_*🙏🪔ఐదురోజుల దీపావళి గురించి శివలోకం మీ కోసం.....🪔🙏*_
🪷🙏🌹🎻🪷🙏🌹
1 - ధన్వంతరీత్రయోదశి - వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం!!కానీ ఆరోజు "ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన "ధన్వంతరీభగవాన్"
జయంతి ! పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృతభాండముతో అవతరించాడు !!
2 - నరకచతుర్దశి - నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి ! నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు!!శ్రీకృష్ణ భగవానుడు - సత్యభామ(భూదేవీ అవతారం)తో కలసి గరుడారూడుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు ! నరకుని పీడ విరగడైంది కావున ఇది 'నరక చతుర్దశి' !!
3 - దీపావళీ - రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్భఁగా దీపావళి జరుపు కోవాటం , నరకుని బాధలనుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం !!
దీపం - లక్ష్మీ స్వరూపం - ఐశ్వర్య స్వరూరం - జ్ఞానస్వరూపం అందుకే మనం దీపావళీ రోజు లక్ష్మీపూజలు చేస్తాము !! వ్వాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు !!
4 - బలిపాఢ్యమి - వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని 'మూడు అడుగుల' నేలను దానమడిగాడు !వామన వటువు కు దానమిచ్చాడు బలి, "ఇంతింతై వటుడింతై నభోరాశిపై నల్లంతై" అన్నట్లుగా ఒకపాదంతో భూమిని, ఇంకోపాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన 'త్రివిక్రముడు' వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు ! సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడట ఇదీ ఆయనకు వామనుడిచ్చిన వరం !!
5 - యమద్వితీయ
సూర్యభగవానునికి యముడు - శనిదేవుడు ఇద్దరు పుత్రులు ! యమున అనే ఒక పుత్రిక కలదు !యముడు - యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా ! తనపని (జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశం తో ఈడ్చుక వచ్చి వారి వారి కర్మాను సారం వారి వారికి తగిన శిక్షలు విధించే పని)లో పడి పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు !! చెల్లి బతిమాలింది ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా !! అని బతిమాలింది చెల్లెలు!! కార్తీక శుద్ఘ విదియ{మంగళవారం} రోజు తీరిక చేసుకుని తన చెల్లెలింటికి వెల్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు !! చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది ! ఎవరైతే ఈరోజు చెల్లెలింటికి వెల్లి చెల్లెలికి కట్నకానుక లిచ్చి వాల్లింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చేయి అని అడిగింది !! ఈ యమునమ్మనే యమునా నది ! కృష్ణ భక్తురాలు ! .🙏🪔🙏🪷🪔🪷🪔🪷🪔🪷
మీ... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి
_*రాబోయే దీపావళి పండుగ రోజు ఆచరించాల్సిన విధుల గురించి శివలోకం మీ కోసం.....*_
🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔
ఓం నమఃశివాయ
శ్రీ గురుభ్యోనమః
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷
అందరూ దీపావళి పండుగను చక్కగా అందంగా ఆనందంగా ప్రమాదరహితంగా జరుపుకోవాలని కోరుకుంటూ, పోయిన సంవత్సరం పంచుకున్న దానికి కొద్ది మార్పులతో.. దీపావళిగూర్చి ఈ చిన్న వివరాన్ని ఆ రోజు చేయవలసిన విధులు అందరికీ ఉపయోగపడతాయని పొందుపరిచాము.
"ప్రాతః స్నానంతు యఃకుర్యాత్ యమలోకం నపశ్యతి"
- విధిగా నిత్యమూ వేకువ ఝామునే స్నానం చేసినవానికి యమలోక దర్శనముండదని చెప్తారు పెద్దలు. స్నానం యొక్కపవిత్రత అది. ఎప్పుడోఅప్పుడు ఎలాగో అలాగ ఒళ్ళుకడుక్కోవడం స్నానం కాదు నియమంగా నియమిత వేళలో, నియమిత విధిలో స్నానం చేయాలి అది బాహ్యాంతరశ్శుచిని వృద్ధినికలిగిస్తుంది.
