హరికృష్ణ ఆచార్య
ShareChat
click to see wallet page
@68144036
68144036
హరికృష్ణ ఆచార్య
@68144036
ఓమ్ గురుభ్యోనమః
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 ఈశ్వరుడు, కర్మ, మరియు నవగ్రహాల సమన్వయం -- ఒక సమగ్ర విశ్లేషణ.............!! ​కర్మ సిద్ధాంతం, నవగ్రహాల ప్రభావం, మరియు ఈశ్వరుని దివ్య సంకల్పం - ఈ మూడింటి కలయిక మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన అంశం. పురాణాలు, వేదాంతం, మరియు జ్యోతిష్యం ఈ మూడు అంశాలను ఒకదానితో ఒకటి ఎలా ముడిపెట్టాయో చూద్దాం. ​1. కర్మ: సృష్టికి మూల సూత్రం ​మనం చేసే ప్రతి ఆలోచన (చింతన), మాట్లాడే ప్రతి మాట (వాక్కు), మరియు చేసే ప్రతి పని (కార్యం) ఒక శక్తి తరంగాన్ని సృష్టిస్తుంది. ఇది మంచిదైతే సత్కర్మ, చెడుదైతే దుష్కర్మ. ఈ కర్మలన్నీ మన 'కర్మ ఖాతా'లో నిక్షిప్తమవుతాయి. వీటి ఫలితాలు తక్షణమే రావచ్చు లేదా భవిష్యత్తులో, మరుజన్మలో కూడా రావచ్చు. ఈ కర్మ అనేది ఈశ్వరుడు సృష్టించిన విశ్వ నియమం (Law of Karma). ​2. నవగ్రహాలు: కర్మ ఫలాల న్యాయ అమలుదారులు ​పురాణాల ప్రకారం, ఈశ్వరుడు సర్వకర్మ ఫలదాత అయినా, ఆయన నేరుగా ప్రతి వ్యక్తి యొక్క కర్మ ఫలితాన్ని అమలు చేయరు. ఆయన సృష్టించిన కర్మ నియమం ప్రకారం, ఆ ఫలితాలను అందించే బాధ్యతను నవగ్రహాలకు అప్పగించారు. ఈ నవగ్రహాలు ఈశ్వరుని 'న్యాయ అమలు అధికారులు' (Cosmic administrators) లాగా పనిచేస్తాయి. ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన కారకత్వం ఉంటుంది, అది ఆయా కర్మలకు సంబంధించిన ఫలితాలను అందిస్తుంది. ​శని: కర్మ ఫలితాలను ఆలస్యంగా, కచ్చితంగా అందిస్తాడు. కష్టాలు, పోరాటాలు, ధైర్యం, క్రమశిక్షణ శని కారకత్వాలు. ​గురువు: జ్ఞానం, ధర్మం, గౌరవం, ఆధ్యాత్మికత, సంతాన ఫలాలు గురువు ద్వారా లభిస్తాయి. ​శుక్రుడు: సుఖసౌకర్యాలు, ప్రేమ, కళలు, వైవాహిక జీవితం, సౌందర్యం శుక్ర కారకత్వాలు. ​కుజుడు: ధైర్యం, యుద్ధం, శౌర్యం, ఆవేశం, శారీరక బలం కుజుడు ద్వారా వ్యక్తమవుతాయి. ​బుధుడు: తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారం, విద్య బుధుడి ప్రభావంతో ఉంటాయి. ​చంద్రుడు: మనసు, భావోద్వేగాలు, మానసిక ప్రశాంతత, మాతృ ప్రేమ చంద్రుని కారకత్వాలు. ​సూర్యుడు: ఆత్మవిశ్వాసం, అధికారం, ఆత్మ, ప్రభుత్వం సూర్యుని ప్రభావం. ​రాహువు - కేతువు: అకస్మాత్తుగా వచ్చే సంఘటనలు, మార్పులు, మోసాలు, సంప్రదాయ వ్యతిరేకత, విముక్తి రాహు-కేతువుల ప్రభావంతో జరుగుతాయి. ​ఈ విధంగా ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కారకత్వానికి అధిపతిగా ఉండి, మన కర్మల ఫలితాలను సరిగ్గా అందిస్తుంది. ​3. ఈశ్వరుని దివ్య సమన్వయం...... ​ఈశ్వరుడు విశ్వ నియమాన్ని (కర్మ) సృష్టించి, దానిని అమలు చేయడానికి నవగ్రహాలను నియమించాడు. గ్రహాల గమనం ఒక 'విశ్వ సమయ సంకేతం' (Cosmic Time-table) లాగా పనిచేస్తుంది. ఒక వ్యక్తికి కర్మ ఫలితం అందించడానికి సరైన సమయం వచ్చినప్పుడు, ఆ సమయంలో ఆ వ్యక్తి జాతకంలో