ట్రైన్ జర్నీలో సామాన్యుడి పరిస్థితి ఇది..!
భారతీయ రైల్వే వందే భారత్ వంటి అత్యాధునిక రైళ్లను ప్రవేశపెడుతున్నప్పటికీ ముంబై లోకల్ రైళ్లలో, జనరల్ బోగీల్లో సామాన్యుడి కష్టాలు తీరడం లేదు. కాలు పెట్టే సందు లేక కిక్కిరిసిన బోగీల్లో ప్రయాణికులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఫుట్బార్డు ప్రయాణాల వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. సామాన్య ప్రయాణికుడి రక్షణ కోసం మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
అనంత్ అంబానీ రూ.13.7కోట్ల వాచ్ చూశారా?
బిలియనీర్ అనంత్ అంబానీకి లగ్జరీ వాచ్‌ల సేకరణ ఒక హాబీ. ఇప్పటికే ఆయన వద్ద పదుల సంఖ్యలో కోట్ల విలువైన వాచ్‌లు ఉండగా తాజాగా ఆ జాబితాలోకి రూ.13.7కోట్ల 'జాకబ్ అండ్ కో' వనతార వాచ్ చేరింది. గుజరాత్‌లోని ఆయన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం థీమ్‌తో రూపొందిన ఈ వాచ్ మధ్యలో అనంత్ బొమ్మతో పాటు సింహం, బెంగాల్ టైగర్ బొమ్మలు ఉన్నాయి. 21.98 క్యారెట్లు& 397 అరుదైన డైమండ్స్ ఈ వాచ్ మెరిసిపోతోంది. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
మొక్కలు ఎలా గాలి తీసుకుంటాయో చూశారా?
మొక్కలు గాలి తీసుకునే విధానాన్ని రికార్డు చేశారు యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బనా-చాంపైన్కు చెందిన రీసెర్చర్లు. స్టొమాటా ఇన్ సైట్ అనే పరికరాన్ని ఉపయోగించి ఆకులపై ఉన్న చిన్నపాటి రంధ్రాల ద్వారా కార్బన్లైఆక్సైడ్ తీసుకుని ఆక్సీజన్, ఆవిరిని ఎలా విడుదల చేస్తుందనే విషయాన్ని గుర్తించారు. చిన్న సైజ్ ఛాంబర్లో మొక్క ఆకులను ఉంచి టెంపరేచర్, హ్యుమిడిటీ, వెలుతురు, CO2, నీటిని అందించి పరీక్షించారు. #🆕Current అప్డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
#🆕Current అప్డేట్స్📢 VIRAL: బడికి వెళ్లనంటూ పిల్లాడి మారాం.. ఇలా మీరూ చేసేవాళ్లా?
సెలవుల తర్వాత స్కూల్‌కు వెళ్లమంటే పిల్లలు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఒక బాలుడు బడికి వెళ్లనని రోడ్డుపై పడుకుని దొర్లుతూ మారాం చేసిన వీడియో వైరల్ గా మారింది. పిల్లాడు కర్రను పట్టుకొని ఎంత మొండికేసినా ఆ తల్లి మాత్రం తగ్గలేదు. చివరకు అతడిని కర్రతో కొడుతూ భుజంపై వేసుకుని బడికి తీసుకెళ్లింది. 'మా చిన్నప్పుడు మేము కూడా ఇలాగే చేసేవాళ్లం' అంటూ నెటిజన్లు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. #🆕షేర్‌చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
నీచంగా తిడుతున్నారు.. ప్లీజ్ వద్దు: రేణు దేశాయ్
కుక్కల కోసం ప్రెస్మెట్ పెడితే కొందరు తనను బూతులు తిడుతున్నారని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మీడియాపై ఆగ్రహించినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఓ వ్యక్తి తనను తిడుతూ కొట్టబోయాడని, అందుకే సీరియస్ అయినట్లు చెప్పారు. 'నీ తిక్క చూసే పవన్ కళ్యాణ్ వదిలేశాడు. నీ పిల్లల్ని కుక్క కరవాలి' అంటూ కామెంట్స్ చేస్తున్నారని, అలా చేయొద్దని కోరారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని స్పష్టం చేశారు. #🆕షేర్‌చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
క్లాస్‌మేట్‌కు క్యాన్సర్.. గుండు చేయించుకున్న విద్యార్థినులు!
