VIDEO: కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చాడు
UPలోని బిజ్నోర్ ఓ వ్యక్తికి పాము కాటేయడంతో దానిని పట్టుకొని ఆస్పత్రికి వచ్చి అందరినీ భయాందోళనకు గురిచేశాడు. రోడ్డు పక్కనున్న కాలువలో ఉన్న పామును గౌరవ్ బయటకు తీయాలని ప్రయత్నించారు. పాము కాటేయడంతో వెంటనే దాన్ని పట్టుకుని కిలోమీటర్ దూరంలో ఉన్న ఆస్పత్రికి వచ్చాడు. ఆ పాము విషపూరితమో లేదో తెలియకపోవడంతో.. దానిని చూపించి చికిత్స చేయాలని డాక్టర్లను కోరాడు. వెంటనే చికిత్స చేసి గౌరవ్‌ను కాపాడారు. #💬నవంబర్ 18th ముఖ్యాంశాలు🗞️ #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
వ్యక్తి సంకల్పం: గ్రామాన్ని ఆదర్శంగా మార్చింది!
MH సతారా జిల్లాకు చెందిన గజానన్ అనే వ్యక్తి కృషి, సంకల్పం ఓ గ్రామాన్ని ఆదర్శంగా మార్చింది. ఐదేళ్ల పాటు శ్రమించి, గ్రామస్తులను ఒప్పించి గ్రామాన్ని పూర్తిగా మార్చేశారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ పాటు పడుతున్నారు. డిజిటల్ లైబ్రరీ, నీటి సదుపాయం, సోలార్ లైట్స్, ఉపాధి కల్పన, వృద్ధులంతా ఓ చోటకు చేరి మాట్లాడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు వంటివి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #💬నవంబర్ 18th ముఖ్యాంశాలు🗞️ #🗞️నవంబర్ 17th ముఖ్యాంశాలు💬 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
ఐదేళ్ల కిందటి కవర్ సాంగ్ వైరల్.. పాట పాడిన కొత్త ఎమ్మెల్యే
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ MLAగా సింగర్ మైథిలీ ఠాకూర్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదేళ్ల కిందటి ఆమె కవర్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సంతోషం వ్యక్తం చేసిన మైథిలి తన గొంతు సరిగ్గా లేకున్నా ఆ పాటను మళ్లీ పాడారు. ఆ వీడియోను SMలో షేర్ చేశారు. మరోవైపు తన నియోజకవర్గంలో పనులు ప్రారంభించేందుకు సిద్ధమని, హామీలను నెరవేర్చడంపై దృష్టిపెట్టానని ఆమె తెలిపారు. #🗞️నవంబర్ 17th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
బద్దలైన అగ్నిపర్వతం.. 4.4KM ఎత్తుకు బూడి
జపాన్‌లోని సకురాజిమా అగ్నిపర్వతం ఇవాళ ఒక్కసారిగా బద్దలైంది. పలుమార్లు భారీ పేలుళ్లు సంభవించడంతో బూడిద ఆకాశంలో 4.4KM ఎత్తుకు వెళ్లింది. గత 13 నెలల్లో ఇంత ఎత్తుకు బూడిద చేరడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్తగా కగోషిమా ఎయిర్‌పోర్టులో 30 విమానాలను రద్దు చేశారు. కాగా జపాన్‌లో అత్యంత యాక్టివ్‌గా ఉండే అగ్నిపర్వతాల్లో సకురాజిమా ఒకటి.
