P.Venkateswara Rao
540 views • 1 months ago
#తెలంగాణా రాజకీయాలు 🚩🚩😁
*రామోజీ ఫిల్మ్ సిటీపై రేవంత్ నోరెత్తరేం❗*
17.09.2026🎯
లక్ష కోట్ల విలువ చేసే భూముల్ని బీఆర్ఎన్ నేతలు కొట్టేశారని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేవలం ఆరోపించడమే కాదు, విచారణ జరిపి, నిజాల్ని నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీని కూడా రేవంత్‌రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు వెళ్లాయి.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు ప్రభుత్వం కాపలాదారుగా వుండాలి. దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి లేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని , అక్రమాలకు ఏ రీతిలో తెరలేపుతున్నారో అందరికీ తెలిసిందే.
అక్రమాలపై పోరాటం, ఆరాటం కేవలం రాజకీయ వేధింపులకు పరిమితం కాకూడదు.
రేవంత్‌రెడ్డి సర్కార్ తీరు చూస్తుంటే, ఎందుకు పూర్తి నిష్పక్షపాతం కనిపించడం లేదు. తెలంగాణ అసెంబ్లీలో నిషేధిత భూములపై చర్చలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు.
బీఆర్ఎస్ నేతలతో పాటు ఆ పార్టీకి అనుకూలమనే ముద్ర ఉన్న మై హోమ్ రామేశ్వర్ లాంటి వారి భూదోపిడీపై రేవంత్‌రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. భూదోపిడీని నిర్మూలించాలని రాజకీయాలకు అతీతంగా ప్రజలు కోరుకుంటున్నారు.
తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ పాలనలో సాగిన భూఆక్రమణల గురించి ఏకరవు పెట్టిన రేవంత్‌రెడ్డి, మీడియాధిపతి రామోజీరావు నిర్మించిన ఫిల్మ్‌సిటీలో అక్రమాలపై మాత్రం నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
హైదరాబాద్ శివార్లలో అబ్లుల్లాపూర్‌మెట్‌లో 2 వేల ఎకరాలకు పైగా స్థలంలో రామోజీఫిల్మ్ సిటీ నిర్మించారు.
రామోజీ ఫిల్మ్ సిటీ పరిధిలో వందల ఎకరాల అసైన్డ్ భూములు (ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు), ల్యాండ్ సీలింగ్ పరిమితికి మించిన భూములు, అటవీ భూములు ఉన్నట్టు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయి.
ఇందుకు సంబంధించి ఇప్పటికీ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతుంటాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో తాను అధికారంలోకి వస్తే లక్ష నాగళ్లతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నుతానని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యారు. తొమ్మిదేళ్లకు పైగా ఆయన అధికారంలో ఉన్నారు. రామోజీకి వంత పాడడం తప్ప, రామోజీ ఫిల్మ్ సిటీలోని వివాదాస్పద భూముల జోలికి వెళ్లలేదు. ఏ చట్టమూ రామోజీకి వర్తించదన్న ఉండవల్లి అరుణ్‌కుమార్ తరచూ చెప్పే మాటే నిజమైంది.
నాడు కేసీఆర్ ఫిల్మ్ సిటీ అక్రమాలకు అండగా నిలవగా, నేడు దాన్నే రేవంత్‌రెడ్డి కొనసాగిస్తుండడం విశేషం. సహజంగా కాంగ్రెస్‌కు రామోజీ మొదటి నుంచి వ్యతిరేకి.
అయితే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులో తమ అనుకూల సీఎంగా రేవంత్‌రెడ్డి ఉన్నాడని టీడీపీ, ఆ పార్టీని మోసే మీడియా భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా తెలంగాణలో పరిపాలనా వ్యవహారాలు కూడా నడుస్తున్నట్టే కనిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల భూఆక్రమణలపై చెలరేగిపోయారే తప్ప, మీడియాధిపతి భూబాగోతంపై మాత్రం నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది.
తమకు అనుకూలమైతే చాలు, పేదలు, ప్రభుత్వ భూమిని కొల్లగొట్టినా ఫర్వాలేదన్న సంకేతాల్ని పాలకులు పంపుతుండడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
12 shares