క్యాన్సర్ చికిత్సలో జుట్టు కోల్పోయిన ఓ చిన్నారి స్కూల్‌కు రావడానికి భయపడితే.. తోటి విద్యార్థులు టీచర్లు చేసిన పనికి ప్రపంచమే సలాం చేస్తోంది. 'నువ్వు ఒంటరివి కాదు.. నీ పోరాటానికి తోడుగా మేమున్నాం' అని చెప్పడానికి వారంతా గుండు చేయించుకున్నారు. వీరు చేసిన ఈ పని కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలవాలనే గొప్ప సందేశాన్నిస్తోందని నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రేమకు, ఐక్యతకు ఇది అద్దం పడుతోంది. #🆕షేర్‌చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
మేడం.. నా బిడ్డను కొట్టకండి, తనకి అమ్మ లేదు. ఏడిస్తే ఓదార్చేవారు ఉండరు' అంటూ ఓ తండ్రి టీచర్‌ను వేడుకుంటున్న వీడియో నెట్టింట వైరలవుతోంది. క్లాస్ రూమ్ కూతుర్ని హత్తుకొని ఆయన వ్యక్తపరిచిన ఆవేదన తండ్రి ప్రేమకు నిలువుటద్దంలా నిలిచింది. అమ్మలేని లోటు తెలియకుండా పెంచాలనే ఆ తండ్రి తపన నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. పిల్లలపై తండ్రికి ఉండే ప్రేమ ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్‌చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
10వేల మందితో 'బాగురుంబా నృత్యం'
ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో బోడో తెగ కళాకారులు తమ సంప్రదాయ బాగురుంబా నృత్యంతో ఆయనను ఆశ్చర్యపరిచారు. గువాహటి స్టేడియంలో ఏకంగా 10 వేలమంది కళాకారులు ఒకేసారి ఈ నృత్యం చేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బాగురుంబా నృత్య ప్రదర్శన కావడం విశేషం. బోడో తెగ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ప్రధాని తెలిపారు. ఆ దృశ్యాలను ఆయన SMలో పంచుకున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్‌చాట్ అప్డేట్స్
మస్కట్‌కు చేరిన మన చెక్క ఓడకు ఘనస్వాగతం
ఇండియన్ నేవీ రూపొందించిన INSV కౌండిన్య చెక్క ఓడకు ఒమన్ తీరంలో ఘనస్వాగతం లభించింది.
ఆగ్నేయాసియా సముద్రాన్ని దాటిన నావికుడు కౌండిన్య పేరిట రూపొందించారు. మేకులు, మెటల్ లేకుండా చెక్కబల్లలు, కొబ్బరి తాడు, సహజ రెసిన్తో రూపొందించారు. 5వ శతాబ్దపు ఓడ డిజైన్‌తో భారత శిల్పకళాకృతులను జోడించారు. పోర్బందర్ నుంచి బయలుదేరిన ఈ ఓడ భారత్‌ను ఇతర ప్రపంచంతో కలిపిన రూట్లో ప్రయాణించి 17 రోజుల అనంతరం మస్కట్‌కు చేరింది. #🆕షేర్‌చాట్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
Video: CMని చిప్స్ అడిగిన చిన్నారి
UP CM యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించిన ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా గా మారింది. గోరఖ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఓ చిన్నారిని “ఏం కావాలి?" అని స్నేహపూర్వకంగా అడిగారు. చిన్నారి చెవికి దగ్గరకి వచ్చి “చిప్స్" అని చెప్పడంతో యోగి ఆదిత్యనాథ్ పాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఆ బాలుడు చెప్పిన క్యూట్ ఆన్సర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్‌చాట్ అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు



