JYOTHI KUMAR . P
632 views
తిరుమల లడ్డూపై సీబీఐ సంచలన రిపోర్ట్ టీటీడీకి సప్లయ్‌ చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్‌లోని నేషనల్‌ డెయిరీ డవలప్‌మెంట్‌ బోర్డు(NDDB) ద్వారా నెయ్యి శాంపిల్స్‌ను సీబీఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది. సీబీఐ దర్యాప్తుతో టీడీపీ, పచ్చ మీడియా ప్రచారాలు తప్పని అని తేలింది. 2024లో జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్‌లో మిగిలి ఉన్న శాంపిల్స్‌ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్‌డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్‌ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ ఇచ్చింది. #👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్