ఆశ్వయుజ బహుళ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా
యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే
నరక చతుర్దశినాడు సూర్యోదయాత్ పూర్వం నువ్వులనూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి. దీనివలన కలిగే ఫలితం కేవలం ఋష్యాదులు మాత్రమే దర్శించగలరు దానిఫలితం ఇంత అని మానవ మాత్రులు దర్శించలేరు. యతులతో సహా అందరూ ఇలాగే ఈ రోజు స్నానం చేయాలని శాస్త్రవాక్కు.
అలానే దీపావళినాడు నూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి
తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథౌ వసేత్
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే||
దీపావళినాడు సూర్యోదయాత్ పూర్వం రాత్రి చివరి ఝాములో లేదా సోర్యోదయానికి 4ఘడియల ముందుగా (అంటే కనీసం 4-4:30 మధ్యకాలం అనుక్కోండి) నువ్వుల నూనె తోతలంటుకుని స్నానం చేయాలి. దీపావళినాడు ఈ సమయంలో ఎక్కడెక్కడున్న నువ్వులనూనెలోనూ లక్ష్మీదేవి, అలాగే అన్ని నీటి స్థానాలలోనూ గంగాదేవి నివసించి ఉంటారు. కనుక ఈసమయంలో నువ్వులనూనె వంటికి రాసుకుని, తలంటుకొని స్నానం చేసినవారికి అలక్ష్మి పరిహరింపబడుతుంది. అలాగే గంగా స్నాన ఫలితం దక్కుతుంది. స్నానం చేసేటప్పుడుపైశ్లోకాన్ని ఒక్కసారి పఠించి నమస్కరించి స్నానం చేయడం మంచిది. అలాగే ఇలా సూర్యోదయానికి ముందు అరుణోదయ సమయంలో (అంటే సూర్యోదయానికి 4 ఘడియల పూర్వంరమారమి 4-4:30 మధ్యలో) ఈ ప్రకారం స్నానం చేసినవారికి యమ లోకము కనపడదు.
అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై
ఈ స్నానం మధ్యలో ఉత్తరేణి, ఆనప లేదా ప్రపున్నాట మొక్కను తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ స్నానం చేయాలి. అలాచేస్తే నరక ప్రాప్తి లేదు. అకాల మృత్యువు రాదు అనిశాస్త్రం పెద్దల వాక్కు. ఉత్తరేణి లేదా అపామార్గ చాలా విరివిగా దొరుకుతుంది. లేకపోయినా ఆనప, ప్రపున్నాట మొక్కలను వాడవచ్చు. ఇలా స్నాన మధ్యంలో ఆ మొక్కలను తల చుట్టూతిప్పుతూ ఉన్నప్పుడూ ఈ క్రింది ప్రార్థనా శ్లోకం / మంత్రం చెప్పుకోవాలి
శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః
తా: దున్నిన మట్టి పెళ్ళలతో కలిసినది, ముళ్ళతో ఉండే ఆకులు గలదీ అగు ఓ అపామార్గమా! నిన్ను నాచుట్టూ తిప్పుతున్నాను. మళ్ళీ మళ్ళీ తిప్పడం వల్ల నువ్వు నాపాపాన్నిహరించు అని చెప్తూ చేయాలి.
ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే దక్షిణానికి నిర్భయంగా తిరిగి యమునికి మూడు సార్లు నమస్కరించమని పెద్దలు చెప్తారు. తరవాత నిత్యవిధులైన సంధ్యాదులు అయ్యింతరవాతయమధర్మరాజుగారికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకం చెప్పి మూడు మార్లు తర్పణం ఇవ్వాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ!
ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్ఠినే
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!!
యమం తర్పయామి! యమం తర్పయామి !యమం తర్పయామి !
(అని నువ్వులతో మూడు మార్లు తర్పణలు వదలాలి.)
