శీను(లక్కీ)
ShareChat
click to see wallet page
@1880352
1880352
శీను(లక్కీ)
@1880352
ప్రపంచమంతా ప్రేమ మయం
#😇My Status పెద్ద నీతితో కూడిన ఈ చిన్నపుస్తకాన్ని టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు. ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది. టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు. ‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న. ‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు. అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు. ‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం’ ‘ఎందుకంటే... అంటూ ఆయనే వివరణ ఇస్తాడు. ‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి’ డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి. ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ "Die empty” అనే పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు. ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట. ‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి’ నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే: ‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి. ‘మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి. ‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి. ‘మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి. ‘ప్రేమను పంచండి, మీలోనే దాచుకుని వృధా చేయకండి’ వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలోఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం! ‘అప్పుడు హాయిగా ...ప్రశాంతంగా.... “Let us Die Empty"
#😇My Status “రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు” — ఎవరికోసం మాత్రమే? ప్రతి సారి ఉద్యోగులు తమ హక్కులను అడిగినప్పుడు, ఒకే వాక్యం వినిపిస్తుంది — > “రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు.” కానీ అదే రాష్ట్రం, ప్రజల ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేస్తూ ఉచిత పథకాల వర్షం కురిపించినప్పుడు మాత్రం, ఆర్థిక పరిస్థితి గుర్తుకు రావడం లేదు. ప్రజల డబ్బుతో ‘ఉచిత’ పథకాలు “ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు” అనే తల్లికి వందనం పథకం, “మహిళలకు ఉచిత ప్రయాణం” అనే స్త్రీ శక్తి పథకం — ఇవి అన్నీ ప్రజల పన్నులతోనే నడుస్తాయి. కానీ ఎవరూ ప్రశ్నించరు బస్సులు ఉచితంగా వచ్చాయా? డీజిల్ ఉచితమా? డ్రైవర్, కండక్టర్ వేతనాలు ఎవరు చెల్లిస్తున్నారు? ప్రజలే చెల్లిస్తున్నారు. అంటే ప్రజలే పన్నులు చెల్లించి, తమకే “ఉచితం” అని చూపించే ఒక వలయంలో చిక్కుకుంటున్నారు. సంక్షేమం అవసరం — కానీ సమతుల్యం ముఖ్యం ప్రజలకు సహాయం అవసరం అనేది ఎవరు తిరస్కరించరు. కానీ ఆ సహాయం ఉత్పాదక పెట్టుబడులుగా మారకపోతే, అది ఆర్థిక భారంగా మారుతుంది. ఉదాహరణకు — ఒక కుటుంబానికి 15,000 ఇస్తే అది ఒకసారి వినియోగం. కానీ అదే డబ్బును ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల విస్తరణలో పెట్టుబడిగా వెచ్చిస్తే — అది దీర్ఘకాలిక లాభం. రాష్ట్ర అభివృద్ధి అంటే ఉచిత పథకాల సంఖ్య కాదు, ఆర్థిక స్వావలంబన. ఉద్యోగులపై అన్యాయం ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముక. వారు ప్రతీ నెల వేతనంతో రాష్ట్రానికి స్థిరమైన సేవ అందిస్తున్నారు. అలాంటి వారికి రావలసిన D.A. (Dearness Allowance), PRC (Pay Revision Commission) వంటి న్యాయమైన హక్కులు ఇవ్వకుండా, “రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు” అని చెప్పడం అన్యాయం కాదు అని ఎవరూ ఎలా చెప్పగలరు? ఒక రాష్ట్రం తన ఉద్యోగులపై పెట్టుబడి పెట్టకపోతే — ఆ రాష్ట్రం భవిష్యత్తు సేవల స్థాయిని తగ్గించుకుంటుంది. 