#షేర్ చాట్ బజార్👍 #📙ఆధ్యాత్మిక మాటలు గీతా జయంతి
ధర్మం రెండు కాళ్ళ మీద నడిచే
ద్వాపర యుగంలో..
మానవ రూపంలో అవతరించిన
శ్రీకృష్ణ పరమాత్మ బాల్యంలో..
యశోదమ్మ ఒడిలో అమ్మతనం లోని
తీయదనం అనుభవించి
అల్లరి ఆటలు చిలిపి చేష్టలు
వెన్న దొంగగా రేపల్లియను ఓలలాడించి..
వేణుగానంతో యమునా తీరంలో గోపికలతో సయ్యాటలతో..
కాళీయుని పడగలపై నాట్యమాడి..
కంసుని చంపి కన్న తల్లితండ్రులను
చెర నుండి విముక్తి చేసిన కారణజన్ముడు..
పాండవులు కౌరవుల మధ్య యుద్ధంలో కపటనాటక సూత్రధారిగా
మంత్రాంగం నడిపిన దేవదేవుడు సారథ్యం వహించి కీలక సమయంలో
నడిపేది నేనే నడిపించేది నేనేనంటూ అర్జునుడికి లోకోత్తరమైన
సనాతనధర్మ జీవన తాత్త్విక సందేశం
భగవద్గీత బోధించి..
విశ్వరూపం చూపించి
కళ్ళు తెరిపించిన మహిమాన్వితుడు
శ్రీ కృష్ణ భగవాన్ సూచించిన
గీత మానవాళికి అందించిన పంచమవేదం..
మనిషికి జీవితంలోని
ప్రతి సమస్యకు పరిష్కారం
తగిన ధైర్యం ఇచ్చే మాటలకందని
దైవ ఉద్గ్రంధం..!
*గోవర్ధన్ ఆముదాలపల్లి* #🙏🏻కృష్ణుడి భజనలు #గీతా జయంతి #గీతా జయంతి