Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_“ప్రేమకు పాలసీ – నమ్మకానికి_ ప్రీమియం”ప్రేమ అనేది మ‌నసులో పుడుతుంది, కానీ ఈ కొత్త యుగంలో అది మొబైల్ యాప్‌లో పుట్టి, అగ్రిగేటర్ ద్వారా రిన్యూ అవుతోంది. “Ziki Love Insurance” అంటారు — వింటే LIC మించిన నమ్మకం ఉన్నట్టు ఉంటుంది. ప్రేమ విఫలమైతే క్లెయిమ్ వస్తుందట! కానీ ఎవరు వెరిఫై చేస్తారు? సాక్ష్యంగా చాట్ హిస్టరీనా లేక స్టేటస్ మెసేజ్‌లా?ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నోడు ప్రేమలో పడితే ప్రీమియం పెరుగుతుంది, విడిపోయితే కమీషన్ తగ్గుతుంది. పాలసీ షరతుల్లో ఇలా ఉంటుంది – “ప్రేమ శాశ్వతం కాకపోతే, సెంటిమెంట్‌లు రిఫండ్ కాదు.” ప్రతినెల పాలసీ రిన్యువల్‌తో పాటు, హృదయానికి కొత్త OTP వస్తుంది.ఒకవేళ నిజంగానే క్లెయిమ్ చేసుకోవాలంటే, కస్టమర్ కేర్ అడుగుతుంది – “మీరు ప్రేమలో పడిన తేదీ ఏమిటి? సాక్ష్యాలు ఏమిటి?” అంతలోనే వాడు అనుకుంటాడు – ఇంత కాంప్లెక్స్ ఫారం కంటే బ్రేకప్ సులభమేమో!ఇదే కొత్త కాలపు “భావోద్వేగ మార్కెటింగ్” – ప్రేమను ఎమోషన్‌ కంటే కూడా ట్రాన్సాక్షన్‌గా మార్చిన బిజినెస్. చివరికి మనసుకు నష్టం తమ సరదాకు లాభం* #😁Hello🙋‍♂️
*_ఉచితం వద్దు🫴ఉపాధే ముద్దు_...* *ఒక ఆర్థికశాస్త్రం (Economics) ప్రొఫెసర్ తన స్నేహితులతో ఇలా చెప్పారు,* *నేను పనిచేసే కాలేజీలో ఇప్పటివరకు ఒక స్టూడెంట్ కూడా ఫెయిల్ అవ్వలేదు,* *కానీ ఈమధ్య ఒక క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చెయ్యవలసి వచ్చింది...!!* *ఎలా అని అడిగారు మిగతా వాళ్లు...!!* *ఒక క్లాస్ వాళ్ళు ఇలా అడిగారు,* *క్లాస్ లో ఒకరికి టాప్ ర్యాంక్, ఇంకొకరికి లీస్ట్ ర్యాంక్ కాకుండా అందరికీ ఒకటే సమానమైన ర్యాంక్ ఇవ్వండి అన్నారు, OK అన్నాను...* *మీ అందరి మార్కులు కలిపి average తీసి క్లాసు మొత్తానికి ఒకే రాంక్ ఇస్తా అన్నాను.* *మొదటి సెమిస్టర్లో average ర్యాంక్ "B" వచ్చింది అందరికి,* *2 nd సెమిస్టర్లో అందరికి "D" ర్యాంక్ వచ్చింది,* *3rd సెమిస్టర్ లో అందరికి "F" వచ్చింది,* *ఫైనల్ exams లో అందరూ ఫెయిల్ అయ్యారు,* *స్టూడెంట్స్ అందరూ అవాక్కయ్యారు,* *బాగా కష్టపడి చదివేవాళ్ళు... ఎవరికోసమో మేము చదవడమెందుకు అని చదవటం మానేశారు,* *చదువు మీద శ్రద్ధ లేనివాళ్ళు... ఎలాగూ తెలివికల వాళ్ళు చదువుతారు కదా, ఇక మేమెందుకు చదవటం అని చదవటం పూర్తిగా మానేశారు,* *ఈ ప్రయోగంలో నాలుగు విషయాలు తేటతెల్లమవుతున్నాయి.* *1. చట్టం ద్వారా పేదవాడిని సంపన్నుడిగా చేయలేము,* *కానీ అదే చట్టం ద్వారా సంపన్నుడిని పేదవాడిగా చెయ్యొచ్చు.* *2. ఒకరు ఏదైనా ఉచితంగా పొందుతున్నారు అంటే మరొకరు ఆ ఉచితం ఇవ్వటం కోసం కష్టపడుతున్నారు,* *3. గవర్నమెంట్ ఏదైనా ఉచితంగా ఇస్తుంది అంటే,* *ఎవరి దగ్గరనుండో ఆ ఉచితానికి కావలసిన కష్టాన్ని తీసుకుంటుంది.* *4. ఉన్నది పంచుకుంటూ పోతే సంపద సృష్టి జరగదు,* *కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి.* *సగం మంది ప్రజలు మేము కష్టపడటం ఎందుకు...* *అన్నీ మాకు ఉచితంగా వస్తున్నాయనుకుంటే...* *మిగతా సగం కష్టపడి ఉచితాలకి కావలసినవి సమకూర్చుతున్నారు,* *ఈ కష్ట పడేవాళ్ళు ఎందుకు మాకీ కష్టం...* *ఎవరినో కూర్చోపెట్టి మేపటానికి అని, కష్టపడటం మానేస్తే,* *అక్కడే దేశ వినాశనానికి బీజం పడుతుంది...* _(సేకరణ)_ #మన సంప్రదాయాలు సమాచారం