యమధర్మరాజుగార్కి పితృత్వం దైవత్వం రెండూ ఉన్నాయి దక్షిణాభిముఖంగా నిర్భయంగా తిరిగి ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ తర్పణం ఇవ్వవచ్చు. తల్లి దండ్రులున్నవారుమాత్రం నివీతిగానే చేయాలి అని పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి వాక్కు.
మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః
ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే.
ఈనాడు తప్పకుండా మినప ఆకు కూర తినాలి. (మినపాకు ఎక్కడ దొరుకుతుందీ అన్న సందేహం వద్దు, మినుములు నానేసుకొంటే మొలకలొస్తాయిగా (అదే స్ప్రౌట్స్) వాటినేకొద్దిగా కూర లాగ చేసుకుని తినవచ్చు .. )
సాయంకాలం ఇళ్ళలోనూ, గుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలి. నువ్వులనూనెతో పెట్టమని శాస్త్రం. దీపదానం చేయటం కూడా కద్దు. ఇక్కడ్నుంచి కార్తీకమాసమంతా దీపదానం, దీపతోరణాలు, ఆకాశ దీపోత్సవాలే.
దీపావళి సాయంత్రం దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకి మార్గం చూపడానికి మగపిల్లలు దివిటీలను (ఉల్కాదానం) చూపాలి, తరవాత కాళ్ళూ చేతులూ కడుక్కుని ఏదైనా మధురపదార్థం తినాలి. ఈ దివిటీలను గోగు కర్ర, చెఱకు గడ, బొబ్బాస ఆకు, ఆముదం ఆకు, గోంగూర చెట్టు వంటి వాటికి కట్టి వెలిగిస్తారు.
ముఖ్యంగా ఈ దీపావళి లక్ష్మీ పూజకి ప్రసిద్ధి ముందురోజైన నరక చతుర్దశి నుండి బలి పాడ్యమి వరకు బలి చక్రవర్తి భూమిమీదకు వచ్చి తన అధికారం చేసేటట్లు, ఈ రోజుల్లో లక్ష్మీపూజ చేసేవారి ఇంట లక్ష్మి సుస్థిర నివాసం ఏర్పరచుకునేటట్లు వరం కోరుకున్నాడు కాబట్టి ఈ మూడు రోజులు లక్ష్మీ పూజతో పాటు భగవత్సంకీర్తనం జాగరణం చేసే ఆచారం ఉంది.
దీపావళినాడు దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలి. అలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం, దివిటీలు వెలిగించడం, టపాసులు పేల్చి చప్పుడు చేయడం,ఆచారమైంది. ఇంతకు ముందు ఋతువులో పుట్టిన క్రిమి కీటకాదులు దేవతాహ్వానం చేయబడిన ఈ దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొందుతాయిఉత్తరజన్మలకు వెళతాయి. అంతే కాని లేని పోని ఆడంబరాలు లేక వాతావరణ కాలుష్యం కోసం కాదు. ఇంత గొప్ప సాంప్రదాయం మనది.
జ్ఞాత్వా కర్మాణి కుర్వీత - తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్య కార్యానికి ఫలం ఉంటుంది, తెలిసి చేస్తే మరింత జాగురూకతతో చక్కగా చేయవచ్చు అని పరమాచార్య ఉద్భోధ.
దీపావళి పర్వదినం మూడు రోజులు పాటు ఆచరించాలి. నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి. ఈ మూడు రోజులూ తెల్లవారు ఝాముననే తైలాభ్యంగన స్నానం చేసి కులదేవతారాధనం చేసి, యమధర్మరాజుని పితృదేవతలను, ఇష్టదేవతల స్మరించి పూజించడం భగవదనుగ్రహానికి మార్గం. దరిద్రనివారణకు ఈ దీపావళి త్రిరాత్ర ఉత్సవం చక్కని మార్గం. దరిద్రమంటే కేవలం ధనం లేకపోవడం కాదు.