2014 నుండి 2025 — రెండు పార్టీలు, ఒకే ఫలితం రాష్ట్ర విభజన (2014) తర్వాత, రెండు వేర్వేరు పార్టీలు దాదాపు పది సంవత్సరాల పాటు పాలించాయి. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా “రాష్ట్రం అప్పులు తగ్గుతున్నాయి” అనే శీర్షిక చూడలేదు. మరియు ప్రతీ సంవత్సరం కొత్త కొత్త ఉచిత పథకాలు ప్రవేశపెడుతూ, పన్ను ఆదాయం పెరగకపోయినా, వ్యయం మాత్రం రెట్టింపు అయింది. ఇది ఒక ఆర్థిక అసమతుల్యత (Fiscal Imbalance) కి స్పష్టమైన సూచన. నిజమైన అభివృద్ధి ఏది? రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం పథకాల సంఖ్య కాదు. అది — పరిశ్రమలు స్థాపించడం, ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించడం, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించడం. ఉచిత పథకాలు తాత్కాలిక ఉపశమనం ఇవ్వవచ్చు, కానీ అవి దీర్ఘకాలిక అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తాయి. చివరి మాట: ప్రజల డబ్బుతో ప్రజలకే ఉచితంగా ఇచ్చి ఓట్లు కొనడం ఒక ఆర్థిక భ్రమ. అది రాష్ట్రాన్ని బలహీనంగా చేస్తుంది. ఉద్యోగుల హక్కులు నిర్లక్ష్యం చేయడం, అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెట్టడం — ఇది భవిష్యత్తులో రాష్ట్రానికి మరింత పెద్ద ఆర్థిక బరువుగా మారుతుంది. > కాబట్టి — మీరు మాకు D.A., PRC ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ “రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు” అని చెప్పకండి సార్… ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే — ముందుగా సత్యం చెప్పడం ప్రారంభించాలి.
#😇My Status ప్రతి బిడ్డకి 15000 చొప్పున ఎంత మంది అంత మందికి *తల్లికి వందనం*. ఇచ్చినపుడు రాష్ట్రం మీద ఆర్థిక భారం లేదు.. మహిళలకు ఉచిత బస్(స్త్రీ శక్తి) ఇచ్చినప్పుడు ఆర్థిక భారం లేదు.. ఎందుకంటే.బస్ తయారీదారు బస్ ను ఫ్రీ గా ఇచ్చాడు.diesel free. డ్రైవర్ కండక్టర్ కూడా ఫ్రీ .. ఆర్థిక భారం ఉండదు..ఆటో డ్రైవర్ కి 15000 .ఇలా ప్రజా సొమ్ముతో సంక్షేమ పథకాలు పేరుతో ఓట్లు కొన్నే పథకాలకి ఎన్ని కోట్లు వృధా చేసిన. రాష్ట్రానికి ఆర్థిక భారం ఉండదు.... కానీ రాష్ట్రం అభివృద్ధి కోసం. సంపద సృష్టి కోసం కష్టపడే ఉద్యోగి మాత్రం.తనకి న్యాయం గా రావలసినవీ అడిగితే మాత్రం. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి.కష్టాలు గుర్తుకు వస్తున్నాయి...2014 రాష్ట్రం విడిపోయినపటి నుంచి 2025 దాదాపు 10 ఇయర్స్ 2 పార్టీలు పాలించాయి..కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు.... కానీ 2014 నుండి 2025 ప్రభుత్వ ఉచిత పథకాల సంఖ్య ఎప్పటికపుడు రెట్టింపు అవుతుంది....., ఇలా ఎంత కాలం పడుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడడానికి... మీరు మాకు D.A లు PRC ఇవ్వకపోయినా పర్వాలేదు..ఆ మంత్రం (*రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు*) మాత్రం చెప్పకండి సార్.. ప్రజల రక్తాని మేము తాగుతున్నట్టు అనిపిస్తుంది.. *ఇది నా వ్యక్తిగత అభిప్రాయం..*. ఎవరిని ఉద్దేశించి కాదు...