పాకిస్తాన్లో ఆకాశాన్నిటిన టమోటా ధర.. కేజీ ໕.700
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్లో టమోటా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లో కిలో టమోటాలు రూ.700 వరకు అమ్ముడవుతున్నాయి. కొన్ని వారాల క్రితం వరకు కిలో రూ.100 ఉన్న టమోటాల ధరలు భారీ వర్షాలు, వరదలు, ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్యంలో అంతరాయం వంటి కారణాలతో విపరీతంగా పెరిగాయి. జీలం, గుజ్రాన్వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, లాహోర్ వంటి నగరాల్లో ధరలు ప్రభుత్వ నిర్దేశిత ధరల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో వాణిజ్య మార్గాలు మూసివేయడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
నటి గ్లామర్ ఫోటోలు షేర్ చేసిన డిప్యూటీ సీఎం.. ట్రోల్స్
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అనుకోకుండా నటి నివాశియ్ని కృష్ణన్ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, వెంటనే తొలగించారు. అయితే అప్పటికే స్క్రీన్ షాట్లు వైరల్ అవ్వడంతో, ఉదయనిధి కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా గతంలో వీరిద్దరి మధ్య ఏవేవో జరిగాయి అయి వీడియోలు బయటకు వదులుతున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పేరు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రెండ్ అవుతోంది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణ సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణుల కమిటీ నివేదికపై చర్చించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అలాగే, ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్కు ఆమోదం తెలపనుంది. పలు నీటిపారుదల ప్రాజెక్టులపై కూడా కేబినెట్ చర్చించనుంది #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
భారీగా తగ్గనున్న చికెన్ ధరలు.. ఎందుకంటే!
కార్తీక మాసం ప్రారంభం కావడంతో మాంసాహారం వినియోగం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. శివారాధనలో భాగంగా చాలామంది ఈ నెలలో మాంసం తినడం మానేయడంతో చికెన్కు డిమాండ్ తగ్గనుంది. ప్రస్తుతం ప్రాంతానుసారం కోడి మాంసం కేజీ ధర రూ.210 నుంచి రూ.250 వరకు ఉండగా, వచ్చే రెండు మూడు రోజుల్లో చికెన్ ధర రూ.170-180కి దిగొచ్చే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬
భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా.ల గోల్డ్ ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200 వద్ద కొనసాగుతోంది. అటు 22 క్యారెట్ల .3,100 5 5.1,16,600 10. చేరింది. కేజీ వెండి ధర హైదరాబాద్ లో రూ.1,81,900 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్ది నెలలుగా అప్రతిహతంగా పెరుగుతూ
వస్తున్న బంగారం, వెండి ధరలు ఉన్నట్టుండి కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లలో గత 12 ఏళ్లలోలేని విధంగా పసిడి ఔన్స్ (31.1 గ్రాములు) 6.3 శాతం పతనంకాగా.. వెండి మరింత అధికంగా 2021 తదుపరి 8.7 శాతం పడిపోయింది. వెరసి యూఎస్ కామెక్స్లో ఔన్స్ పసిడి ధర 4,082 డాలర్లకు చేరగా.. వెండి ఔన్స్ 47.89 డాలర్లను తాకింది. దీంతో దేశీయంగా బంగారం 10 గ్రాములు కనీసం రూ.6,000 తగ్గవలసి ఉన్నట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬
భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా.ల గోల్డ్ ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200 వద్ద కొనసాగుతోంది. అటు 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.3,100 తగ్గి రూ.1,16,600కు చేరింది. కేజీ వెండి ధర హైదరాబాద్ లో రూ.1,81,900 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
#😭గుండెపోటుతో నటుడు రిషబ్ మృతి! #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬
నాగర్కర్నూల్: కుక్కల స్వైర విహారం.. 9 మందిపై దాడి
సిర్శనగండ్ల గ్రామ పంచాయతీలో ఒక్కరోజులో తొమ్మిది మందిపై కుక్కలు దాడి చేసి గాయపరిచినా అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా వరుస దాడులతో ప్రజలు, ముఖ్యంగా పిల్లలు భయంతో ఇళ్లకే పరిమితమవుతున్నారు. గ్రామ యువకులు పంచాయతీ అధికారులకు విన్నవించినా స్పందన లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. మండలంలోని ఇతర గ్రామాల్లోనూ కుక్కల బెడద ఎక్కువై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. #🗞️అక్టోబర్ 22nd అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