#🎶భక్తి పాటలు🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #😇శివ లీలలు✨
#ప్రకృతి రమణీయ దృశ్యాలు #🎧మ్యూజిక్ #✌️నేటి నా స్టేటస్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #🙆 Feel Good Status
*TTD - Online Services*
Dear HARI BABU.G
*Om Namo Venkatesaya..!*
We are pleased to inform you that your preference for *Vaikunta Dwara Darshanam* on *30-12-2025* has been selected through the Electronic DIP process.
Your Darshan Reporting Time: *02:00 PM on 30-12-2025*
Reporting Location: *ATGH Circle, Tirumala
You can download your darshan receipt anytime from the TTDevasthanams Website / Mobile App under booking history
Wishing you a blessed and blissful Darshanam
__________________________________________
HARI BABU.G
__________________________________________ #ఓం నమో వేంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం #తిరుమల తిరుపతి దేవస్థానం #🌿🌺🕊️తిరుమల తిరుపతి దేవస్థానం🕊️🌺🌿 #తిరుమల - తిరుపతి దేవస్థానం #వైకుంఠ ఏకాదశి దర్శనం
#✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట #😃మంచి మాటలు #🙆 Feel Good Status #😎ఆటిట్యూడ్ స్టేటస్
*🌿🌼🙏🌿🌼🙏అష్ట ఐశ్వర్యాలను ... ఆరోగ్యాన్ని.. స్త్రీలకు ఐదవతనాన్నిప్రసాధించే విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారు🙏🌼🌿*
🌿🌼🙏విశాఖపట్నంలోని ఆలయాలలో ప్రముఖమైనది కనకమహాలక్ష్మి ఆలయం. బురుజుపేటలో నెలకొన్న ఈ ఆలయం క్రిందటి శతాబ్దం పూర్వార్ధంలో వెలుగులోకి వచ్చిందని ప్రతీతి. కనకమహాలక్ష్మి విశాఖ పాలకుల ఇలవేలుపు. విశాఖ వాసులకే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విశాఖ నగరం నడిబొడ్డున కొలువు ఉన్నారు. నేడొక ప్రముఖ పట్టణంగా గుర్తింపబడిన విశాఖ వంద సంవత్సరాల క్రిందట ఒక చిన్న ఊరే ! శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనాలతో విలసిల్లుతున్నది. భక్తులపాలిట కల్పవల్లిగా ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలువబడుతోంది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, స్త్రీలకు ఐదవ తనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింపచేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తూంటారు.🙏🌼🌿
🌿🌼🙏మరి ఈ ఆలయ చరిత్ర, మహిమలు, విశేషాలేంటో తెలుసుకుందాం ..🙏🌼🌿
🌿🌼🙏శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం శ్రీకనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఇతర దేవాలయాలలో వలె కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో మనకు దర్శనమిస్తుంది. ఇదీ ఈ అమ్మవారి ప్రత్యేకత. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఓ చిన్న గ్రామంగా విశాఖ రాజులపాలనలో ఉండేదని, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు నాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని తెలుస్తోంది.🙏🌼🌿
🌿🌼🙏ఈ అమ్మవారు స్వయంభు: విశాఖ రాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అందుచేతనే ఈ ప్రదేశాన్ని బురుజుపేట అనే పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. ఈ అమ్మవారు స్వయంభు: .ఆశ్చర్యకరంగా ఇక్కడ అమ్మవారికి ఎడమచెయ్యి సగం వరకే ఉంది.🙏🌼🌿
🌿🌼🙏భక్తులే స్వయంగా మరో విషయం ఏమటంటే అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమి ఉండదు. కేవలం కొబ్బరి ఆకులతో పందిరాలు ఏర్పాటు చేస్తారు . ఇక్కడ భక్తులే స్వయం గా పూజలు చేయవచ్చు. పసుపు, కుంకుమా చీరలు భక్తులు అమ్మవారికి సమర్పిస్తున్నారు. పూజారులు ఎవరు ఉండరు, భక్తులే స్వయంగా పూజలు చేసి నమస్కరించి భయటకు వస్తారు.
