Future Pawanisam
15.9K views
1 months ago
పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ నాయకుల దిష్టి తగిలింది: నందగిరి సతీష్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట డివిజన్ బస్ స్టాప్ లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ నందగిరి సతీష్ ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి దిష్టి తీయడం జరిగింది. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ గత పది రోజుల క్రితం ఏపీ కోనసీమలో కళ్యాణ్ గారి పర్యటనలో భాగంగా కొబ్బరి చెట్ల విషయంలో మాట్లాడిన మాటలని తెలంగాణ కాంగ్రెస్ పెద్దలంతా ఇక్కడి ప్రజల దృష్టి అని వక్రీకరించి నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సందర్భంగా వారి అజ్ఞానానికి చింతిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వారి అసలైన రాజకీయ దిష్టి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తగిలినందుకు ఈరోజు ఆయన చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి గుమ్మడికాయతో దిష్టి తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విరమహిళా విభాగం చైర్మన్ కావ్య గారు, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ మాధవరెడ్డి గారూ, వీర మహిళలు లక్ష్మీ, రమ్య, సంతోషి, వెంకటలక్ష్మి, పద్మజ, జయమ్మ, స్వాతి, నాయకులు జీవన్, సాయికృష్ణ, దుర్గ ప్రసాద్, రమేష్, రామకృష్ణ, వెంకటేష్, మహేష్, ప్రవీణ్, శ్రీకాంత్, కళ్యాణ్ నాయుడు, పవన్, వెంకటేష్, లానా గార్లతో పాటు జనశ్రేణులు భారీగా పాల్గొన్నారు. #pawan kalyan #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #futurepawanisam #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్