P.Venkateswara Rao
658 views
3 months ago
#చంద్రబాబు నాయుడు #ఏపీ అప్ డేట్స్..📖 #నూతన మద్యం పాలసీ⁉️ *చంద్రబాబు సంచలన నిర్ణయం.. పార్టీ నుంచి ఇద్దరు కీలక నేతలు సస్పెండ్..*❗ 05.10.2025🎯 కల్తీ మద్యం వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. నకిలీ మద్యం దందా మాత్రం టీడీపీ కీలక నేత కనుసన్నల్లోనే జరుగుతోందని అధికారులు తేల్చడం మరింత సంచలనంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశించారు. నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. నకిలీ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి(Jayachandra Reddy), కట్టా సురేంద్రలను(Katta Surendra) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీ టీడీజీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస రావు అధికారిక ప్రకటన విడుదల చేశారు.