*_యాలుక_* *#రాత్రి నిద్రకు ముందు యాలకులు తిని వేడి నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలకు ఆశ్చర్యపోతారు!!* *సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి..* *బ్రిటీషర్లు మన దేశంపై దండెత్తి తొలి రోజుల్లో ఇక్కడ తిష్ట వేసిన ప్రధాన కారణాల్లో సుగంధ ద్రవ్యాలు మన దేశంలో దొరకడమే.* *అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి.. బహుళ ప్రయోజనాలెన్నో ఉన్నాయి*. *ముఖ్యంగా యాలకులు మన ఆరోగ్యానికి చేసే మేలు ఏంటో తెలిస్తే ఆశర్య పోతారు*. *అయితే రాత్రి పడుకోపోయే ముందు ఒక్క యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం.* *ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు*. *#ఈ మద్య కాలం లో బరువు తగ్గించుకోవడాని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది. సింపుల్ గా బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను పెంచుతుంది.* *ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఇంకా చెప్పాలంటే..* *#నిత్యం ఒక యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలినాలు, చెడు పదార్దాలు తొలగిపోతాయి*. *అంతేకాదు రక్తప్రసరణ మెరుగుపడుతుంది.* *అన్ని అవయవాలాను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది. మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్దాలు జీర్ణం కాక ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి*. *ఈ కారణంగా అనేక మంది మలబద్దకం సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాటి వారు ఈ నియమాలను ఫాలో అవ్వడం వల్ల మలబద్దకం సమస్య నుండి విముక్తి అవుతారు*. *తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది. మరీ ముఖ్యంగా..* *చాలా మంది రాత్రి నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగాలి*. *ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమీ సమస్య తొలగిపోయి హాయిగా పడుకోగానే నిద్రలోకి జారుకుంటారు*. *#అలాగే నిద్రలో గురక శబ్ధం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యలక్కయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పని చేసి నిధానంగా నిద్రలో గురక తగ్గుతుంది. రోజూ ఇలా చేస్తే ఎముకలను బలంగా మార్చుతుంది*. *అంతేకాదు ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - RAAVAN RESPECTED AS ANCESTOR IN BISRAKH VILLAGE IGT (@@ In Gredfer Noido; do not burn people Raavan during Dussehra. They honor him as their ancestor, worship his stofue , qnd toke pride in fheir herifoge, keeping traditions alive RAAVAN RESPECTED AS ANCESTOR IN BISRAKH VILLAGE IGT (@@ In Gredfer Noido; do not burn people Raavan during Dussehra. They honor him as their ancestor, worship his stofue , qnd toke pride in fheir herifoge, keeping traditions alive - ShareChat
