్న పశువులను గౌరవించుకోవడం ఈ పండగ ప్రత్యేకత. పల్లెల్లో ఈ పండుగను ఘనంగా చేస్తారు. ప్రస్తుతం పశువులు తగ్గినా.. ఉన్నవాటికి పొద్దున్నే చెరువులు, కాలువల్లో స్నానం చేపించి, కొమ్ములకు కుప్పెలు చెక్కి, రంగురంగుల బూరలు కట్టి, నడుముకు మువ్వల పట్టిలు తో సాయంత్రం ఊరు ముందున్న కాటమరాజు వద్దకు మేళతాళాలతో చేరుకుంటారు. కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలిచేసి అందరికీ పంచి ముందే ఏర్పాటు చేసిన చిట్లాకుప్పను చీకటిపడే సమయంలో వెలిగించి దాని చుట్టూ పశువులను తిప్పి ఊర్లకు చేరుకుంటారు. ప్రతి ఊర్లో కాటమరాజును ప్రతిష్టించడం, పొంగలి సమర్పించడం, చిట్లా కుప్ప వేయడం, ఆ ఊరి వాళ్ళు తళిగ (పొంగలి కుప్ప)లను వేయడం, పోలిగాళ్ల సందడి, పొలి (అన్నంకుప్ప)ని పొలాల్లో, చెరువుల్లో పొలో… పొలి అని అరుస్తూ చల్లుతూ కాటమరాజుకు మొక్కడం తరతరాలుగా ప్రతి గ్రామంలో జరిగే సందడి కాటమ రాజే మూడో రోజు సంక్రాంతి దేవుడు. మంచి చేస్తే రైతులు దైవంలా భావిస్తారు. ఇప్పుడున్న పాలకులు కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తారని ఆశిద్దాం. 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #🐄కనుమ శుభాకాంక్షలు🌾 #🐄కనుమ శుభాకాంక్షలు🌾