🌿🌼🙏సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరికి వారే ఆ అమ్మను కొలుచుకునే భాగ్యం ఉంటుంది. అందుకే భక్తులంతా అమ్మవారికి పసుపు ,కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి దేవికి నివేదించే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది. సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలకు నమ్మకం కలిగిన తల్లిగా మారారు. అందుకే పుట్టిన బిడ్డలను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం ఉత్తరాంధ్ర ప్రజలకు అలవాటు. అలాగే అరుదుగా అమ్మవారిని భక్తులే నేరుగా పసుపు కుంకుమలు, పాలు పవిత్ర జలాలతో పూజలు చేసే ఆచారం ఈ సన్నిధానంలో సాగటం మరో విశేషం.🙏🌼🌿
🌿🌼🙏ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత ఈ దేవాలయానికి సంబంధించి సరియైన చారిత్రక ఆధారాలులేవు. ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత, కుటుంబ దేవతగా తెలుస్తుంది. అప్పటి రాజుల యొక్క కోట బురుజు కలప్రాంతం అయిన బురుజుపేటలో కల అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది.🙏🌼🌿
🌿🌼🙏స్థానిక కథనం ప్రకారం, స్థానిక కథనం ప్రకారం, 1912 లో శ్రీ కనక మహాలక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మునిసిఫల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరోచోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విసాఖలో ప్లేగు వ్యాధి ప్రభలి అనేకమంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వలనే జరిగిందని తలచి మళ్ళీ యధాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకు అమ్మవారి మీద గురి ఏర్పడటం తరువాత ఆమె యొక్క మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందినది.🙏🌼🌿
🌿🌼🙏మరో కథనం ప్రకారం.. సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మనుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై.. తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించాలని కోరుతుంది. అయితే, ఆ బ్రాహ్మనుడు తాను కాశీకి వెళ్తున్నానని, మన్నించాలని ప్రాదేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామ హస్తంలోని పరిగ అనే ఆయుధంతో బ్రాహ్మనుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మనుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి.. అమ్మవారి వామ హస్తాన్ని మోచేతి పైవరకు ఖండిచి, శాంతిపజేస్తాడు. కనక మహాలక్ష్మీగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే, ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు.🙏🌼🌿
🌿🌼🙏గురువారం ప్రీతికరమైన రోజు అమ్మవారి సేవలకు " గురువారం " ప్రీతికరమైన రోజు. ఆ రోజు తెల్లవారినది మొదలు రాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించి , తీర్థ, ప్రసాదాలను స్వీకరిస్తుంటారు. ఈ ప్రాంతంలోని భక్తులు తమకు పుట్టిన పసికందును కూడా అమ్మవారి ఒడిలో ఉంచి ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు, ఆరాధిస్తారు.🙏🌼🌿
🌿🌼🙏ప్రతి ఏటా మార్గశిర మాసం నెలరోజులు అమ్మవారి వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అమ్మవారిని దర్శిస్తారు. సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడి ప్రత్యేకత. మార్గశిర మాసంలో అన్నదానం చేసినవారికి మార్గశిర మాసంలో అన్నదానం చేసినవారికి అమ్మవారి దీవెనలు కలుగుతాయి అని ప్రగాఢ విశ్వాసం. ఈ మధ్యే మార్గశిర దీక్ష మరియు మండల దీక్ష అనే రెండు మాలధారణ వేడుకలు ప్రారంబించారు, ఈ దీక్షలో అమ్మరి దీవెనలు ఎక్కవ పొందవచ్చును అని నమ్మకం. ఉగాది పర్వదినం, ఆంధ్రుల కొత్త సంవత్సర ప్రారంభ దినం, ఆ రోజున అమ్మవారు వెండి ఆభరణాలతో అలంకరించబడి, దేదీప్యంగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రులుగా పిలుచుకునే, నవరాత్రి వేడుకల్లో 5వ రోజున అమ్మవారిని లక్ష కుంకుమార్చనతో అలంకరిస్తారు.🙏🌼🌿
