ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి
కూటమి ప్రభుత్వం కృషి..
గిద్దలూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో పాల్గోన్న ఆర్టీసీ డీ.ఎం ద్వారకా తిరుమలరావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
గిద్దలూరు ఆర్టీసీ డిపోను మరింత అభివృద్ధి చేయాలని కోరిన ఎమ్మెల్యే ముత్తుముల*
తక్షణమే ఆర్టీసీ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేసిన ఆర్టీసీ ఎం.డీ ద్వారకా..
ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఆర్టిసి ఎండి శ్రీ సి.హెచ్ ద్వారకా తిరుమలరావు గారు పేర్కొన్నారు. గిద్దలూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో రాష్ట్ర ఆర్టీసీ ఎం.డీ శ్రీ ద్వారకా తిరుమలరావు మరియు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.. మొదటగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించి, డిపో ప్రాంగణంలో పూలమొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గత వైసీపీ పాలకులు కేవలం తమ స్వార్ధం కోసం ఆర్టీసీ విలీనం పేరుతో ఆర్టీసీ కార్మికులను నయవంచన చేశారని కార్మికుల ఖాతాల్లోని పిఎఫ్ నగదును సైతం కాచేశారన్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనాయకుడు నారా లోకేష్ గార్లు నిత్యం కార్మికుల సంక్షేమం కోసమే శ్రమిస్తున్నారనన్నారు. గిద్దలూరు ఆర్టీసీ డిపోను గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అభివృద్ధి చేశానని, ప్రస్తుతం గిద్దలూరు ఆర్టీసీ డిపోను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ప్రయాణికులకు విశ్రాంతి, గదులు మరియు మరుగుదొడ్లు, ఆర్టీసీ కార్మికులకు విశ్రాంతి గదులు ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని ఎండీ గారిని కోరగా తక్షణమే స్పందించిన ఎండీ ద్వారకా తిరుమల రావు గారు గిద్దలూరు ఆర్టీసీ డిపో అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు చేశారు. ఈ సందర్బంగా ఆర్టీసీ కార్మికులు గిద్దలూరు ప్రజల తరుపున ఎమ్మెల్యే ధన్యవాదములు తెలిపారు. అనంతరం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకం సజావుగా సాగుతుందని, స్త్రీ శక్తి పథకం విజయంలో ఆర్టీసీ కార్మికులదే ప్రధాన పాత్ర అని అన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల మందికి పదోన్నతులు లభిస్తున్నాయని, అందులో మన జోన్ లో 1964 మందికి పదోన్నతులు లభిస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ లో ఉన్న డీఎ లను విడుదల చేశామన్నారు.. గిద్దలూరు ఆర్టీసీ ముందుకు నడవటంలో డ్రైవర్, కండక్టర్లతో పాటు డిపోలోని గ్యారేజ్ కార్మికులు చాలా ప్రతిభ కలిగిన వారని, బస్సులు ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా నడవాలంటే గ్యారేజ్ కార్మికుల కృషే అని అన్నారు. కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రత, మౌళిక వసతుల కల్పన దిశగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్బంగా ఆర్టీసీ డిపోలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంశా పత్రాలను అందచేశారు. ఆర్టీసీ గ్యారేజ్ కార్మికులకు రైన్ కోట్లను అందచేశారు.. ఈ కార్యక్రమలో నెల్లూరు జోన్ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ సురేష్ రెడ్డి, నెల్లూరు జోన్ ఈడీ రాజేంద్ర ప్రసాద్, ఆర్టీసీ ఈడీఓ అప్పలరాజు, ఈడీఈ చెంగల్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, ఆర్టీసీ ఇన్ఛార్జ్ డీఎం మౌనిక, గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, మరియు మరియు ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు పాల్గోన్నారు. #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
మొన్ననే 21 వ తారీఖున పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారు రాష్ట్ర పోలీసు శాఖకు చెప్పిన మాట"లా అండ్ ఆర్డర్ కంటే నాకు ఏది ముఖ్యం కాదు"ఆడబిడ్డల జోలికి వస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు అవ్వాలి🔥🔥.... #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలి : గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల
గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి పట్ల నిరంతర శ్రద్ధ చూపుతూ, గౌరవ శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ జల వనరుల శాఖ (RWS) డిపార్ట్మెంట్ DE, AE లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు నియోజకవర్గంలోని తాగునీటి సరఫరా, ప్రాజెక్టుల పురోగతి మరియు ప్రజలకు అందుతున్న సేవలపై విపులంగా సమీక్షించారు.
