👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
1.9K views
2 months ago
భగవద్గీత పారాయణవల్ల కొన్ని ఫలాలు కలుగుతాయని చెపుతారు. ఇవి అందులో ఉండే విషయాలను అర్థం చేసుకోవడం వల్ల కలిగేవి కావు. నియమంతో పారాయణ చేస్తే దావివల్ల పాపాలు పోయి పుణ్యం కలగడంవల్ల కలుగుతాయి. ఇవి వాటి వివరాలు. భగవద్గీత అధ్యాయాల పారాయణ ఫలాలు: 1. అర్జునవిషాదయోగం – దీన్ని చదవడంవల్ల మానవుడికి పూర్వ జన్మస్మృతి కలుగుతుంది. 2. సాంఖ్యయోగం - దీని వల్ల ఆత్మన్వరూపం గోచరిస్తుంది. 3 కర్మయోగం – దీన్ని ఎవరైనా -పారాయణం చేస్తే, ఆత్మహత్య వగైరాల ఎల్ల చనిపోయి, ప్రేతత్వం పోకుండా ఉండే జీవులక్కడ ఉంటే వారికి ప్రేతత్వం నశిస్తుంది. 4–5. జ్ఞానయోగం – కర్మసన్న్యానయోగం - ఈ అధ్యాయాలు వింటే చెట్లు, పశువులు, పక్షులు గూడ పాపం నశించి, ఉత్తమగతిని పొందుతాయి. 6. ఆత్మసంయమయోగం – పారాయణచేస్తే సమన్త దానాల ఫలితం కలిగి విష్ణుసాయుజ్యం కలుగుతుంది. 7. విజ్ఞానయోగం – ఈ అధ్యాయాన్ని వింటే జన్మరాహిత్యం కలుగుతుంది. 8. అక్షరపరబ్రహ్మయోగం – ఈ అధ్యాయం వింటే స్థావరత్వం, బ్రహ్మరాక్షనత్వం తొలగిపోతాయి. 9. రాజవిద్యా రాజగుహ్యయోగం - దీన్ని చదివితే ఇతరుల దగ్గర ఏదైనా వస్తువు తీసుకున్నందువల్ల మనకు వారినుంచి సంక్రమించిన పాపం నశిస్తుంది. 10. విభూతియోగం - ఆశ్రమధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏపుణ్యం కలుగుతుందో అది లభిస్తుంది. జ్ఞానం బాగా ఏర్పడుతుంది. 11. విశ్వరూప సందర్శనయోగం - దీన్ని పారాయణం చేయడంవల్ల చనిపోయిన వారు కూడా తిరిగి జీవిస్తారు. 12. భక్తియోగం - దీనివల్ల ఇష్టదేవతా సాక్షాత్కారం కలుగుతుంది. చనిపోయిన వారు కూడా దీనివల్ల బ్రతుకుతారు. 13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం - దీన్ని పారాయణం చేస్తే చండాలత్వం వశిస్తుంది. 14. గుణత్రయ విభాగయోగం - దీనివల్ల స్త్రీహత్యాపాతకం, వ్యభిచారదోషం నశిస్తాయి. 15. పురుషోత్తమ ప్రాప్తియోగం - ఇది భోజనానికి ముందు చదవతగింది. దీనివల్ల ఆహారశుద్ధి కలుగుతుంది. మోక్షం సిద్ధిస్తుంది. 16. దైవాసుర సంపద్విభాగయోగం - దీనివల్ల బలపరాక్రమాలు, నుఖం లభిస్తాయి 17. శ్రద్ధాత్రయవిభాగయోగం - దీనివల్ల ఎన్నో తీవ్రమైన వ్యాధులు నశిస్తాయి. 18 మోక్షసన్న్యానయోగం - దీనివల్ల సమస్త యజ్ఞాచరణఫలం కలుగుతుంది. ఉద్యోగం లభిస్తుంది. కృష్ణం వందే జగద్గురుం 🙏 #తెలుసుకుందాం #కార్తీక దామోదరాయ నమః #భగవద్గీత🙏 #🙏🏼భగవద్గీత #🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