ఉన్న గ్రహ స్థితికి అనుగుణంగా ఆ ఫలితం వెలువడుతుంది. ​ఉదాహరణ: గత జన్మలో ఒక వ్యక్తి ఇతరుల ధనాన్ని అన్యాయంగా తీసుకున్నట్లయితే, ఈ జన్మలో శని దశ లేదా రాహువు దశ జరుగుతున్నప్పుడు ఆర్థిక నష్టాలు, అప్పులు లేదా ఇబ్బందులు ఎదురవుతాయి. అదే, ఒక వ్యక్తి సత్యంతో, సేవా భావంతో జీవించినట్లయితే, గురు దశ లేదా శుక్ర దశలో గౌరవం, ధన సమృద్ధి లభిస్తాయి. ​ఈ విధంగా, గ్రహాలు నిష్పాక్షికంగా (Impartial) మన కర్మ ఫలితాలను మన జీవితంలోకి తీసుకొస్తాయి. ఈశ్వరుని నియమం ప్రకారం, మనం ఏది నాటితే అదే కోస్తాము. ​4. మన కర్తవ్యం: కర్మను అర్థం చేసుకోవడం మరియు సరిదిద్దుకోవడం ​మన చేతుల్లో ఉన్నది కేవలం రెండు విషయాలు: ​సత్కర్మలు చేయడం: భవిష్యత్తులో మంచి ఫలితాలు రావడానికి ఇప్పుడు మంచి పనులు చేయడం. ​కర్మ ఫలితాల తీవ్రతను తగ్గించుకోవడం: ​పశ్చాత్తాపం: గతంలో చేసిన తప్పులకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడటం. ​పరిహారాలు: దానం, ఉపవాసాలు, మంత్ర జపాలు చేయడం. ​నవగ్రహ ఆరాధన: నవగ్రహాలను భక్తితో పూజించడం వల్ల కర్మ ఫలితాల తీవ్రత తగ్గుతుంది, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ​ఈ విధంగా, ఈశ్వరుడు కర్మ, నవగ్రహాల ద్వారా ఒక సంక్లిష్టమైన, కానీ న్యాయబద్ధమైన వ్యవస్థను సృష్టించారు. ఇది మానవులను మంచి మార్గంలో నడిపించడానికి, వారి కర్మలను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది.. *సనతన హిందూ ధర్మం*
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ந்காணிபாட் ImanimuP நவண்ணாம் ந்காணிபாட் ImanimuP நவண்ணாம் - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *🌻 మూడు అగ్ని కణాలు 🌻* *కోపం:*- ...మొదటి అగ్ని కణం. అది మనల్ని మనం దహించుకునే జ్వాల. క్షణంలో పుట్టి, మనసును కాల్చి, చివరికి బూడిదను మాత్రమే మిగులుస్తుంది. అది మాటల రూపంలో బయటపడితే, బంధాలను తెగతెంపులు చేస్తుంది. మన కళ్ళ ముందున్న నిజం కూడా, అబద్ధంలా కనిపించేలా చేస్తుంది. *ద్వేషం:-* ... ఇది రెండవ అగ్ని కణం, అది మనల్ని నిరంతరం దహిస్తుంది. ఎదుటివారిలో మంచిని చూడనివ్వదు, ప్రతి చర్య వెనుక ఒక చెడు ఉద్దేశం ఉందని నమ్మిస్తుంది. మన హృదయాన్ని ఇనుములా మార్చి, ప్రేమను ప్రవేశించనివ్వదు. ఈ మంటలు మన లోపల రేగి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చీకటిమయం చేస్తాయి. *అసూయ:*- ... ఇది మూడో అగ్ని కణం, అది ఇతరుల ఆనందాన్ని చూసి జ్వలించే అగ్ని. అది మనల్ని మనల్ని కాకుండా చేస్తుంది, ఇతరుల విజయాన్ని ఓటమిగా చూపిస్తుంది. ఎదుటివారి ఎదుగుదలను చూసి, మన లోపల ఒక లోపం ఉందని భావిస్తుంది. ఈ అగ్నిలో మాడితే, స్వయం కృతాపరాధంతో చివరకు మనమే మిగులుతాం. *ఈ మూడు అగ్ని కణాలు...  బయట ప్రపంచానికి కాదు, మన లోపల ఉన్న శాంతికి నిప్పంటిస్తాయి. వీటిని జయించినవారే, నిజమైన విజేత.* *సర్వేజనాః సుఖినోభవంతు* 🙏
