ShareChat
click to see wallet page
search
#సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 2026 సంక్రాంతి సంబరాలు - సింహాచలం తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సింహగిరిపై జనవరి 14 నుండి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు: ముగ్గుల పోటీలు (జనవరి 13, 2026): సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 గంటల వరకు దేవాలయ రాజగోపురం ముందున్న మాడ వీధుల్లో భక్తులు ముగ్గులు వేయవచ్చు. విజేతలకు జనవరి 14 ఉదయం 9:00 గంటలకు బహుమతులు అందజేస్తారు. భోగి పండుగ (జనవరి 14, 2026 - బుధవారం): సింహగిరిపై భోగి మంటలు, గొబ్బెమ్మలు, ముత్యాల ముగ్గులు, చెరకు గెడల అలంకరణలు ఉంటాయి. డూడు బసవన్నలు, హరిదాసుల కీర్తనలు, జంగమదేవరలు, కోమ్మాదాసరి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వేదమంత్రోచ్ఛారణలతో గోపూజ నిర్వహిస్తారు. చిన్నపిల్లలకు భోగి పళ్లు: ఉదయం 9:00 గంటలకు కొండపై ఉన్న కళావేదిక వద్ద చిన్న పిల్లలకు భోగి పళ్లు పోసే కార్యక్రమం ఉంటుంది. కనుమ (జనవరి 16, 2026): ఉదయం 9:00 గంటలకు కృష్ణాపురం వద్ద ఉన్న దేవస్థానం గోశాలలో విశేష గోపూజలు నిర్వహిస్తారు. ముఖ్య గమనిక: భక్తులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని అప్పన్న స్వామిని దర్శించుకోవాలని, ఈ సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములు కావాలని డిప్యూటీ కమిషనర్ సుజాత గారు కోరారు.🤝👏🤝 #సింహాద్రి అప్పన్న #సింహాచలం సింహాద్రి అప్పన్న
సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు - నరసింహ దీక్షదారుల శోభాయాత్ర Simhachalam updates నరసింహ దీక్షదారుల శోభాయాత్ర Simhachalam updates - ShareChat