🌿🌼🙏పంచభూత లింగాలు ఏవి ? అవి ఎక్కడ ఉన్నాయి?🙏🌼🌿
🌿🌼🙏ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు, అందుకు ఎన్నో కారణాలూ ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే, ఏదీ ఆలస్యం కాదు, అందరమూ తెలుసుకుని, ఆచరించే ప్రయత్నం చేద్దాం, ఈ సంభవామి యుగే యుగే అనే పేజీని సృష్టించింది అమూల్యమైన, అపూర్వమైన, అద్భుతమైన లీలలను, చిత్రాలను, స్తోత్రాలను నేను తెలుసుకున్నవి, సేకరించినవి నలుగురికీ తెలియజేసే ప్రయత్నంలో భాగమే. కేవలం లైక్స్ కోసమో, పేరు కోసమో, పోటీ కోసమో కాదు సుమా ... అందరికీ ఉపయోగపడితే అదే సత్ఫలితంగా భావిస్తాను, అందుకే అందరినీ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములను చేయాలనే దయచేసి షేర్ చేయమని అభ్యర్ధిస్తుంటాను ... మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ సంభవామి యుగే యుగే 🙏🌼🌿
🌿🌼🙏పంచభూత లింగాలు ఏవి ? అవి ఎక్కడ ఉన్నాయి?🙏🌼🌿
🌿🌼🙏లింగరూపం గా ఉండే శంకరుడు పంచభూతాలకి ప్రతీకగా ఐదు చోట్ల లింగాకారములో ఉన్నాడు . పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.🙏🌼🌿
🌿🌼🙏1. #పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. #ఏకాంబరేశ్వర_స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.🙏🌼🌿
🌿🌼🙏2. #ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో #నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.🙏🌼🌿
🌿🌼🙏3. #జలలింగం: ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడు లోని తిరుచునాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు #జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.🙏🌼🌿
🌿🌼🙏4. #తేజోలింగం: తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రం పై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే #అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అపితకుచాంబ దేవి .🙏🌼🌿
🌿🌼🙏5. #వాయులింగం: ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు #కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.🙏🌼🌿
🌿🌼🙏అందరం భక్తితో " అరుణాచల శివ " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం ... ఎంత స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆ అరుణాచలేశ్వరుడు
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
#🌅శుభోదయం #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #😇శివ లీలలు✨