ధర్మమును, సంప్రదాయమును వదిలి ఉన్నదానితో తృప్తిలేకుండ ఉండడమే దరిద్ర్రం. పైకి ధనం లేనట్టు కనబడ్డా ధర్మిష్టి అయ్యి వేద ధర్మాన్నిఆచరించి నిత్యతృప్తుడని కొనియాడబడిన కుచేలుడు స్వయంగా పరబ్రహ్మముచే పూజలందుకున్నవాడు దరిద్రుడు కాదు కానే కాదు పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడు. అన్నీ ఉన్నా ధర్మదూరులై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ధర్మాన్ని, ఆచారాన్ని వదిలి ప్రవర్తించిన అనాచారాన్ని ప్రవర్తింపచేసిన కంసకౌరవాదులు పైకి ఐశ్వర్యపరులుగా కనపడ్డా వారే అసలైన దరిద్రం అనుభవించినవారు.
భగవదనుగ్రహాన్ని అపేక్షించడం, ధర్మ మార్గావలంబనం, గురుపాద సేవనం ఐశ్వర్యం, తద్వ్యతిరిక్తమే దారిద్ర్యం.
🪷🌹🪔🪷🌹🪔🪷
*మన శివలోకం సభ్యులు అందరికీ రాబోయే దీపావళి శుభాకాంక్షలు*
🪷🌹🙏🪔🪷🙏🪔
మీ... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
_*🪷🌹🙏అమరనాధ్ యాత్ర గురించి శివలోకం మీ కోసం......*_
🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱
మంచు కొండ మీద ఓ గుహ... భారత దేశంలోనే పెద్దది... ఉన్నది 12,000 అడుగుల ఎత్తున... అక్కడికి వెళ్లడమే ఎంతో కష్టం... అయినా లక్షలాది మంది దర్శిస్తారు... అదే అమర్‌నాథ్!
ఓసారి పార్వతీదేవికి జీవరహస్యం, అమరత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. శివుడిని అడిగింది. మంచు కొండల్లో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో దానిని వివరించాడు. ఆ అమర కథను చెప్పిన స్థలమే
అమర్‌నాథ్ గుహ! జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని మంచు కొండపై, సముద్రమట్టానికి 12,756 అడుగుల ఎత్తున ఉన్న అమర్‌నాథ్ గురించిన పురాణ కథ ఇది. దేశంలోనే అతి పెద్ద గుహగా 75 అడుగుల ఎత్తు, 40 గజాల వైశాల్యంతో ఉండే ఇందులో ఏటా జూన్, ఆగస్టుల మధ్య కాలంలో మంచు శివలింగాకారంలో ఏర్పడడం ఓ భౌగోళిక అద్భుతం. ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన
ఇక్కడికి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.
అమర్‌నాథ్ గుహ బుటామాలిక్ అనే ఓ ముస్లిం బాలుడి వల్ల బయటపడడం ఒక విశేషం. తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతూ మంచు కొండ ఎక్కినప్పుడు తొలిసారిగా దీన్ని చూశాడని చెబుతారు. ఇప్పటికీ ఆ బాలుడి వంశస్థులు అక్కడే ఉంటారు. అమర్‌నాథ్ సంబంధించిన ప్రస్తావన క్రీస్తుపూర్వం 34 నుంచి అనేక గ్రంథాలు, చారిత్రక ఆధారాలలో కనిపిస్తుంది. భక్తులు పహల్గామ్ అనే ఊరి నుంచి 42 కిలోమీటర్ల దూరం కాలినడకన మంచు కొండ ఎక్కుతారు.
జీవరహస్యాన్ని ఎవరూ లేని చోట చెప్పాలనుకున్న శివుడు, పహల్గామ్‌లో నందిని వదిలేసి పార్వతితో కొండెక్కాడని చెబుతారు. మార్గమధ్యంలో చందన్‌వరి వద్ద నెలవంకని, శేష్‌నాగ్ సరస్సు వద్ద కంఠాభరణమైన పాముని, మహాగుణాస్ పర్వతం వద్ద గణేశుడిని, పంజితర్ణి వద్ద పంచ భూతాల్ని విడిచిపెట్టాడు. త్రినేత్రంలోని కాలాగ్నిని కూడా వదిలి ఏ జీవి కనిపించినా భస్మం చేయమని ఆదేశించి గుహలో ప్రవేశించాడు. శివుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా తను పరుచుకున్న జింక చర్మం కింద ఉన్న రంధ్రంలో రెండు పావురాలు ఉండిపోయి శివుడి చెప్పిన రహస్యాన్ని విన్నాయి. వాటికి శివుడు అమరత్వాన్ని ప్రసాదించాడని, అవి ఇప్పటికీ అమర్‌నాథ్ గుహలో కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు.
