#పురాణాలూ_కథలు
1K Posts • 3M views
*🕉️కాటమ రాజే కనుమ దేవుడు !* సంక్రాంతి పండగలో భాగంగా మూడో రోజు జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. కనుమ పండుగకు, కాటమ రాజుకు చాలా సంబంధం ఉంది. ఆయన నిర్మించిన గోదావరి తెలుగు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చేసింది.అందుకే సంక్రాంతి చివరి రోజు సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు. వచ్చే ఏడాదిలో కూడా పాడిసంపద వృద్ధి చెంది, పంటలు సమృద్ధిగా పండితే మరింత ఘనంగా పూజలు చేస్తామని కాటమరాజుకు మొక్కులు సమర్పించుకుంటారు. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. దీనిని పశువుల పండుగగా కూడా చెప్తారు. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఏడాదికాలంగా తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమకు ప్రాధాన్యం ఉంటుంది. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు. కనుమరోజు అడవిలో దొరికే వివిధ వనమూలికతో కూడిన మిశ్రమాన్ని పశువులకు తినిపిస్తారు. దీనిని #ఉప్పుచెక్క అని కూడా అంటారు. ఏడాది కొకసారి పశువులకు ఉప్పుచెక్కను తినిపిస్తే అది వాటికి సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని రైతుల నమ్మకం. ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తీసుకెళ్లి, వాటికి శుభ్రంగా స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను రంగులు అద్దుతూ, ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలతో అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలి వేసి వాటికి విశ్రాంతినిస్తారు. మూడు రోజుల సంక్రాంతి పండుగలో ముఖ్యమైనది కనుమ. దీనికే పశువుల పండగని కూడా పేరు. సంవత్సరం పాటు పొలాల్లో పనిచేసి పంటలు ఇంటికి వచ్చేవరకు కష్టంలో పాలు పంచుకున్న పశువులను గౌరవించుకోవడం ఈ పండగ ప్రత్యేకత. పల్లెల్లో ఈ పండుగను ఘనంగా చేస్తారు. ప్రస్తుతం పశువులు తగ్గినా.. ఉన్నవాటికి పొద్దున్నే చెరువులు, కాలువల్లో స్నానం చేపించి, కొమ్ములకు కుప్పెలు చెక్కి, రంగురంగుల బూరలు కట్టి, నడుముకు మువ్వల పట్టిలు తో సాయంత్రం ఊరు ముందున్న కాటమరాజు వద్దకు మేళతాళాలతో చేరుకుంటారు. కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలిచేసి అందరికీ పంచి ముందే ఏర్పాటు చేసిన చిట్లాకుప్పను చీకటిపడే సమయంలో వెలిగించి దాని చుట్టూ పశువులను తిప్పి ఊర్లకు చేరుకుంటారు. ప్రతి ఊర్లో కాటమరాజును ప్రతిష్టించడం, పొంగలి సమర్పించడం, చిట్లా కుప్ప వేయడం, ఆ ఊరి వాళ్ళు తళిగ (పొంగలి కుప్ప)లను వేయడం, పోలిగాళ్ల సందడి, పొలి (అన్నంకుప్ప)ని పొలాల్లో, చెరువుల్లో పొలో… పొలి అని అరుస్తూ చల్లుతూ కాటమరాజుకు మొక్కడం తరతరాలుగా ప్రతి గ్రామంలో జరిగే సందడి కాటమ రాజే మూడో రోజు సంక్రాంతి దేవుడు. మంచి చేస్తే రైతులు దైవంలా భావిస్తారు. ఇప్పుడున్న పాలకులు కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తారని ఆశిద్దాం. 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #🐄కనుమ శుభాకాంక్షలు🌾 #🐄కనుమ శుభాకాంక్షలు🌾
9 likes
8 shares
🙏🙏🙏🌹🌹🌹 🏹 మహాదేవుడు తన మూడవ కన్ను తెరిచినప్పుడు; #కామదేవుడు భస్మమైన అద్భుత కథ 🔥 ఇది ఒకప్పటి కథ. సతీదేవి ఆత్మార్పణం చేసుకున్న తర్వాత, హిమాలయాల కుమార్తెగా పార్వతిగా పునర్జన్మించి, శివుడిని పొందడం కోసం తీవ్ర తపస్సు చేస్తున్న సమయం అది. మరోవైపు, శివుడు సర్వస్వం త్యజించి గాఢ ధ్యానంలో లీనమై ఉన్నాడు. రాజేష్ సజ్జనార్ దేవతలకు ఒక సమస్య ఎదురైంది: శివుడి ధ్యానాన్ని ఎలా భగ్నం చేసి, ఆయన వివాహాన్ని ఎలా జరిపించాలి? అప్పుడు దేవేంద్రుడు ఒక ఉపాయం పన్నాడు... 🌸 కామదేవుని సందిగ్ధత మరియు త్యాగం: శివుడి ధ్యానాన్ని భగ్నం చేసే బాధ్యతను ఇంద్రుడు కామదేవుడికి అప్పగించాడు. మహాదేవుని ఆగ్రహానికి గురైతే మరణం తప్పదని కామదేవుడికి తెలుసు. అయినప్పటికీ, "పరుల శ్రేయస్సు కోసం తన శరీరాన్ని త్యాగం చేయడంలో ఉండే ఆనందం" కోసం, అతను తన త్యాగాన్ని చేయడానికి నిశ్చయించుకున్నాడు. 