*_#రాజా_రవివర్మ_* *రాజా #రవివర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతములలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో అతనికి అతనే సాటి. 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది. భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించారు*. *ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు*. *_బాల్యము_* *రాజా రవివర్మ ఈనాటి భారతదేశములోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు ఏప్రిల్ 29, 1848న జన్మించారు*. *చిన్నతనములోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు*. *అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. పాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి.* *_వృత్తి_* *1873 వియన్నా చిత్ర ప్రదర్శనలో మొదటి బహుమతి పొందిన తరువాత రవివర్మ బాగా వెలుగులోకి వచ్చారు. ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు.* *తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. రాజా రవివర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి. రవివర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్తి పొందింది*. *1894 లో లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించాడు రవివర్మ.* *దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబైలో ప్రారంభించాడు*. *అయితే అక్కడ స్థలాభావం కారణంగా, భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల, కార్మికులు సరిగా లభించకపోవడం వలన నాలుగు సంవత్సరాల తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ ఉన్న మలవాలి అనే గ్రామాన్ని ఎంచుకున్నాడు. ప్రెస్ పక్కనే తన నివాసాన్ని కూడా ఏర్పరుచుకున్నాడు*. *ప్రింటింగ్ పనులు బాగా సాగడంతో కేరళ నుంచి తరచుగా ఈ గ్రామాన్ని సందర్శిస్తుండే వాడు*. *రవివర్మ చనిపోవడానికి రెండేళ్ళ ముందు ప్రెస్ ను తన స్నేహితుడైన ఒక జర్మన్ సాంకేతిక నిపుణుడికి విక్రయించాడు. దానితో పాటు వంద చిత్రాలకు కాపీరైట్ కూడా ఇచ్చాడు. అయితే 1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలను, రాళ్ళనూ ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి పంచి పెట్టేశారు. ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే భద్రపరచగలిగాయి.* *_క్రింది చిత్రాలు రాజా రవివర్మకు ఎంతో పేరు తెచ్చినవి:_* *పల్లె పడుచు* *ఆలోచనలో మునిగిపోయిన స్త్రీ* *దమయంతి హంస సంవాదము* *వాద్యకారుల బృందము* *సుభద్రార్జునులు* *లేడీ విత్ ఫ్రూట్స్* *హార్ట్ బ్రోకెన్* *స్వర్బత్ ప్లేయర్* *శకుంతల* *శ్రీ కృష్ణ రాయబారము* *రావణ జటాయు వధ* *ఇంద్రజీత్ విజయము* *బిక్షకుల కుటుంబము* *లేడీ ప్లేయింగ్ స్వర్బత్* *గుడి వద్ద దానాలు ఇస్తున్న స్త్రీ* *వరుణుని జయించిన రాముడు* *నాయర్ల స్త్రీ* *శృంగారంలో మునిగిన జంట* *కీచకుని కలవటానికి భయపడుతున్న ద్రౌపది* *శంతనుడు మత్స్యగంధి* *ప్రేమలేఖ వ్రాస్తున్న శకుంతల* *కణ్వుని ఆశ్రమములోని బాలిక. (ఋషి కన్య).