అమర్‌నాథ్ గుహకి పైభాగంలో ఉండే రామకుండం అనే సరస్సు నుంచి బొట్టు బొట్టుగా పడే నీరు గడ్డకడుగూ ఏడడుగుల ఎత్తయిన శివలింగంగా ఏర్పడుతుంది. దీని ఎత్తు చంద్రుని హెచ్చుతగ్గులను బట్టి మారుతుందని చెబుతారు.
🪷🌹🔱🙏🪷🌹🪷
మీ... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
_*"వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి చిత్ర పటాలను పూజిస్తే ధనలక్ష్మీ ప్రసన్నం" శివలోకం మీ కోసం....*_
🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔
🌹చేసుకున్న వాళ్లకు..చేసుకున్నంత మహాదేవా..అనీ..
మన కర్మలు బట్టీ మన యోగాలు ఉంటాయి..
🌹లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి.
🌹ఎవరికి ఐశ్యర్యం సిద్ధించాలన్నా,
ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం.
🌹అందుకే వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలు పూజిస్తారు.
కానీ కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్ర పటాలను పూజిస్తే
ధనం రాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
పైగా ఉన్న ధనం కూడా ఎలా వచ్చిందో..
అలాగే వెళ్ళి పోతుందట.
🌹గుడ్లగూబపై లక్ష్మీ దేవి కూర్చున్నట్టుగా ఉండే బొమ్మను పూజించకూడదు.
దీంతో అంతా అశుభమే జరుగుతుందట.
ధనం వచ్చింది వచ్చినట్టు పోతుంది.
🌹శేషతల్పంపై విష్ణువు పడుకుని ఉండగా,
ఆయన కాళ్ల వద్ద లక్ష్మీ దేవి ఉన్న బొమ్మను పూజిస్తే అలాంటి వారి దాంపత్య జీవితం సుఖమయంగా సాగుతుందట.
🌹అదే తామర పూవుపై లక్ష్మీదేవి నిలుచుని ఉన్న ఫొటో కాకుండా కూర్చున్నట్టుగా ఉన్న ఫొటోను పూజించాలట.
🌹కుబేరుని విగ్రహం లేదా ఫొటోను ఇంట్లో పెట్టుకుంటే, దాంతో లక్ష్మీ దేవి మరింత సంతృప్తి చెంది
ఆ ఇంట్లోని వారికి ఐశ్వర్యాలను కలిగిస్తుందట.
🌹గరుత్మంతునిపై విష్ణువుతోపాటు లక్ష్మీ దేవి
కూర్చుని ఉన్న ఫొటోను పూజించినా
మిక్కిలిగా ధనం లభిస్తుందట.
అంతా మంచే జరుగుతుందట.
🌹పాదరసంతో తయారుచేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని
పూజిస్తే దాంతో అన్నీ శుభాలే కలుగుతాయట.
ధనం కూడా బాగా సమకూరుతుందట.
🪔దీపావళి రోజున స్ఫటిక శ్రీయంత్రాన్ని
ఒక ఎర్రని వస్త్రంలో చుట్టి దాన్ని
మీ మనీ లాకర్‌లో పెట్టాలి.
దీంతో ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది.
🌹లక్ష్మీ పూజ చేసేటప్పుడు తులసి ఆకులు, ధూపం, దివ్వెలు, పూవులను ఎక్కువగా వాడి పూజ చేయాలి. దీంతో అనుకున్నది జరుగుతుంది.
🪔దీపావళి రోజున లక్ష్మీ దేవి, కుబేరున్ని పూజించి అనంతరం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
దీని వల్ల భక్తులకు అనుకున్నది నెరవేరుతుంది.
🪷🌹🎻🪷🌹🎻🪷
ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే
ధనధాన్యసమృద్ధిం మే దేహి దాపయ స్వాహా.
🪷🌹🎻🪷🌹🎻🪷
మీ.... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి
*🪷🌹🙏🎻"తొమ్మిది రకాల ముక్తి మార్గాల" గురించి శివలోకం మీ కోసం....*
🪷🌹🙏🪷🌹🙏🪷
🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏🪷🌹🙏🪷🌹
1. *శ్రవణం*( వినడం ) భక్తి చేత పరిక్షిత్ మహరాజు తరించాడు.
2. *కీర్తనం*( పాడడం ) చేత నారద మహర్షి, అన్నమయ్య, త్యాగరాజు తరించారు.
3. *స్మరణం* ( నోటితో ఎల్లప్పుడు పలకడం ) చేత ప్రహ్లాదుడు తరించాడు.
4. *పాదసేవనం* తో, లక్ష్మీదేవి, లక్ష్మణుడు తరించాడు.
5. *అర్చనం* తో పృధు చక్రవర్తి తరించాడు.
6. *వందనం* చేత అక్రూరుడు తరించాడు.
7. *దాస్య భక్తి* (సేవ )చేత గరుత్మంతుడు, హనుమంతుడు తరించాడు.
8. *సఖ్యం* భక్తి చేత అర్జునుడు, కుచేలుడు తరించారు.
9. *ఆత్మనివేదనం* తో బలిచక్రవర్తి తరించారు.
మనిషి మహనీయుడు కావాలంటే ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి.
జీవితంలో దైవనామాన్ని నిరంతరం
స్మరిస్తూ తరించు.
జీవితంలో నీ అంతరాత్మకు లోబడి జీవించి తరించు.
జీవితంలో శాస్త్రం ను అనుసరించి జీవించి తరించు.
తత్వ విచారణ చేసి జీవించి తరించు.
యోగ మార్గంలో ఆత్మ విచారణ చేసి జన్మ రాహిత్యం చేసుకొని తరించు.
*పూజ పరమార్దం:*
🪷🌹🙏🪷🌹🙏🪷
పూజ, అర్చన, జపం.
స్తోత్రం. ధ్యానం. దీక్ష. అభిషేకం. మంత్రం. ఆసనం. తర్పణం. గంధం. అక్షితలు. పుష్పం. ధూపం. దీపం. నైవేద్యం. ఆచమనీయం. అవాహనం. స్వాగతం. పాద్యం మధుపర్కం. స్నానం. వందనం. ఉద్వాసన....
*పూజ-పరమార్థాలు:*
🪷🌹🙏🪷🌹🙏🪷
పూజ అనగా పూర్వజన్మ వాసనలను తొలగింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణ ఫలాన్నిచ్చేది.
అర్చన అనగా అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది. దేవతలను సంతోషపెట్టేది.
జపం అనగా అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
స్తోత్రం అనగా మెల్లమెల్లగా మనస్సునకు ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
ధ్యానం అనగా ఇంద్రియ నిగ్రహాన్ని మనస్సుతో నియంత్రింప చేసేది, ఇష్ట దేవతను తపింపచేసేది ధ్యానం.
దీక్ష అనగా దివ్య భావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.
అభిషేకం అనగా అహం భావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాన్ని కల్గించేది.
మంత్రం అనగా మననం చేసేవారిని కాపాడేదే మంత్రం అని అంటారు. మంత్ర తత్త్వం వల్ల భయాలు తొలగిపోతాయి. నిరంతర మననం ధ్యానం వల్ల మనసు చంచలత తొలగి, మనిషిని తిరిగి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది.
🪷🌹🙏🪷🌹🙏🪷
మీ... శివలోకం ప్రాజెక్ట్
#🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి