#🗞️అక్టోబర్ 19th అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party బీఆర్‌ఎస్‌లోకి ఊపందుకున్న చేరికలు 💥
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన మాజీ డీసీఎంఎస్ చైర్మన్, మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, మరియు ఆయన కుమారుడు పెద్దషాపూర్ మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్, 2018లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన అంజిబాబు దంపతులు తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ గారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్‌రెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.