* *_తాత్విక దృష్టి_* *రవివర్మ తాత్విక దృష్టి గురించిన వివరాలు తెలియవు*. *ముఖ్యంగా పాశ్ఛ్యాత్య చిత్రకళా శైలి మీద అతని అవగాహన గురించి (అందులో అతనికి క్రమమైన ప్రాథమిక శిక్షణ ఉంది అని తెలిసినా) తెలియదు. రవివర్మ చిత్రకళపైన తీక్షణమయిన పరిశోధన చేసే వారికి రవివర్మ వ్రాసిన ఎటువంటి పుస్తకాలూ లేకపోవటము వలన వారి పరిశోధన అసంపూర్తిగా మిగిలి పోతుంది. కాని రవివర్మ తమ్ముడు, సి.రాజరాజవర్మ రాసిన దినచర్య ఎంతో ఉపయోగపడుతుంది.సి.రాజరాజవర్మ స్వతహాగా మంచి పేరున్న చిత్రకారుడు. ఆయన రవివర్మకు చిత్రాలు చిత్రించడంలో సహాయము చేసేవాడు అతని ఆంతరంగిక సహాయకుడు.* *_శ్రద్ధాంజలి_* *రాజా రవివర్మ చిత్రకళకు చేసిన మహోన్నత ఉపకారానికిగానూ కేరళ ప్రభుత్వము ఆయన పేరిట రాజా రవివర్మ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఈ పురస్కారము ప్రతి ఏటా కళలు,సంస్కృతి అభ్యున్నతికై,విశేష కృషి సల్పిన వారికి ఇస్తుంది* *రాజా రవివర్మ పేరిట కేరళలోని మావలికెరలో ఒక ఫైన్ఆర్ట్స్ కళాశాలను కూడా నెలకొల్పారు. రవివర్మపై గల ఆసక్తి వల్ల సినిమా, వీడియోలలో కుడా అతని చిత్రాలను ఉపయోగించుకుంటున్నారు.* *_సంసార జీవితము_* *రాజా రవివర్మకు మావలికెర రాజ కుటుంబానికి చెందిన రాణీ భాగీరథీబాయి (కోచు పంగి అమ్మ)తో వివాహం జరిగింది.* *వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. పెద్ద కుమారుడు, రాకుమారుడు రామవర్మ కూడా చిత్రకారుడు. ఇతనికి శ్రీమతి గౌరీ కుంజమ్మతో వివాహం జరిగింది. ఈమె దీవాన్ పి.జి.ఎన్.ఉన్నిథాన్ చెల్లెలు. రెండవ వాడు రాకుమారుడు రాజరాజవర్మ. పెద్ద కుమార్తె రాకుమారి మహాప్రభ*. *(ట్రావెన్‌కూర్ రాణీ సేతులక్ష్మీబాయి తల్లి). ఈమె రవివర్మ వేసిన రెండు చిత్రాలలో కన్పిస్తుంది. రెండవ కుమార్తె రాకుమారి ఉమాబాయి. రవివర్మ సంతానము తోటే మావెలికెర రాజ కుటుంబము ఏర్పడింది. ఇంకా ఆయన మనుమరాండ్రు ఇద్దరు మావలికెర రాజ కుటుంబానికి దాయాదులయిన ట్రావెన్కోర్ రాజ కుటుంబానికి దత్తు పోయారు. వారిలో పైన చెప్పబడిన రాణీ సేతులక్ష్మీబాయి కూడా ఉంది. వారి సంతానమే ఇప్పటి ట్రావెన్‌కూర్ రాజ కుటుంబము.* *రవివర్మ గురించిన పుస్తకాలు* *రాజా రవివర్మ:* *పోట్రెయిట్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్: ది డైరీ ఆఫ్ సి.రాజరాజవర్మ* *రాజా రవివర్మ, ముద్రింపబడిన హిందూ దేవతలు,ఎర్విన్ న్యూ మేయర్,క్రిస్టీన్ స్కెల్బెర్గెర్.న్యూ ఢెల్లి,ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్.2003*. *రాజా రవివర్మ,ప్రఖ్యాతి గాంచిన భారతీయ చిత్రకారుడు 1848-1906,క్లాసిక్ కలెక్షన్,వాల్యూమ్ 1,2.పర్సు రామ్ మంఘా రామ్,బెంగుళూరు.2005.* *రాజా రవివర్మ: చిత్రకారుని ముఖచిత్రం,డయిరి ఆఫ్ సి.రాజరాజవర్మ,ఎడిటెడ్ బై ఎర్విన్ న్యూ మేయర్,క్రిస్టీన్ స్కెల్బెర్గెర్.న్యూ ఢెల్లి,ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్.2005*. *దేవుని చిత్రకళ,ఎన్రికో కాస్టెల్లి,గియోవాన్ని ఏప్రిల్.న్యూ ఢీల్లి.ఇల్ తామ్బురోపార్లాన్టి డాక్యుమెన్టేషన్ సెంటర్,ఎథ్నోగ్రాఫిక్ మ్యూసియమ్.2005.* *ఫొటోస్ ఆఫ్ గాడ్స్,ది ప్రింటెడ్ ఇమేజ్ అండ్ పొలిటికల్ స్ట్రగుల్ ఇన్ ఇండియా.బై క్రిస్టోఫర్ పిన్నె,లండన్,రీక్షన్ బుక్.* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ೫೬ ೫೬ - ShareChat
*_పాక్ రూపు రేఖలు మారిపోతాయ్ జాగ్రత్త అంటూ రాజ్ నాథ్‌సింగ్ వార్నింగ్_* *"సర్ క్రీక్" కొత్తగా విన్నట్లుంది కదూ అవును నాకూ కొత్తే కాకపోతే ఈ పదం మన రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ గారి నోటి నుండి గాందీ జయంతి నాడు చాలా గంభీర స్వరంతో వినిపించే సరికి నాకూ దీని గురించి తెలుసుకోవాలనిపించింది. తెలుసుకున్నాక మనసాగక మీకూ తెలుపాలనిపించింది. అందుకే మీకోసం ఈ వ్యాసం*. *ఊళ్లల్లో మనం చిన్న పెంట కుప్పల స్థలం దగ్గర కూడా నాదంటే నాదని కొట్టుకునే రోజుల్లో ఉన్నాం. మరి అలాంటిది దేశ రక్షణకు బద్రత దృష్ట్యా అంత్యంత ప్రధానమైన సరిహద్దు ప్రాంతాలను జాగ్రత్తగా చూసుకోపోతే మన పెంట కుప్పలే కాకుండా మన ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి మనమంతా దేశ భద్రత విషయంలో జాగరూకత కలిగి వుండటం కోసం ఇటువంటి విషయాలు తప్పనిసరిగా చదవాలి తెలుసుకోవాలి*. *భారతదేశ సరిహద్దుల్లో ఎన్నో వివాదాలు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కచ్చ్ వరకు, ప్రతి అంగుళం మన జాతీయ భద్రతకు అత్యంత కీలకం. అలాంటి ఒక చర్చనీయాంశం సర్ క్రీక్. గుజరాత్‌లోని కచ్ జిల్లాకు, పాకిస్తాన్ సింధ్ ప్రాంతానికి మధ్యలో ఉన్న ఈ చిన్న నదీ మార్గం, నేడు భారత్–పాక్ మధ్య అతిపెద్ద వ్యూహాత్మక సమస్యగా, గొడవగా మారింది.* *_సుమారు 96 కిలోమీటర్ల పొడవైన ఈ క్రీక్ బయటికి చూస్తే పెద్దగా ప్రాధాన్యం లేనట్టే కనిపిస్తుంది. కానీ దీనిని ఎవరు నియంత్రిస్తారన్న ప్రశ్నకు సమాధానం, నేరుగా వేల చదరపు కిలోమీటర్ల అరేబియా సముద్రంపై హక్కులు ఎవరి దిశగా వెళ్ళిపోతుందో అనే భయం ఎప్పటి నుండో వుంది కానీ అది ఇప్పుడే మొదలవుతుంది వేగంగా అని ఎవరూ భావించలేదు. ఈ ప్రాంతంలో చమురు, సహజ వాయువు, చేపల వనరులు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం ఒక నదీ ప్రాంత తేమ ఉన్న భూమి సమస్య కాదు, దేశ భవిష్యత్తు వనరుల ప్రశ్న_* *పాకిస్తాన్ వైఖరి ఎప్పటిలాగే స్పష్టం ఎందుకంటే పాక్ కి తను అభివృద్ధి చెందటం కన్నా భారత్ ని కంటిలో నలుసుగా, చెప్పులో ముల్లుగా మారి ఎప్పుడూ ఇబ్బంది పెట్టడమే దానికి అత్యంత ఇష్టమైన పని. అలాంటి పని ఇప్పుడు పాక్ మళ్లీ మొదలు పెట్టింది, మొత్తం సర్ క్రీక్ తమదే అని గట్టిగా వాదిస్తుంది. ఎలాంటి రాజీకి రావడానికి సిద్ధంగా లేదు, దానికి విరుద్ధంగా భారత్ ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో “న్యూట్రల్” ధోరణిలో ఉండింది. మధ్యలో సరిహద్దు వేసుకుందాం అని మితంగా మాట్లాడింది. కానీ ఈ మితిమీరిన మృదుత్వం మనకే నష్టం తెచ్చిపెడుతోంది*. *( క్రింద ఇవ్వబడిన చిత్రాలలో మీరు చూడొచ్చు సర్ క్రీక్ ఒక తేమతో కూడిన నది‌. గీతలతో కూడుకుని చిత్రాలలో ఉంటుంది, మీకు మరింత స్పష్టత రావడం కోసం మరిన్ని చిత్రాలు కూడా జత పరిచాను.)