🌿🌼🙏ఆశ్వీయిజ శుద్ద దశమి వరకు ఆశ్వీయిజ శుద్ద దశమి వరకు శరన్నవరాత్రి వేడుకల్లె భాగంగా వరుసగా లక్ష కుంకుమార్చన, లక్ష చామంతుల పూజ, లడ్డూల పూజ. క్షీరాభిషేకం. కులువల పూజ, లక్ష తులసి పూజ, లక్ష గాజుల పూజ, పుష్ప యాగం, శాకాంబరి, స్వర్ణాభరణ చీర అలంకరణలో పూజలు నిర్వరించడం జరుగుతోంది. ఆ తొమ్మిది రోజులు నిర్వర్తించే సహస్ర నామార్చన, శ్రీ చక్రనామావర్చన, లక్ష్మీ హోమంలో పాల్గొంటూ భక్తులు పుణీతులు అవుతుంటారు. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా అమ్మవారికి అష్టదళ సువర్ణ పద్మారాధన జరుపబడుతుంది. మాలధారణ సాంప్రదాయం కూడా ఉంది. ఆకుపచ్చని వస్త్రాలు ధరించి భక్తులు మాలధారణ చేపడతారు.🙏🌼🌿
🌿🌼🙏నిత్యపూజలు: ఉదయం పూజ:ఉ. 5 గం, మధ్యాహ్నం పూజ: ఉ 11.30 గం, ప్రదోష పూజ : సా. 6 గం. సర్వదర్శనం ఉ. 6 గం. నుండి వార్షిక ఉత్సవాలు : మార్గశిర మాసంలో నెలరోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో విశాఖపట్నం వాసులే కాకుండా, ఇరుగు, పొరుగు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సేవిస్తుంటారు. ఈ నెల రోజులు అమ్మవారి సన్నిధి నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా కనిపిస్తుంది. రథోత్సవం, వేదపండిత సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. చివరి గురువారం అన్న ప్రసాద వితరణను జరుపుతారు. మార్గశిరమాసం సందర్భంగా మీరూ ఆ కనకమహాలక్ష్మిని సందర్శించి తరించండి.🙏🌼🌿
🌿🌼🙏ఇలా చేరుకోవాలి: అమ్మవారి దేవస్థానానికి చేరుకోడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్‌ల నుంచి బస్సు సదుపాయం ఉంది. ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన చారిత్రాత్మక ప్రాంతం ఇది. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి పాత పోస్టాఫీసుకు వెళ్లే మార్గంలో ప్రతీ సిటీ బస్సు అమ్మవారి ఆలయం వద్ద నిలుస్తుంది. అలాగే విశాఖ ఎయిర్ పోర్టు నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయం ఉంది. అలాగే రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 5 నుండి 10 కిలోమీటర్ల దూరంలో కొలువైన అమ్మవారికి ఆలయం ప్రయాణం పరంగా అత్యంత సులభ తరంగా ఉంటుంది.🙏🌼🌿
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః
__________________________________________
HARI BABU.G
__________________________________________
#sri kanaka mahalakshmi devi #sri kanaka mahalakshmi devi #kanaka mahalakshmi ammavari sambaralu #vizag kanaka mahalakshmi ammagaru🙏🙏
#❤️లవ్ సాంగ్స్🎵 #💓ప్రేమ పాటలు💝 #🎧మ్యూజిక్ #✌️నేటి నా స్టేటస్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
#✌️నేటి నా స్టేటస్ #🎧మ్యూజిక్ #💓ప్రేమ పాటలు💝 #❤️లవ్ సాంగ్స్🎵
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి # 🙏తిరుమల శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి🙏 #🙏🌹తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి🌹🙏 #om namo venkatesa
🙏🌺మార్గశిర గురువారం వ్రతం🌺🙏
🌺మార్గశిర లక్ష్మీవారం పూజ అనేది మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించడం. సాధారణంగా శుక్రవారం రోజు లక్ష్మీపూజ చేయడం మనకు తెలిసిందే. అయితే మార్గశిర మాసంలో మాత్రం గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతారు. ఈ క్రమంలో మార్గశిర గురువారం వ్రతం. 🌺
🌺 శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మార్గశిర మాసం ఆయన సతీమణి మహాలక్ష్మీ దేవికి సైతం ఇష్టమైనదే! అయితే.. ఈ మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి నాలుగు లేదా ఐదు గురువారాల పాటు భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో పూజించిన వారికి ఆ లక్ష్మీదేవమ్మ కోరిన కోరికలు తీరుస్తుందని.. వరాల జల్లు కురుపిస్తుందని నమ్మకం. ఈ మార్గశిర మాసంలో ఆచరించే మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం వల్ల మిగిలిన పదకొండు మాసాల్లోనూ అష్టలక్ష్మీవైభవం కలుగుతుందట.. ఈ నేపథ్యంలో మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీ వార వ్రతం పూజ విధానం, చదవాల్సిన మంత్రాలు. 🌺