🌪️ కోరికల తుఫాను: తన ప్రభావంతో, కామదేవుడు ప్రపంచమంతటా కోరికల తుఫానును సృష్టించాడు, దానితో ఓర్పు, వివేకం మరియు విచక్షణ అదృశ్యమయ్యాయి. ప్రపంచమంతా కామంతో అంధమైపోయింది. కేవలం శ్రీరాముని కృప ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. 🔥 మహాదేవుని ఆగ్రహం మరియు మూడవ కన్ను: వసంత రుతువును అవకాశంగా తీసుకుని, కామదేవుడు తన ఐదు పూల బాణాలను శివుడిపైకి సంధించాడు. ఆ బాణాలు శివుడి హృదయాన్ని తాకగానే, ఆయన ధ్యానం భగ్నమైంది మరియు ఆయన తీవ్రమైన కోరికను అనుభవించాడు. మామిడి ఆకుల మధ్య దాగి ఉన్న కామదేవుడిని చూడగానే, ఆయన కోపం భయంకరంగా మారింది. అప్పుడు శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. ఆ చూపుకు కాముడు భయంతో వణికిపోయాడు. శివుడు తన మూడవ కన్ను తెరవగానే, ఒక్క క్షణంలో కామదేవుడు బూడిదగా మారిపోయాడు. ✨ రతీదేవి విలాపం మరియు వరం: తన భర్త దుస్థితిని చూసి రతీదేవి విలపించడం ప్రారంభించింది. అప్పుడు దయామయుడైన శివుడు ఆమెను ఓదార్చాడు: "ఓ రతీ! ఇప్పుడు నీ భర్త 'అనంగుడు' (శరీరం లేనివాడు) అని పిలువబడతాడు. అతను ఒక రూపంలో పునర్జన్మ పొందుతాడు మరియు మీరు తిరిగి కలుసుకుంటారు." పరోపకారం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ వృధా కాదని ఈ కథ మనకు బోధిస్తుంది. ఓం నమః శివాయ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #చిదానంద రూప శివోహం శివోహం #🕉️హర హర మహాదేవ 🔱 #om Arunachala siva🙏
15 likes
13 shares
కూర్చొన్న స్థితిలో ఉన్న శ్రీనివాసుడిని చూశారా? ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు. స్వయంభువుగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు. ఆయన ఎవరో కాదు తిరుమలో వెలిసిన శ్రీనివాసుడు. ఆ భక్తుడు ఎవరు? స్వామి ఎక్కడ వెలిసారు? ఎల్లప్పుడు నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగ ముద్రలో అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి తదితర వివరాలన్నీ మీకోసం. కలియుగదైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశ రాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో సేదతీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకొంటాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరుల పై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. రత్నఖచితమైన సువర్ణ కళశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను మూడు మండపాలను వంటశాలలను బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తైన తర్వాత ప్రతి రోజూ తిరుమలకు వెళ్లి తొండమానుడు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చేవాడు. శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటయ్యింది. ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతి రోజూ తిరుమలకు వెళ్లివచ్చేవాడు. కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్లలేకపోతాడు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నాని మొర పెట్టుకొంటాడు. దీంతో తన ఇంటనే స్వామి వెలిసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకొంటాడు. తొండమాను చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వేంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరోచేతితో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి, భూదేవి సమేతుడిగ ప్రసన్న వేంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చొన్న స్థితిలో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఈ స్థితిలో వేంకటేశ్వరుడు భక్తులకు ధర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. తిరుమలలోని ఆకాశగంగ, కపిల తీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమనాడులోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. ఈ క్షేత్రం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ తొండమనాడు గ్రామం ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. 🙏#ఓం_నమో_వేంకటేశాయ🚩🙏 #తెలుసుకుందాం ##పురాణాలూ_కథలు #om namo venkatesaya #🙏 ఓం నమో నారాయణ #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏
9 likes
7 shares