* *చరిత్రలో కూడా అదే చెబుతుంది, 1965 యుద్ధం సమయంలో కచ్చ్ రణంలో యుద్ధం జరిగింది. తరువాత పలు కమిషన్లు, ట్రిబ్యునల్స్ ఏర్పడ్డా సమస్య తేలలేదు. పాకిస్తాన్ ఎప్పుడూ గరిష్టమైన లాభం సాధించేందుకు ప్రయత్నించింది. కానీ భారత్ మాత్రం చాలా సార్లు “వేచి చూద్దాం” అనే స్థితిలోనే ఉండిపోయింది.* *కానీ‌ పాక్ మళ్లీ సౌదీ కి తమ సైనికుల్ని అమ్ముకుని, అమెరికా దగ్గర అడుక్కొచ్చిన డబ్బులతో సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున మిలటరీ బిల్డింగ్ లు, ఎయిర్ బేస్ లు నిర్మించే ప్రయత్నం ప్రారంభం చేస్తుంది. కాకపోతే భారత్ వైపు నుండి ఇప్పుడు పరిస్థితి మారింది. గాంధీ జయంతి రోజు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. “పాకిస్తాన్ ఎటువంటి సైనిక అహంకారం లేదా misadventure చేసినా, భారత్ దానికి దృఢమైన సమాధానం ఇస్తుంది” అని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా ఆయన గట్టిగా గుర్తు చేశారు – “క్రీక్ ద్వారా కారాచీకి మార్గం ఉంది” అని. ఇది ఒక సాధారణ వ్యాఖ్య కాదు ఇది వ్యూహాత్మకంగా పాకిస్తాన్‌కి ఇచ్చిన గట్టి సందేశం. అంటే ఏంటి నువ్విలాగే చేస్తే కరాచీ ని మేము కలుపుకోవాల్సి వస్తుందని ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇది*. *రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, భారత్ ఎన్నో సార్లు చర్చల ద్వారా పరిష్కారం కోరిందని. కానీ పాకిస్తాన్ ఎప్పుడూ ద్వంద్వ ధోరణి ప్రదర్శించిందని ఆయన వివరించారు. చర్చలకు వస్తున్నట్టు చూపిస్తారు, కానీ అంతలోనే మరోవైపు సైనిక నిర్మాణాలు చేస్తారు. ఇది వారి తరహా రాజకీయపు బాగోతంగా వర్ణిస్తాను*. *సర్ క్రీక్ సమస్యలో ఒక ప్రాథమిక సూత్రం ఉంది, “Thalweg doctrine”. అంటే నది మధ్యలోనే సరిహద్దు నిర్ణయించాలి. భారత్ ఈ పద్ధతిని అనుసరిస్తూ తర్కబద్ధంగా ముందుకు వెళ్ళింది. కానీ పాకిస్తాన్ మాత్రం నది మొత్తాన్ని తమదిగా చూపుతూ మాయమాటలతో బలవంతం చేయాలని చూస్తోంది. ఇక్కడే ప్రశ్న వస్తుంది – మనం ఎందుకు ఎప్పుడూ తగ్గి మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. మళ్లీ అది మన సహజ స్వభావంగా అనిపిస్తుంది.* *ఇక్కడ ఒక పెద్ద విషయం గమనించాలి మనం ఇది తెలిస్తే ఖచ్చితంగా షాక్ కి గురవుతాం, 2007లో మన ప్రధాని మన్మోహన్ సింగ్ జీ Siachen డిమిలిటరైజ్ (అంటే శియాచిన్ లో సైనిక బేస్ లు తీసివేయాలని) చేయాలని, Sir Creek ను పాక్షికంగా పంచుకోవాలని ఆలోచించారు.