గతంలో జల జీవన్ మిషన్ (JJM) ద్వారా మంజూరైన కొన్ని వర్కులు రద్దు చేయబడిన విషయాన్ని ప్రస్తావించి, అవి తిరిగి మంజూరు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న గ్రామాలను గుర్తించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
అలాగే గురుకుల పాఠశాలల్లో బాత్రూములు, లాట్రిన్లు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, విద్యార్థుల ఆరోగ్యం మరియు పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అధికారులు గ్రామాల్లో తరచుగా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో RWS శాఖ డిప్యూటీ ఇంజనీర్ (DE), అసిస్టెంట్ ఇంజనీర్ (AE) లు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్
*అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల...*
*కార్తీక మాస ప్రారంభోత్సవం, సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికీ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఎమ్మెల్యే గారి స్వగ్రామమైన కొమరోలు మండలం, హనుమంతరాయుని పల్లె గ్రామంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికీ పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామి వారికీ అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యే మరియు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాలను అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. స్వంత గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను కలిసేందుకు స్థానిక ప్రజలు, చుట్టు పక్క గ్రామాల ప్రజలు రావటంతో ఎమ్మెల్యే వారితో ఆత్మీయంగా మాట్లాడి యోగాక్షేమాలను అడిగి, గ్రామాల్లోని పరిస్థితులను గురించి తెలుసుకున్నారు...*
*ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి పుష్పలీల, కుమారులు దివ్యేష్, భవజ్ఞ, సోదరులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంజీవ రెడ్డి, వారి సోదరి గీత, తదితర కుటుంబ సభ్యులు పాల్గోన్నారు..* #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
#గిద్దలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్బన్ సీఐ సురేష్ కుమార్ , రూరల్ ci రామకోటయ్య ఆధ్వర్యంలో పోలీసుల అమరవీరుల సమస్మరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు
ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండలం అర్బన్ సీఐ సురేష్ కుమార్, రూరల్ సీఐ రామకోటయ్య, మరియు గిద్దలూరు ఎస్సై జిలాని, రాచర్ల మండలం ఎస్ఐ కోటేశ్వరరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
#PoliceCommemorationDay
#AndhraPradesh
Prakasam Police #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
ప్రజాస్వామ్య రక్షణే పరమావధిగా, సమాజ శ్రేయస్సే ఊపిరిగా, ప్రజల రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ ఇదే మా ఘన నివాళి
#POLICE #APPOLICE #nationalPoliceMemorial #AndhraPradesh #TeluguDesamParty #Chandrababunaidu #NaraLokesh #muttumulaashokreddy
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
ప్రకాశం జిల్లా : #గిద్దలూరు పట్టణంలోని Telugu Desam Party (TDP) కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధీ (#CMRF ) ద్వారా నియోజకవర్గంలోని 100 మందికి #54లక్షల రూపాయలు చెక్కులు పంప్పిణి చేసినా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు...
Nara Chandrababu Naidu
Narendra Modi
Pawan Kalyan
Lokesh Nara
#CMRF
#ThankYouCMsir
#📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్
#ఆర్_అండ్_ఆర_డెవలపర్స్_వారి_నూతన_సంవత్సర_బంపర్_ఆఫర్
ప్రకాశంజిల్లా : #గిద్దలూరు పట్టణం *ఆర్ అండ్ ఆర్ డెవలపర్స్* వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా #లక్కీడిప్
గిద్దలూరు పట్టణంలోని #నరవ రోడ్ లోని *ఆనంద నిలయం అపార్మెంట్స్* ఎదురుగా ఉన్న మా వెంచర్ లో #రూ2500రూపాయలకే #12లక్షల50వేలు విలువగల #ఐదుసెంట్లు ఫ్లాట్...
*పూర్తి వివరాలు*:
01. *1000* టోకెన్లు మాత్రమే
02. టోకెన్ విలువ రూ *2500* మాత్రమే
*బహుమతులు*
01. మొదటి బహుమతి *12 లక్షల 50 వేల* విలువగల *5 సెంట్లు* ప్లాటు
02. రెండొవ బహుమతి *7లక్షల 50 వేల* విలువగల *3 సెంట్లు* ప్లాటు
03. మూడోవ బహుమతి *5 లక్షల* విలువగల *2 సెంట్లు* ప్లాటు
*ముఖ్యగమనిక* : బహుమతులు గెలుపొందిన వారు వారి సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ వెంటనే చేపించుకొనవలెను...
