Mohan
1.8K views
6 months ago
#🔴జూలై 9th అప్‌డేట్స్📢 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #kcr ప్రజా సమస్యలపై ఉద్యమిద్దాం! 📌 గోదావరి పరీవాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్ర. కాళేశ్వరం జలాల కోసం ఎదురుచూస్తున్న పంట పొలాలు 📌 ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ సిద్ధం చేయండి. 5 రోజులుగా నందినగర్‌లో పార్టీ నేతలతో కేసీఆర్‌ చర్చలు 📌 రాష్ట్రంలో వర్తమాన పరిస్థితులపై జిల్లాల వారీగా సమీక్షలు 📌 ‘స్థానిక’ ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధంచేయాలని దిశానిర్దేశం 📌 నేడు మరోసారి వైద్యపరీక్షల కోసం యశోద దవాఖానకు కేసీఆర్‌ కాంగ్రెస్‌ పాలనలో అన్నదాతలను ఆదుకునే నాథుడేలేడని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ నాయకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పాలన పూర్తిగా అదుపుతప్పిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. గత గురువారం స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద దవాఖానలో అడ్మిట్‌ అయిన కేసీఆర్‌.. రెండు రోజులపాటు వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సూచన మేరకు డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి నందినగర్‌ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ ఆరోగ్యం కుదుటపడింది. తనను పరామర్శించడానికి వచ్చిన పార్టీ సీనియర్లతో ఐదు రోజులుగా సుదీర్ఘ చర్చలు చేస్తున్నారు. నాటి తెలంగాణ ఉద్యమకారులతో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, పలు అంశాల మీద మాట్లాడుతున్నారు. ఉద్యమకాలం నాటి అనుభవాలను స్మరించుకుంటున్నారు. ‘ఉద్యమ సమయంలో తెలంగాణ పరిస్థితి ఎట్లుండే.. అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎంత గొప్పగా రాష్ట్రం ప్రగతిని సాధించింది..’ అనే విషయాలను పార్టీ నేతలు అధినేతతో గుర్తుచేసుకుంటున్నారు. నేటి కాంగ్రెస్‌ పాలనతో పోల్చి చూసుకుంటూ ఎట్ల ఉన్న తెలంగాణ ఎట్లయి పోతున్నదని ఆవేదన చెందుతున్నారు. వైద్యుల సూచనల మేరకు మరోసారి వైద్యపరీక్షల కోసం గురువారం యశోద దవాఖానకు కేసీఆర్‌ వెళ్లనున్నారు.