* *అంతేకాదు, ఆ సమయంలో అమెరికా ఒత్తిడి కూడా ఉండింది. ఇది 2006లో ముంబై లో జరిగిన సీరీస్ బాంబింగ్ (సుమారు 209 మంది ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకరం) తర్వాత జరగడం మరింత ఆశ్చర్యకరమని అనిపించింది. ఆ సమయంలో మనం తక్షణ చర్య తప్పించి, అలాగే తిరిగి శాంతిచర్చలతో వ్యవహరించాం గానీ చర్యలు తీసుకోకపోవడం మూలాన తద్వారా 26/11/2008 నాటికి మరింత శక్తివంతమైన దాడికి ప్రేరణగా మారింది*. *భద్రతా భావనలను త్యజిస్తే భవిష్యత్తు శూన్యం, Siachen వంటివి ఒకసారి వదులుకున్నాక తిరిగి రావడం చాలా కష్టమయ్యే వైవిధ్యాల సూత్రం సైన్యం బలంగా హై లైట్ చేసింది. ఒక స్ధానాన్ని ఇచ్చి వెళ్ళితే, తిరిగి దాన్ని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టం, ఖర్చు, వ్యూహాత్మక ప్రమాదాలతో నిండి ఉంటుంది. కాబట్టి ప్రజా భద్రతా అంశాలు, ప్రాథమిక రక్షణాపరమైన విలువలను పక్కన పెడితే ఆ పరిణామాలు అనేకమందికి అజేయమైన నష్టాలుగా మారతాయి అనేది మనకు PoJK విషయంలో, అక్షయచిన్, తవాంగ్ విషయంలో స్పష్టంగా అర్దమయ్యింది, మొత్తానికి మన్మోహన్ జీ ఆ ఆలోచనను విరమించుకోవడం మనకు కాస్తో కూస్తో కలిసొచ్చింది*. *మనకు స్పష్టంగా అర్థమై ఉండాల్సింది ఒకటే న్యూట్రాలిటీ అనేది ఒక బలహీనత. ఇప్పుడు సమయం వచ్చింది. భారత్ తన హక్కులను స్పష్టంగా గుర్తించింది. సర్ క్రీక్ విషయంలో మనం కేవలం “రక్షణాత్మకంగా” కాకుండా “దృఢంగా ముందుకు సాగాలి”.* *పాకిస్తాన్ చెబుతున్నట్టు మొత్తం క్రీక్ తమదే అంటే, మనం కూడా అదేవిధంగా సగం మాది అనేది కాకుండా దృఢంగా చెప్పాలి*. *ఇది మన సముద్రహక్కుల కోసం, మన జాతీయ భద్రత కోసం అత్యవసరం. అందుకే రాజ్ నాథ్ సింగ్ ఈ విషయం పై కుండబద్దలు కొట్టారు, సర్ క్రీక్ దగ్గర మిలటరీ స్థావరాలు నిర్మిస్తే మాకు కరాచికి‌ మార్గం తెలుసు అని చాలా‌ అంటే స్ట్రాంగ్ మెస్సేజ్ పాకిస్తాన్ కి ఇచ్చారు. చివరకు ఏంజరుగుతుందో వేచి చూడాల్సిందే...* *సర్ క్రీక్ వివాదం కేవలం ఒక సరిహద్దు రేఖ అనేది ఇక్కడ ప్రశ్న కానే కాదు. ఇది మన జాతీయ గౌరవం, మన భవిష్యత్ వనరులు, మన వ్యూహాత్మక శక్తి గురించి. కాబట్టి ఇకనుంచి భారత్ సహజత్వాన్ని వదులుకొని, దృఢసంకల్పంతో ముందుకు నడిస్తేనే పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇస్తాం. ఈ సమయంలో స్వామీ వివేకానంద వాక్కుని గుర్తుచేసుకుందాం, బలమే జీవనం బలహీనతే మరణం.* #మన సంప్రదాయాలు సమాచారం
#మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ARAVIND SRINIVAS OF PRPLEXITY Al BECOMES YOUNGEST INDIAN BILLIONAIRE C3 [ಲ   JPT 9 ~r Berkeley A+ 31 Chennai-born IIT-Madras & graduate, ex-OpenAI/DeepMind/ Google] researcher, built Al search amassed {21,190 crore net worth, and challenged Google with Perplexify s global rise ARAVIND SRINIVAS OF PRPLEXITY Al BECOMES YOUNGEST INDIAN BILLIONAIRE C3 [ಲ   JPT 9 ~r Berkeley A+ 31 Chennai-born IIT-Madras & graduate, ex-OpenAI/DeepMind/ Google] researcher, built Al search amassed {21,190 crore net worth, and challenged Google with Perplexify s global rise - ShareChat