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ( 5 1 ( 5 1 - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *🙏శ్రీ సూర్య నారాయణస్వామి మేలుకొలుపు*🙏 *ఓం ఆదిదేవ నమస్తుభ్యం* *ప్రసీద మమ భాస్కరా!* *దివాకర నమస్తుభ్యం* *ప్రభాకర నమోస్తుతే!!* *శ్రీ సూర్య నారాయణా, మేలుకో హరి సూర్యనారాయణ* పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయా పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయా శ్రీ సూర్యనారాయణా ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయా ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయా శ్రీ సూర్యనారాయణా గడియెక్కి భానుడు కంబ పువ్వు ఛాయా కంబ పువ్వు మీద కాకారీ పూ ఛాయా శ్రీ సూర్యనారాయణా జామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయా జాజిపువ్వు మీద సంపంగి పూ ఛాయా శ్రీ సూర్యనారాయణా మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయా మల్లెపువ్వు మీద మంకెన్నఁ పూ ఛాయా శ్రీ సూర్యనారాయాణా మూడు ఝాముల భానుడు ములగపువ్వు ఛాయా ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయా శ్రీ సూర్యనారాయణా అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయా ఆవపువ్వు మీద అద్దంపు పొడి ఛాయా శ్రీ సూర్యనారాయణా వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయా వంగపువ్వు మీద వజ్రంపు పొడి ఛాయా శ్రీ సూర్యనారాయణా గుంకుతూ భానుడు గుమ్మడి పూ ఛాయా గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయా శ్రీ సూర్యనారాయణా 🌞 *శ్రీ పద్మినీ ఉషా, ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణేనమః 🙏 🌼☘️🌹🌻🍃🌺🌸🌷🌹🌻
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలు 🙏 #ప్రతి రోజు సాయంత్రం - ప్రదోష కాలంలో అమ్మవారుశివుడు ఆనంద తాండవంచేస్తూ ఉంటారట __ ఈ సమయములో చేసే పూజలు అంటే __ #అమ్మవారికి చాల ఇష్ఠం అట* అవి ఆర్ద్రనతకరి అని, అనంత తృతీయ, రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణ వచనం. ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం #అత్యంత #ప్రీతికరం.🙏 ప్రతి #మంగళవారం అమ్మవారిని #సేవించడం, #పూజ చేయటం, #అర్చన చేయటం, #వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది* #ఎవరు మంగళవారం #అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీడలు #ఉండవు !! రోగ నివారణ, అప్పులు, రుణాలు తీరిపోతాయి * అని, కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని * #అమ్మవారికి అత్యంత ప్రీతికర్మయిన రోజు ఈ భౌమవారం (మంగళవారం) అని చెపుతారు. ఎవర్ని అయితే అమ్మవారు కరుణిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందట # #పిలవని పేరంటంగా ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెపుతారు. కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ), ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి కృపకి పాత్రులు కావచ్చు # #నవరాత్రి ద్వయం అంటే శరన్నవరాత్రులు ( దసరా నవరాత్రి ), వసంత నవరాత్రులు, ( ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది) అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు* #వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇష్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితాంబికా, శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే, స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు * #శ్రీ రాముడికి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్టే. అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపం లో అనుగ్రహిస్తుంది ?కాళి, చండి, బాల, లలిత, దుర్గ. అనేక రూపాలలో ఉండి మనని నడిపిస్తుంది * కరుణిస్తుంది అని # #ఒకటి అని కాదు అమ్మవారు సకల_ వ్యాప్తం అయి ఉంది, మాత్రు రూపం, శాంతి రూపం , ఆకలి రూపంలో, జాతి రూపంలో, చైతన్య స్వరూపం, నిద్ర రూపంలో, దయా రూపంలో, బుద్ది రూపంలో కూడా అమ్మవారు ఉంది మనని నడిపిస్తుంది 🍁 #అమ్మవారిని ఏమి కోరుకోవాలి ? కొందరు పిల్లలు కావాలి అని, ఇల్లు కట్టుకోవాలి అని, పెళ్లి కావాలని రక రకాల కోరికలు కోరతాం * కానీ ఏది కోరిన మళ్ళీ దాని వలన కలిగే సుఖం_ అల్పం, క్షణికం, అది తీరగానే మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది.మరి ఏమి కోరాలి ? #శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు, నాతో ఉండు" మోక్షం వద్దు,విద్య వద్దు, సంపదలు వద్దు, కానీ నీ నామ స్మరణ చాలు, నాతో ఉండాలి. ఎప్పుడూ నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి, ఎప్పుడు కరుణిస్తూ ఉండాలి, నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి, అని కోరుకోవాలి అంటారు...🙏 ఓం శ్రీ మాత్రే నమః🙏🙏 సర్వోజన సుఖినోభావంత్
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 మహిషాసుర మర్దిని స్తోత్రము 🙏🌸🙏🌸🙏🌸🙏 అయి గిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతే గిరివర వింధ్య-శిరోఽధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే | భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోషిణి ఘోషరతే | దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 || అయి జగదంబ మదంబ కదంబవన-ప్రియవాసిని హాసరతే శిఖరి-శిరోమణి తుఙ-హిమాలయ-శృంగనిజాలయ-మధ్యగతే | మధుమధురే మధు-కైతభ-గంజిని కైతభ-భంజిని రాసరతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 || అయి శతఖండ-విఖండిత-రుండ-వితుండిత-శుండ-గజాధిపతే రిపు-గజ-గండ-విదారణ-చండపరాక్రమ-శౌండ-మృగాధిపతే | నిజ-భుజదండ-నిపాటిత-చండ-నిపాటిత-ముండ-భటాధిపతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 4 || అయి రణదుర్మద-శత్రు-వధోదిత-దుర్ధర-నిర్జర-శక్తి-భృతే చతుర-విచార-ధురీణ-మహాశయ-దూత-కృత-ప్రమథాధిపతే | దురిత-దురీహ-దురాశయ-దుర్మతి-దానవ-దూత-కృతాంతమతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 5 || అయి నిజ హుంకృతిమాత్ర-నిరాకృత-ధూమ్రవిలోచన-ధూమ్రశతే సమర-విశోషిత-శోణితబీజ-సముద్భవశోణిత-బీజ-లతే | శివ-శివ-శుంభనిశుంభ-మహాహవ-తర్పిత-భూతపిశాచ-పతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 6 || ధనురనుసంగరణ-క్షణ-సంగ-పరిస్ఫురదంగ-నటత్కటకే కనక-పిశంగ-పృషత్క-నిషంగ-రసద్భట-శృంగ-హతావటుకే | కృత-చతురంగ-బలక్షితి-రంగ-ఘటద్-బహురంగ-రటద్-బటుకే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 7 || అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయికరే త్రిభువనమస్తక-శూల-విరోధి-శిరోధి-కృతాఽమల-శూలకరే | దుమి-దుమి-తామర-దుందుభి-నాద-మహో-ముఖరీకృత-దిఙ్నికరే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 8 || సురలలనా-తతథేయి-తథేయి-తథాభినయోదర-నృత్య-రతే హాసవిలాస-హులాస-మయిప్రణ-తార్తజనేమిత-ప్రేమభరే | ధిమికిట-ధిక్కట-ధిక్కట-ధిమిధ్వని-ఘోరమృదంగ-నినాదరతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 9 || జయ-జయ-జప్య-జయే-జయ-శబ్ద-పరస్తుతి-తత్పర-విశ్వనుతే ఝణఝణ-ఝింఝిమి-ఝింకృత-నూపుర-శింజిత-మోహితభూతపతే | నటిత-నటార్ధ-నటీనట-నాయక-నాటకనాటిత-నాట్యరతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 10 || అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే శ్రితరజనీరజ-నీరజ-నీరజనీ-రజనీకర-వక్త్రవృతే | సునయనవిభ్రమ-రభ్ర-మర-భ్రమర-భ్రమ-రభ్రమరాధిపతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 11 || మహిత-మహాహవ-మల్లమతల్లిక-మల్లిత-రల్లక-మల్ల-రతే విరచితవల్లిక-పల్లిక-మల్లిక-ఝిల్లిక-భిల్లిక-వర్గవృతే | సిత-కృతఫుల్ల-సముల్లసితాఽరుణ-తల్లజ-పల్లవ-సల్లలితే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 12 || అవిరళ-గండగళన్-మద-మేదుర-మత్త-మతంగజరాజ-పతే త్రిభువన-భూషణభూత-కళానిధిరూప-పయోనిధిరాజసుతే | అయి సుదతీజన-లాలస-మానస-మోహన-మన్మధరాజ-సుతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 13 || కమలదళామల-కోమల-కాంతి-కలాకలితాఽమల-భాలతలే సకల-విలాసకళా-నిలయక్రమ-కేళికలత్-కలహంసకులే | అలికుల-సంకుల-కువలయమండల-మౌళిమిలద్-వకులాలికులే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 14 || కర-మురళీ-రవ-వీజిత-కూజిత-లజ్జిత-కోకిల-మంజురుతే మిలిత-మిలింద-మనోహర-గుంజిత-రంజిత-శైలనికుంజ-గతే | నిజగణభూత-మహాశబరీగణ-రంగణ-సంభృత-కేళితతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 15 || https://t.me/SriAnamdalahari కటితట-పీత-దుకూల-విచిత్ర-మయూఖ-తిరస్కృత-చంద్రరుచే ప్రణతసురాసుర-మౌళిమణిస్ఫురద్-అంశులసన్-నఖసాంద్రరుచే | జిత-కనకాచలమౌళి-మదోర్జిత-నిర్జరకుంజర-కుంభ-కుచే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 16 || విజిత-సహస్రకరైక-సహస్రకరైక-సహస్రకరైకనుతే కృత-సురతారక-సంగర-తారక సంగర-తారకసూను-సుతే | సురథ-సమాధి-సమాన-సమాధి-సమాధిసమాధి-సుజాత-రతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 17 || పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం న శివే అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ | తవ పదమేవ పరంపద-మిత్యనుశీలయతో మమ కిం న శివే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 18 || కనకలసత్కల-సింధుజలైరనుషింజతి తె గుణరంగభువం భజతి స కిం ను శచీకుచకుంభత-తటీపరి-రంభ-సుఖానుభవం | తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాశి శివం జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 19 || తవ విమలేఽందుకలం వదనేందుమలం సకలం నను కూలయతే కిము పురుహూత-పురీందుముఖీ-సుముఖీభిరసౌ-విముఖీ-క్రియతే | మమ తు మతం శివనామ-ధనే భవతీ-కృపయా కిముత క్రియతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 20 || అయి మయి దీనదయాళుతయా కరుణాపరయా భవితవ్యముమే అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రమే | యదుచితమత్ర భవత్యురరీ కురుతా-దురుతాపమపా-కురుతే జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే 🙏🌸🌸🌸🌸🌸🙏
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 🕉️ నేడు విజయ దశమిన అమ్మలగన్నయమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవిగా దర్శనం ఇస్తున్నారు.🕉️ శ్రీ దుర్గ ! జై దుర్గ | కనకదుర్గాంబ కరుణించిరావమ్మ | కాపాడుబ్రోవమ్మ దయచూపరావమ్మ ! దరిజేర్చు మాయమ్మ! దీవించు ఓయమ్మ | దీనుణ్ని నేనమ్మ ! నా ప్ర్రార్ధన వినవమ్మ ! నీ దివ్యరూపంబు మనసార ధ్యానింప | నీ అభయ హస్తంబు నా శిరము నుంచగా! నీ కరుణ వీక్షంబు, నాపైన కురిపింప! నీ శక్తి లవలేశం నాపైన ప్రసరింప! బంధాలు తొలగంగ నవరాత్రులు చేయంగ! నీకధలు చాటంగ ఆకధలు వినంగ! జ్ఞాన_యజ్ఞములు గావింప ఆ యజ్ఞములు తిలకింప| సామీప్యం బడయంగ | సంతోషము కలిగింది. నీ సంకల్ప భావంబు నా మనమున ఎల్లవేళలా ఉండేలా అనుగ్రహించు తల్లీ| జగన్మాత ! ఓం శ్రీ రాజరాజేశ్వరీదేవి నమస్తే నమః !
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - క్ర 1 శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారం క్ర 1 శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారం - ShareChat
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *దసరా రోజున బంగారం ఇచ్చి పుచ్చుకోవడం వెనుక ఉన్న కథ* ...! పూర్వం ప్రతిష్ఠానపురంలో నివసిస్తూన్న దేవదత్తుని తనయుడు కౌత్సుడు. తండ్రి కౌత్సుని విద్యాభ్యాసము కొరకు వరతంతు అనే ఋషికి బాధ్యతను అప్పజెప్పాడు. వరతంతు గురువు వద్ద విద్యను అభ్యసించాడు కౌత్సుడు. దేవదత్తుని కుమారుడు కౌత్సుడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి ఐనది. గురుకులమునుండి ఇంటికి వెళ్ళే తరుణం వచ్చింది. "గురువర్యా! మీకు ఏ గురుదక్షిణను నేను ఇవ్వవలెను? మీరు ఏదైనా వస్తువులను తెమ్మని ఆనతి ఇస్తే తెస్తాను" వరతంతు దరహాసముతో "నీ శ్రద్ధాసక్తులూ, వినయవిధేయతలే నాకు నీవు ఇస్తూన్న నిజమైన గురుదక్షిణ, అది చాలును నాకు! నీవు పరిపూర్ణ విద్యావంతునివైనావు. నాకు ఆ తృప్తి చాలును" అంటూ ఆశీస్సులు ఇచ్చాడు. కానీ కౌత్సునికి మనసులో ఎంతో వెలితి! ఇన్ని ఏళ్ళుగా భోజనము పెట్టి సాకిన గురు దంపతులు కన్నవారిని తలపించేలా చదువులు చెప్పారు. అట్టి మహనీయులకు ఏమి