#💮వసంత పంచమి శుభాకాంక్షలు✨ *వసంత పంచమి శుభాకాంక్షలు*
వాక్కుకు విద్యకు కళలకు
సకల వేద అధిదేవతగా..
అజ్ఞానం తొలగించి
జ్ఞాన సంపదలు అందించు వాగ్దేవిగా..
మంచు ముత్యంలా మెరిసే
తెల్లని వస్త్రాలంకరణతో..
ఒకచేతిలో సంగీతానికి మూలమైన వీణను ధరించి.. మరోచేత్తో సకల ఆగమాలకు ఆలవాలమైన పుస్తకాన్ని..
మూడో చేతిలో అక్షయమైన తపస్సుకు చిహ్నం అక్షమాలను ధరించి..
పూలలో పవిత్రమైన కమలంలో సుఖాసీనమై..
పాలు నీరు వేరుచేసే వివేకం గల హంస వాహనంపై
ప్రశాంత వదనంతో బ్రహ్మ ముఖం నుండి..
మాఘ శుద్ధ పంచమి నాడు
దివ్య తేజస్సుతో..
ఉద్భవించిన పుణ్య తిథి
వసంత పంచమి..
దేవి అనుగ్రహం తోనే మాటకు స్వరం, స్వరానికి అందం, జ్ఞానానికి దారి చూపి పరిపూర్ణత
సిద్ధింప చేసి..
బ్రహ్మ సృష్టించిన రూపాలకు ప్రాణం పోసిన వేదవాణి..
తన కరుణా కటాక్షాలతో
పుట్టు మూగవాడైన మూక శంకరుడిని మహాకవిగ..
పొట్ట కోసినా అక్షరం ముక్క రాని కాళిదాసు చేత ఘనమైన కవనాలను రాయించి మహా పండితుడిగా మలిచిన దేవేరి..
మనుషులకు లౌకిక అలౌకిక అగణిత గుణ గణాలను అంతర్వాహినిగ మేల్కొలిపే ప్రణవరూపిణికి
అక్షర సుమాంజలి..!
గోవర్ధన్ ఆముదాలపల్లి
#⛳భారతీయ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు #షేర్ చాట్ బజార్👍 #🎶భక్తి పాటలు🔱
భోగి పళ్ళు చిరంజీవి పరిణిత శ్రీ శుభాశీస్సులు #✨సంక్రాంతి స్టేటస్🌾 #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 #🔥భోగి శుభాకాంక్షలు🌾 #షేర్ చాట్ బజార్👍 #📽ట్రెండింగ్ వీడియోస్📱
#🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 ఓం శ్రీ ఋతుచక్ర కాలకాలాయ ప్రత్యక్ష సూర్య దేవాయ నమః #⛳భారతీయ సంస్కృతి #✨సంక్రాంతి స్టేటస్🌾
#🔥భోగి శుభాకాంక్షలు🌾 ఓం శ్రీ మణికంఠ అయ్యప్పస్వామి నమో నమః మకర విలక్కు శుభాకాంక్షలు మకర జ్యోతి దర్శనం పరమ పుణ్యం #✨సంక్రాంతి స్టేటస్🌾 #📙ఆధ్యాత్మిక మాటలు #షేర్ చాట్ బజార్👍 #⛳భారతీయ సంస్కృతి
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు #షేర్ చాట్ బజార్👍 #🌊మన కోస్తాంధ్ర #⛳భారతీయ సంస్కృతి #🔥భోగి శుభాకాంక్షలు🌾 #✨సంక్రాంతి స్టేటస్🌾
భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు #🔥భోగి శుభాకాంక్షలు🌾 #📙ఆధ్యాత్మిక మాటలు #⛳భారతీయ సంస్కృతి #🌊మన కోస్తాంధ్ర #షేర్ చాట్ బజార్👍
#📙ఆధ్యాత్మిక మాటలు #🔊తెలుగు చాట్రూమ్😍 #షేర్ చాట్ బజార్👍 #🔥భోగి శుభాకాంక్షలు🌾 #⛳భారతీయ సంస్కృతి
*సంక్రాంతి*
నిత్యం ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనంలో..
కూసింది కోయిలమ్మ
వసంతంలా సంక్రాంతి
పండుగ శెలవులు వచ్చాయని.. ఆకాశం వైపు గాలి పటాలను ఎగరేస్తూ విహంగంలా
మనసు ఓలలాడిన క్షణాలు..
కోడి పందాలు ఎడ్ల బండ లాగుడు పోటీలు బొమ్మల కొలువుతో
భోగి పళ్ళ పేరంటంతో
రాజు పేద తేడా లేకుండా
కలిసిన మనసుల
*మట్టి బంధం*
మమతలు కురిపించిన తల్లి ఒడిలో గారాబాలు..
తండ్రి చేయి పట్టుకుని నేర్పించిన నడకలు..
తాతలు బామ్మలు మన కోసం చిన్న పిల్లలుగా మారి..
వెన్నెల వర్షంలో నులక మంచంపై
వీనులకు అమృతంలా మనసున గాఢంగా ముద్రించిన..
పల్లె పదాలు కధలతో నిద్ర పుచ్చిన క్షణాలు రారమ్మని పిలిచాయి..
చెట్టు మీద చిలక కొట్టిన జామకాయ రుచిని..
పచ్చి మామిడికాయను కాకెంగిలితో పంచుకున్న అనుభవాలు..
భవిష్యత్తు జీవితానికి
పలకా బలపం పట్టి..
తొలి అక్షరాల అడుగుల
సంతకం చేసిన బడి పిలుస్తుంది.. తీగెలు అల్లుకున్న పందిరిలా ఊరంతా ఏకతాటిపై నిలిచిన *మమతల కోవెలలా*..
చిన్ననాటి ఆశల సుగంధాలు పంచిన స్నేహంలా..
పచ్చని ప్రకృతిలో స్వఛ్చమైన గాలి అందించిన
*ఊపిరి ఊయలలో*.. ఊగిసలాడిన స్వఛ్చమైన పల్లెటూరి ఏటిగాలి పరవశంతో *ఊరు పిలుస్తుంది*రా రమ్మని..! #షేర్ చాట్ బజార్👍 #📙ఆధ్యాత్మిక మాటలు #🙏🏻కృష్ణుడి భజనలు #🔱రుద్రాభిషేకము #🎶భక్తి పాటలు🔱
*గోవర్ధన్ ఆముదాలపల్లి*
#షేర్ చాట్ బజార్👍 #📙ఆధ్యాత్మిక మాటలు గీతా జయంతి
ధర్మం రెండు కాళ్ళ మీద నడిచే
ద్వాపర యుగంలో..
మానవ రూపంలో అవతరించిన
శ్రీకృష్ణ పరమాత్మ బాల్యంలో..
యశోదమ్మ ఒడిలో అమ్మతనం లోని
తీయదనం అనుభవించి
అల్లరి ఆటలు చిలిపి చేష్టలు
వెన్న దొంగగా రేపల్లియను ఓలలాడించి..
వేణుగానంతో యమునా తీరంలో గోపికలతో సయ్యాటలతో..
కాళీయుని పడగలపై నాట్యమాడి..
కంసుని చంపి కన్న తల్లితండ్రులను
చెర నుండి విముక్తి చేసిన కారణజన్ముడు..
పాండవులు కౌరవుల మధ్య యుద్ధంలో కపటనాటక సూత్రధారిగా
మంత్రాంగం నడిపిన దేవదేవుడు సారథ్యం వహించి కీలక సమయంలో
నడిపేది నేనే నడిపించేది నేనేనంటూ అర్జునుడికి లోకోత్తరమైన
సనాతనధర్మ జీవన తాత్త్విక సందేశం
భగవద్గీత బోధించి..
విశ్వరూపం చూపించి
కళ్ళు తెరిపించిన మహిమాన్వితుడు
శ్రీ కృష్ణ భగవాన్ సూచించిన
గీత మానవాళికి అందించిన పంచమవేదం..
మనిషికి జీవితంలోని
ప్రతి సమస్యకు పరిష్కారం
తగిన ధైర్యం ఇచ్చే మాటలకందని
దైవ ఉద్గ్రంధం..!
*గోవర్ధన్ ఆముదాలపల్లి* #🙏🏻కృష్ణుడి భజనలు #గీతా జయంతి #గీతా జయంతి
ఓం శ్రీ అరుణాచల శివ శక్తి నమోస్తుతే శుభోదయం #షేర్ చాట్ బజార్👍 #📙ఆధ్యాత్మిక మాటలు #🎶భక్తి పాటలు🔱 #🐩🙏కాలభైరవ దేవాలయం🛕 #🔱రుద్రాభిషేకము






![🔥భోగి శుభాకాంక్షలు🌾 - Good Morning सुप्रभातम् Happy Bhogi Happy Makar Vilakku] Good Morning सुप्रभातम् Happy Bhogi Happy Makar Vilakku] - ShareChat 🔥భోగి శుభాకాంక్షలు🌾 - Good Morning सुप्रभातम् Happy Bhogi Happy Makar Vilakku] Good Morning सुप्रभातम् Happy Bhogi Happy Makar Vilakku] - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_730597_29b6ceac_1768365728698_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=698_sc.jpg)





