శీర్షిక : నిశీలో శశి
ప్రక్రియ : వచన కవిత్వం
రెప్పలు వాల్చే శిల్పం #✍️కవితలు
అందంతో పొట్టి పడుతుంది.
మనసు విప్పి చెప్పాలని
మాటరాని మౌనంతో
యుద్ధం చేస్తుంది.
పంజరం నుంచి
ఊహలు జతలో
ఎగిరిపోయి
మయూరముల పురి విప్పి
నాట్య ఆడాలని
మదిలో డమరుకం మ్రోగుతుంది.
గాయపడ్డ చిలుక
తలపు వాకిట్లో
వలపు చీర కట్టుకుని
ఇష్టం కోసం ఎదురుచూస్తుంది.
రాత్రి పగలు తేడా లేని
జీవితంలో వెన్నెల
వర్షంలో తుడవాలని
తపిస్తుంది.
రాలిపోయిన ఆశలు
రాగాలు తీస్తుంటే
గులాబీ పువ్వుల పరిమళం
ఎద నిండిపోయింది.
పుట్ట తేనె పెదవుల్లో నింపుకుని
పట్టు పాన్పు ఎక్కాలని ఉంది
ఊరించే ఆశ ఒకటి
కళ్ళెదుట మెరుస్తుంటే.
-----------------