👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
665 views
23 days ago
నూతన సంవత్సరం 2026 జనవరి 3వ తేదీ శనివారం. శివుడికి ఎంతో ఇష్టమైన, విశిష్టమైన రోజుగా పండితులు చెబుతారు. ఎందుకంటే.. ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం లేదా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఇది శివుడి జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ నక్షత్రానికి విశిష్టత ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం శివుడి రుద్రరూపం, వినాశన, పునరుత్పత్తి శక్తులకు, భావోద్వేగ తీవ్రత, పరివర్తనకు ప్రతీక. ఇది కన్నీటి చుక్కగా సూచించబడుతుంది. అయితే ఈ జనవరి 3వ తేదీ ధనుర్మాసంలో వస్తుంది. ఈ మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం రోజున శివుని నక్షత్రంగా.. ఆరుద్రోత్సవంగా జరుపుకుంటారు. దీనిని శివ ముక్కోటి అని కూడా అంటారు. శ్రీమహావిష్ణువుకు సంబంధించి వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టమైనదిగా చెబుతారో.. శివుడికి శివ ముక్కోటి కూడా అంతే విశిష్టమైనది. జనవరి 3 శనివారం అయితే ఈ ఏడాది ఈ శివ ముక్కోటి జనవరి 3వ తేదీన శనివారం రోజు అందులోనూ పౌర్ణమి తిథితో కలిసి రావడం ఈ శివ ముక్కోటి విశేషమైన ప్రాధాన్యత నెలకొంది. ఈరోజున శివారాధనకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈరోజున పూర్వకాలం సంప్రదాయంగా కంచి పీఠాధిపతులు ఏర్పాటు చేసినటువంటి ఒక విశేషం ఏమిటంటే.. ఆరోజున తెల్లవారుజాము 3 గంటల నుంచి 5 గంటల లోపు పవిత్ర స్నానం ఆచరించి ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి. ఈ ఆరుద్ర నక్షత్రం శివుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపిస్తుందట. అలాగే చాలా కాంతివంతంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుందట. కాబట్టి ఈరోజున తెల్లవారుజామునే శివ రూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని.. సాక్షాత్తు శివుడిని దర్శించుకున్న ఫలితమే కలుగుతుందని పండితులు చెబుతున్నారు. పూజా విధానం ఈ రోజున శివుడిని నెయ్యితో అభిషేకం చేయడం, అర్చన చేయడం శుభప్రదం. ఆరోగ్యం కోసం మృత్యుంజయ స్తోత్రం చదవడం, సంపద కోసం శివ పంచాక్షరి పఠించడం, శివ నామస్మరణ చేయడం, ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి పఠించడం, శివ స్తోత్రాలు వంటివి పఠించడం ఎంతో శుభప్రదం. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కోరుకునే వారు గరికను నానబెట్టిన జలంతో శివుడికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చన చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. అలాగే పౌర్ణమి తిథి కాబట్టి తెల్లటి పూలతో శివార్చన చేయడం ఎంతో మంచిది. అంతే కాకుండా శనివారం వచ్చింది కాబట్టి నీలం రంగు పుష్పాలతో అర్చన చేయడం కూడా శుభప్రదం. ఇలా చేయడం వల్ల శని గ్రహ అనుకూలత కలుగుతందని కూడా చెబుతారు. ఇక నివేదనలో పరమాన్నం నివేదన చేసి.. ఇతరులకు పంచడం చేయడం మంచిది. #తెలుసుకుందాం #చిదానంద రూప శివోహం శివోహం #🕉️హర హర మహాదేవ 🔱 #om Arunachala siva🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