ఇవ్వక తాను గృహోన్ముఖుడు ఐతే ఎలా?" అదుచే శిష్యపరమాణువు పట్టు విడువక "మీ కోసం ఏదో ఒకటి నేను తెస్తాను,చెప్పండి స్వామీ!” అయ్యవారికి ఈ బాలుని మొండితనం చిరాకు తెప్పించింది. విసుగుతో "ఐతే నాకు బంగారు నాణెములు కావాలి. నేను నీకు 14వేదములు నేర్పాను. ఒక్కొక్క శాస్త్రానికీ ఒక్కొక్క కోటి చొప్పున 140 కోట్ల హేమ టంకములు తీసుకురా!" అని పలికాడు. అందుకు "సరే!" నని కౌత్సుడు అంగీకరించి, వరతంతు వద్ద సెలవు తీసుకున్నాడు. హిందూ ధర్మచక్రం. అటు తర్వాత బహు యోచన చేసాడు. తండ్రి, హితుల సలహా తీసుకున్నాడు. ధర్మదాత అని పేరు పొందిన రఘు మహారాజు వద్దకు వెళ్ళాడు (రఘు చక్రవర్తి వంశీయుడే శ్రీరామచంద్రుడు, కనుకనే ఆతనిని 'రఘుపతి" అని కూడా పిలుస్తారు) కౌత్సుడు వెళ్ళే వేళకు రఘు చక్రవర్తి "విశ్వజిత్ యజ్ఞము"ను చేసాడు. యజ్ఞ యాగాలు చేసే ప్రభువులు 'అడిగిన వారికి లేదనకుండా దానము చేయాలి. ఆ ప్రకారము అప్పటికే ప్రజలందరికీ రాజభవనములోని డబ్బు, దస్కమూ, సొమ్ములను యావత్తూ తన సర్వస్వము దానము చేసేసాడు. ఆయన కోటలోకి - ధనమును యాచించుటకు వచ్చినప్పుడు రఘు చక్రవర్తి కోశాగారం ఖాళీ ఐంది. కౌత్సుడు తన ’గురుదక్షిణ’ సంగతి తెల్పగా, ఖిన్నుడు ఐనాడు ఆ చక్రవర్తి. "కౌత్సా! ఎల్లుండి రమ్ము!" అని చెప్పాడు. మూడురోజుల గడువులోపల రాజు అంత ధనాన్ని తీసుకురావాలనుకున్నాడు. అతను ఇంద్రుని వద్దకు వెళ్ళి ద్రవ్యమును కోరాడు. ధనపతి కుబేరుని పిలిచాడు మహేంద్రుడు. "కుబేరా! రఘు సామ్రాట్టు ముఖ్యపట్టణము అయోధ్య. ఆ రాజధానిలోని షాణు, అపర్తి చెట్లు పై స్వర్ణ నాణాల వర్షము పడేలా చేయి!" అంటూ అజ్ఞాపించాడు సురపతి. అయోధ్యలో ఎడతెరిపి లేకుండా సువర్ణ వర్షం కురిసింది. అలాగ వర్షించిన ధనమును పూర్తిగా కౌత్సునికి ఇచ్చేసాడు రఘువు. [సురవర అనుగ్రహముతో లభించిన అగణిత అపరంజి రాసులు అవి!] కానీ కౌత్సుడునికి డబ్బు అంటే వ్యామోహము లేదు. తన గురుదక్షిణకు అవసరమైన 140 కోట్లు మాత్రమే తీసుకున్నాడు కౌత్సుడు. అతడు"మహాప్రభువుకు కృతజ్ఞతలు" చెప్పి గృహోన్ముఖుడైనాడు. గురువు గారు కోరిన నాణెములు తీసుకుని తక్కినవి రఘురాజుకు తిరిగి ఇచ్చేసాడు కౌత్సుడు. దానముగా ఇచ్చిన వాటిని మళ్ళీ తీసుకోకూడదు రాజు. కావున రఘువు "ఈ డబ్బును నేను తీసుకోను" అంటూ నిరాకరించెను. అప్పడు కౌత్సుడు మిగిలిన డబ్బును ప్రజలకు అందరికీ పంచాడు. అయోధ్యా పట్టణమునందు తెల్ల ఆరె చెట్ల పైన కనకవర్షము కురిసిన రోజు ఆశ్వీజ శుక్ల దశమి. పథాన్ నివాసి ఐన కౌత్సుని అన్వేషణ వలన ఆపతి తరువుల కుందన వృష్టి కురిసి, ధనరాసులనిలయాన్ని చేసింది అయోధ్య నగరము సిరి సంపదలు పొంగులు వారి సుఖసంతోషములతో విలసిల్లసాగినది. నాటినుండీ ప్రజలు అత్తి చెట్టు ఆకులను/తెల్ల ఆరె చెట్టు పత్రములను' పసిడి 'కి ప్రతీకలుగా భావిస్తూన్నారు. ఇరుగుపొరుగువారికీ, బంధు మిత్రులకూ ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూండడం నవ రాత్రి, దసరాల ఆనవాయితీ ఐనది.
🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 - ShareChat