*డ్రా తేదీ* : *డిసెంబర్ 31 2025* వ తారీఖునా ఉదయం 10:00 గంటలకు మా వెంచేర్ నందు *డ్రా* తీయడం జరుగుతుంది...
*పూర్తి వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్*
01: *పిడతల రవి తేజ* : 9110574233
02: *దండెబోయిన పెద్ద రమణ* : 7780237985
03: *జర్రిపోతుల శ్రీను* : 9642808494
04: #దూదేకులదస్తగిరి : 6301252227
05: #బొర్రారాఘవేంద్రయాదవ్ 9502370324
#🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్
#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు
చల్లకు వచ్చి ముంత దాచినట్లు చంద్రబాబు అసలు విషయం దాచాడా?
మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!
ప్రధాని మోదీని జీఎస్టీ ప్రచార సభకు ఆహ్వానించే నెపంతోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని మన స్థానిక మీడియా తొలిరోజు చేసిన ప్రచారం... నిజానికి "చల్లకు వచ్చి ముంత దాచినట్టు" ఉందన్నది జాతీయ, అంతర్జాతీయ మీడియా వర్గాల అసలు విశ్లేషణ.
కర్నూలులో జరిగే సభ ఆహ్వానం కేవలం పైకి కనిపించే అంశం మాత్రమే. అక్టోబర్ 13న మోదీతో భేటీ, ఆ మరుసటి రోజు రూ. 84,000 కోట్ల ($10 బిలియన్లు) విలువైన గూగుల్ AI డేటా సెంటర్ ఒప్పందంపై సంతకం చేయడమే ఈ పర్యటన వెనుక ఉన్న 'అసలైన ఎజెండా' అని జాతీయ మీడియా పత్రికలు స్పష్టం చేశాయి. దేశ ఆర్థిక సంస్కరణల చరిత్రలోనే ఇది అతిపెద్ద సింగిల్ FDIగా రికార్డు సృష్టించింది. ఈ డీల్‌ను 'ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌కు కొత్త ఊపిరి' పోసిన ' ఆర్థిక బలమైన ఆమోదం'గా జాతీయ పత్రికలు కీర్తించాయి.
ఈ ఒప్పందం విశాఖపట్నాన్ని భారతదేశపు మొట్టమొదటి 'AI సిటీ'గా మార్చబోతోందనే అంశాన్ని ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్ వంటి సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. కేవలం పెట్టుబడి విలువనే కాక, దాని వెనుక ఉన్న వ్యూహాత్మక విధాన మార్పును మీడియా హైలైట్ చేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా విశ్లేషణ ప్రకారం, రూ. 84,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని, కేంద్ర ప్రభుత్వ నేషనల్ డేటా సెంటర్ పాలసీలో మార్పులను, కీలకమైన పన్ను మినహాయింపులను సాధించడం ఒక 'కీలకమైన ఆర్థిక విధాన విజయం'. ఈ AI అస్త్రం ద్వారా రాష్ట్ర GSDPకి ఏటా సగటున రూ. 10,518 కోట్ల సహకారం, అలాగే 1.88 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయనే లెక్కలు రాష్ట్ర పురోగతికి సంకేతంగా మారాయి.
మరోవైపు, అంతర్జాతీయ మీడియా ఈ పెట్టుబడిని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానిక పెట్టుబడుల కోసం అభ్యర్థించిన 'హోమ్ కాల్'ను గూగుల్ పట్టించుకోలేదు అన్న కోణంలో విశ్లేషించింది. రాయిటర్స్ మరియు గ్లోబల్ బిజినెస్ పత్రికలు, "ట్రంప్ స్వదేశీ పిలుపును దాటి, ఆసియా యొక్క వేగవంతమైన వృద్ధి మార్కెట్ల వైపు గూగుల్ మొగ్గు చూపడం"గా ఈ నిర్ణయాన్ని పేర్కొన్నాయి. అమెరికా-చైనా సాంకేతిక పోటీ నేపథ్యంలో, గూగుల్ తన గ్లోబల్ సప్లై చైన్‌ను విస్తరించడంలో మరియు భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా బలోపేతం చేయడంలో ఈ డీల్‌కు ఉన్న ప్రాధాన్యతను అంతర్జాతీయ విశ్లేషణలు నొక్కి చెప్పాయి.
మొత్తంగా, ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌కు ఒక చారిత్రక ఘట్టంగా, భారతదేశం గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మారే దిశలో ఒక నిర్ణయాత్మక ముందడుగుగా మీడియా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్











