ఇది వైసీపీ హయాంలో జరిగిన ఒక దారుణఘటన. సోడాలు అమ్ముకునే నిరుపేద కుటుంబానికి చెందిన మిస్బా పలమనేరు పట్టణంలో పదో తరగతి చదివేది. అదే స్కూల్లో స్థానిక వైసీపీ నేత సునీల్ కూతురు కూడా చదివేది. చదువులో వీరిద్దరికీ పోటీ ఉండేది. కానీ ఈ విషయంలో వైసీపీ నేత తలదూర్చాడు. ప్రిన్సిపాల్ ను దారికి తెచ్చుకుని మిస్బాకు బలవంతంగా టీసీ ఇప్పించాడు. దాంతో మనస్తాపానికి గురైన మిస్బా ఆత్మహత్య చేసుకుంది. నిందితులను శిక్షించాల్సిన వైసీపీ పెద్దలు బాధితులనే బెదిరించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో యువగళం పాదయాత్రలో ఉన్న లోకేష్ గారు ఈ ఘటన గురించి విని చలించి పోయారు. నాడు బాధిత కుటుంబానికి ఇచ్చిన హామీ ప్రకారం రూ.5 లక్షల ఆర్థిక సాయం... ఇంటి స్థలం ఇప్పించారు.
#NaraLokeshForPeople
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్