🌺మొదటి గురువారం - నవంబర్ 27
రెండో గురువారం - డిసెంబర్ 4
మూడో గురువారం - డిసెంబర్ 11
నాలుగో గురువారం - డిసెంబర్ 18
మొదటి గురువారం - పులగం నివేదించాలి
రెండో గురువారం - అట్లు, తిమ్మనం నివేదించాలి
మూడో గురువారం - అప్పాలు, పరమాన్నం నివేదించాలి
నాలుగో గురువారం - చిత్రాన్నం, గారెలు నివేదించాలి🌺
🌺మార్గశిర మాసంలో గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మం ముందు, తులసి కోట వద్ద, పూజ మందిరంలో ఆవు నెయ్యితో దీపాలను పెట్టాలి. ఇంటి తూర్పు భాగం లేదా ఈశాన్య భాగంలో ముగ్గు వేసి, పీట వేసి, వస్త్రము పరచి దానిపై కొత్త ధాన్యం పోయాలి. తర్వాత లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రపటం ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు చుట్టూ బియ్యపు పిండితో ముగ్గు వేసి.. పూలు పండ్లతో అలంకరించాలి. 🌺
🌺 అనంతరం మహాగణపతి పూజతో వ్రతం ప్రారంభించాలి. విఘ్నేశ్వరుడి పూజ అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిర్వహించాలి. 🌺
🌺హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం
అంటూ ప్రార్థన చేసి లక్ష్మీదేవి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, కర్పూర నీరాజనం సమర్పించాలి. 🌺
🌺ఇప్పుడు శక్తివంతమైన లక్ష్మీ దేవి మంత్రాలు చదవాలి. ముఖ్యంగా
*ఓం మహాదేవ్యే చ విద్మహే.. విష్ణు పత్నేచ ధీమహే.. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్*
*ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః||".*
అనే లక్ష్మీ గాయత్రీ మంత్రం చదువుతూ అమ్మవారికి మంత్ర పుష్పం సమర్పించాలి. ఆ తర్వాత సహస్ర దళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని భక్తితో చదువుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామావళి పఠించాలి. 🌺
🌺 *మార్గశిర మాసం వ్రత కథ*
ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి ప్రతిమను చేసి ఆరాధిస్తూ ఉండేది. బాలిక సవతి తల్లి ప్రతిరోజు తన బిడ్డను ఆడిస్తూ ఉండమని చెప్పేది. చిన్న బెల్లం ముక్కను కూడా ఇచ్చేది. బాలిక ప్రతిరోజు ఆమె ఇచ్చిన బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యంగా పెట్టేది. ఆమె పెళ్లి తరవాత లక్ష్మీదేవి బొమ్మను కూడా ఆమెతో తీసుకుపోయింది. అప్పటి నుంచి నిత్యదారిద్య్రం దాపురించింది. పుట్టింటివారు దారిద్య్రంతో బాధపడుతున్నారని ఆమె తన తమ్ముణ్ణి రప్పించి, ఒక వెదురుకర్రను దొలిపించి, అందులో బంగారు నాణెములు పోసి ఇచ్చింది.
మార్గమధ్యమున అతను కాలకృత్యములను తీర్చుకోవడానికి ఒకచోట ఆగి, చేతికర్రను ఒకచోట ఉంచగా.. దానిని ఓ బాటసారి తీసుకుపోయెను. చేతికర్ర లేకపోవడం చూసి నిరాశగా తమ్ముడు తన ఇంటికి వెళ్ళిపోయెను. కొన్నాళ్ళ తరువాత పుట్టింటివారి పరిస్థితిలో మార్పు లేదని గ్రహించి అక్క మళ్ళీ తమ్ముడిని రమ్మని, ఒక చెప్పుల జతలో బంగారు నాణెములు పోసి, దాన్ని వస్త్రంతో మూటకట్టి నాన్నగారికి ఇవ్వమని చెప్పింది. దారిలో దప్పిక తీర్చుకొనుటకు ఒక కొలను దగ్గర ఆగి, మూటను గట్టుపై పెట్టి నీళ్లు తాగుతుండగా మూటను ఎవరో దొంగలించారు. 🌺
🌺మళ్ళీ తమ్ముడిని రమ్మని ఒక గుమ్మడికాయను దొలిపించి అందులో రత్నాలు పోసి ఇచ్చింది. ఈసారి గుమ్మడికాయను ఒక బీద బ్రాహ్మణుడు తీసుకు వెళ్తాడు. తన దురదృష్టానికి తానే నిందించుకుంటూ నిరాశతో ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా కాలం తరువాత తల్లి మార్గశిరమాసంలో కూతురు ఇంటికి వెళ్లారు. ఆమె సవతి తల్లితో అమ్మా..! ఈ రోజు మార్గశిర లక్ష్మివారము. కనుక నోము నోచుకుందాము. నీవు ఎటువంటి ఆహారము తీసుకోకు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి తన మనవలు, మనవరాళ్ళకి చద్దన్నాలు పెడుతూ అనుకోకుండా ఒక ముద్ద తినేసింది. చేసేది ఏమీ లేక రెండవ లక్ష్మివారం జరుపుకుందామని చెప్పింది. 🌺
