JYOTHI KUMAR . P
662 views • 8 days ago
సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ
సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ
సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ
సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ
అమరావతికి ప్రభుత్వం నుంచి
ఒక్క రూపాయి అవసరం లేదు
రైతుల నుంచి తీసుకున్న భూమిలో
అమరావతి అవసరాలకు పోను మిగిలిన
8వేల ఎకరాలు అమ్మితే సుమారుగా లక్ష కోట్లు వస్తాయి
ఆ డబ్బుతో రాజధాని కడతా అని
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు డప్పు వేసిన బాబు
నేడు చేస్తుంది ఏంటో?
1) 2015లో రాజధాని నిర్మాణానికి
తొలి విడతలో 53,748 ఎకరాల సమీకరణ
(గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడికొండ,
మంగళగరి మండలాల పరిధిలోని
29 గ్రామాలలో రాజధాని నిర్మాణం కోసం
భూ సమీకరణ కింద 29,442 మంది రైతుల నుంచి
34,823 ఎకరాలు 2015లో ప్రభుత్వం సమీకరించింది.
మరో 18,925 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి
53,748 ఎకరాల్లో (217 చదరపు కిలోమీటర్లు) రాజధాని
నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించింది.
భవనాలు, వసతులు, రైతుల ప్లాట్లకు పోగా
ఇంకా 8,250 ఎకరాలు మిగులుతుందన్న చంద్రబాబు )
2) రాజధాని అమరావతిలో
రెండో దశ భూ సమీకరణ
7 గ్రామాల్లో మరో 20,495 ఎకరాల
సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Nov 28 2025
(ల్యాండ్ పూలింగ్ క్రింద
7 రాజధాని గ్రామాల్లో 16,666 ఎకరాలు
మరియు మరో 3,828 ఎకరాల అసైన్డ్, పోరంబోకు భూమి)
3) మూడో విడతలో
మిగతా 24,182 ఎకరాల సమీకరణ దిశగా పావులు..
(భూ సమీకరణ మూడో విడత కూడా ఉంటుందని
పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం)
4) 53,748 ఎకరాల్లో
రాజధాని తొలి దశ నిర్మాణానికే
రూ.77,249 కోట్లు అవసరమన్న సీఎం
మొత్తం మీద
మొదటి విడతలో సేకరించిన దాంతో కలిపి
రెండు, మూడో దశల్లో సమీకరించే భూములతో
కలిపి 98,425 ఎకరాలలో రాజధాని అన్నమాట
ఈ లెక్కన
భూముల్లో రాజధాని నిర్మాణానికి
మరో రూ.3 లక్షల కోట్లు అవసరం
5) రాజధాని ప్రాంతంలో 2016–19 మధ్య
రహదారులు, మౌలిక సదుపాయాలు,
ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ల అభివృద్ధికి
సంబంధించిన పనులను 55 ప్యాకేజీల
కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు.
ఈ పనుల కోసం
సీఆర్‌డీఏ రూ.8,541 కోట్లను అప్పు తెచ్చింది.
కానీ.. ఆ పనులకు రూ.5,428 కోట్లను
మాత్రమే 2019 మే నాటికి వ్యయం చేసింది
బాబు ప్రభుత్వం .
ఇప్పుడు
రాజధాని నిర్మాణ పనుల కోసం
ఇప్పటికే ప్రపంచ బ్యాంకు,
ఆసియా అభివృద్ధి బ్యాంకు
(ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు,
హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు,
జర్మనీకి చెందిన
కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు,
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ నుంచి రూ.7,500 కోట్లు,
ఏపీఎస్‌పీసీఎల్ నుంచి రూ.1,500 కోట్లు
వెరసి రూ.40 వేల కోట్లు అప్పు
తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంది.
సీఆర్‌డీఏ బాండ్ల ద్వారా
మరో రూ.21 వేల కోట్లు సమీకరించడానికి
ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంటే..
ఇప్పటికే రూ.61 వేల కోట్లు అప్పులు
చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది.
ఇక 2025–26 బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి
రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు.
#👋సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి #☢️వైఎస్ఆర్ కాంగ్రెస్
11 likes
12 shares