🌺రెండవ లక్ష్మివారం తల్లి పిల్లలకు తలంటుతూ, గిన్నె అడుగున మిగిలిన నూనె ఊడ్చి రాసేసుకుంది. ఇక మూడవవారం నోచుకుందువు అని సముదాయించింది. మూడవవారం తల్లి పొరపాట్లు చేయకుండా ఉండాలని.. ఆమెను ఒక గోతిలో కూర్చోబెట్టి, పైన బల్లలు మూతలాగా పెట్టింది. అటు వైపు వచ్చిన పిల్లలు అరటిపళ్ళు, కొబ్బరిముక్కలు తింటూ తినగా మిగిలిన తొక్కలు, ముక్కలు గోతిలో పడేసారు. ఆకలితో ఉన్న తల్లి వాటిని తినేసింది. 🌺
🌺నాలుగవ లక్ష్మివారం తల్లి కొంగును, తన కొంగుకి ముడివేసుకొని తనతో తిప్పుకుంటూ, ఇంటి పనులు పూర్తి చేసి పూజకు కూర్చుంది. విచిత్రంగా లక్ష్మీదేవి వెనుకకు తిరిగి పోయింది. ఇది చూసిన కూతురు ఆశ్చర్యపోయింది. చేసిన తప్పు ఏంటని అమ్మవారిని కూతురు అడిగింది. నీ సవతితల్లి ఒక మార్గశిర లక్ష్మివారం నాడు నీ శరీరంపై పేడనీళ్ళు జల్లి, చీపురుకట్టతో కొడుతూ నానా తిట్లు తిట్టింది. అందుకే నీ తల్లి పూజను నేను స్వీకరించలేను అని చెప్పారు.
దీనికి పరిష్కారం చెప్పమని కుమార్తె అడుగగా.. నీ తల్లిని నీకు ఆమె చేసినట్లే చేస్తే శాంతిస్తానని చెప్పారు. అమ్మవారు చెప్పినట్లు దండించెను. పుష్యమాసంలో మొదటి గురువారం తల్లి, కూతురు అమ్మవారిని పూజించారు. అప్పుడు అమ్మవారు కరుణించి ఇద్దరినీ కూడా ఐశ్వర్యవంతులను చేసారు. 🌺
🌺అలాగే మార్గశిర లక్ష్మీ వార వ్రత కథ చదువుకుని అక్షతలు శిరసున వేసుకోవాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి. ఇలా మార్గశిర మాసంలో అన్నీ గురువారాల్లో ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీ వార వ్రతం ఆచరిస్తారో ఆ స్త్రీ సకల సంపదలు, భోగభాగ్యాలు, ఇహలోకంలో సర్వ సుఖాలు పొంది, చివరిగా మోక్షం పొందుతుందని శాస్త్రవచనం. 🌺
🌺కాబట్టి మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ వార వ్రతం ఆచరిద్దాం..
లక్ష్మీ కటాక్షం పొందుదాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
___________________________________________
HARI BABU.G
__________________________________________
##మార్గశిర లక్ష్మీ పూజ #మార్గశిర గురువారం లక్ష్మీ పూజ #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #గురు పౌర్ణమి శుభాకాంక్షలు 1 #🙏🏻గురువారం భక్తి స్పెషల్
🙏🌺ప్రతి ఇంటిలో దక్షిణామూర్తి యొక్క పటము ఖచ్చితంగా ఉండాలి. 🌺🙏
🌺దక్షిణామూర్తి పటాన్ని ఉంచి ఏ ఇంటిలో పది నిమిషాలు రోజు ఆయనను చూస్తూ దక్షిణా మూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారో అటువంటి వారికి ఇంటిలో కష్టములు ఉండవు. దక్షిణామూర్తిని చూసేటటువంటి వారికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటటు వంటి వారికి తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి. వారికి రాబోవు కష్టములు తొలగించి వారిని దక్షిణామూర్తి రక్షిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. 🌺
🌺ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనమవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం) భగవంతునికి మాత్రమే ఉంది. ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖవిమోచనం. ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే దక్షిణామూర్తి. వసిష్ఠుడు కూడా తపస్సుతో దక్షిణామూర్తిని ప్రత్యక్షం చేసుకొని బ్రహ్మవిద్యను సంపాదించాడు. 🌺
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః🌺
_________________________________________
HARI BABU.G
___________________________________________
#🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🥰💝dakshinamurthy 🙏🙏❤️ #dakshinamurthy #గురు పౌర్ణమి శుభాకాంక్షలు 1