2019లో అత్యధికంగా 5.5KM ఎత్తుకు బూడిద ఎగిసింది. #🗞️నవంబర్ 17th ముఖ్యాంశాలు💬 #📰ప్లాష్ అప్డేట్స్ #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
స్పెషల్ అట్రాక్షన్‌గా సితార
'వారణాసి' ఈవెంట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూతురు సితార స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తండ్రి ఎంట్రీ సీన్‌ను ఎంజాయ్ చేస్తూ ఆయనను పట్టుకుని గెంతులేశారు. ఇప్పటికే యాడ్స్‌లో పాల్గొంటున్న ఆమె.. త్వరలోనే సినిమాల్లో నటించే అవకాశం ఉందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. తండ్రి నుంచి అందం, తల్లి నుంచి కాన్ఫిడెన్స్, ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్‌ను సితార వారసత్వంగా పొందారని కొనియాడుతున్నారు. #🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🗞️నవంబర్ 17th ముఖ్యాంశాలు💬
#🗞️నవంబర్ 16th ముఖ్యాంశాలు💬 రేంజ్ రోవర్ ఫీట్‌ను అనుకరించేందుకు యత్ని
SUVతో జాంగ్జియాజీలోని టియాన్మెన్ పర్వతం వద్ద
చైనీస్ కార్ల కంపెనీ 'చెరీ' తన సరికొత్త ఫెంగ్యూన్ X3L 'హెవెన్ స్టేర్వే'(999 మెట్లు)ను ఎక్కేందుకు యత్నించి విఫలమైంది. గతంలో రేంజ్ రోవర్ కారు చేసిన ఫీట్‌ను అనుకరించేందుకు ప్రయత్నించగా ఫెంగ్యూన్ కారు సగం దూరం వెళ్లాక వెనక్కి వచ్చేసింది. ఈ ప్రమాదంలో కారు అడ్డంగా తిరిగి రక్షణ గోడను ధ్వంసం చేసింది. దీనికి సంస్థ క్షమాపణలు చెప్పింది #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱
బీహార్ ఎన్నికల్లో గాయని మైథిలి ఠాకూర్ విజయం (వీడియో)
బిహార్ శాసనసభ ఎన్నికల్లో 25 ఏళ్ల జానపద గాయని మైథిలీ ఠాకూర్ భారతీయ జనతా పార్టీ తరఫున అలీనగర్ శాసనసభ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసి సుమారు 12వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 84,915 ఓట్లు రాగా, 11,730 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన అతి చిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు. గతంలో బిహార్ ఎన్నికల కమిషన్ తరఫున 'స్టేట్ ఐకానిక్'గా, రాష్ట్ర సాంస్కృతిక అంబాసిడర్‌గానూ గుర్తింప #🗞️నవంబర్ 15th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
ప్రతిపక్షంలో కాంగ్రెస్ కూడా గెలవలేదు: KTR
కొత్త ఉత్సాహాన్నిచ్చింది ప్రస్తుత ప్రభుత్వానికి మేమే
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRSకి గౌరవప్రదమైన ఓట్లు వచ్చాయని KTR అన్నారు. 'ఈ ఎన్నిక మాకు ప్రత్యామ్నాయమని ఓటర్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా ఉపఎన్నికల్లో గెలవలేదు. కానీ తర్వాత అధికారంలోకి వచ్చింది. మేమూ అలాగే వస్తాం' అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన విషయాలే తాము మాట్లాడామని, ఇతరుల్లా బూతులు మాట్లాడలేదన్నారు. #🗞️నవంబర్ 14th ముఖ్యాంశాలు💬 #🗞️నవంబర్ 15th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్
రష్మిక ఎమోషనల్(VIDEO)
'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ సక్సెస్ మీట్లో హీరోయిన్ రష్మిక ఎమోషనల్ అయ్యారు. మూవీలోని సాంగ్ లైవ్ పెర్ఫార్మ్ చేస్తున్న సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకున్నారు. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమాలోని పాటలకు రాకేందు మౌళి లిరిక్స్ రాశారు. హేషమ్ అబ్దుల్ మ్యూజిక్ అందించారు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🗞️నవంబర్ 13th ముఖ్యాంశాలు💬 #🗞️నవంబర్ 12th ముఖ్యాంశాలు💬
ప్యాంట్ జిప్ విప్పి అసభ్యప్రవర్తన.. తరిమికొట్టిన శానిటరీ వర్కర్
చెన్నైలో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడికి శానిటరీ వర్కర్ (50) బుద్ధి చెప్పింది. నిన్న ఉదయం ఓ బైకర్ ఆమె ముందు బైక్ ఆపి ప్యాంట్ జిప్ తీశాడు. ప్రైవేట్ పార్ట్‌ను చూపించే ప్రయత్నం చేయడంతో ఆ వర్కర్ షాక్ అయింది. వెంటనే తేరుకుని చీపురుతో చితకబాదింది. దీంతో ఆ కామాంధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 'పిల్లాడు అనుకున్నా. కాలేజీ స్టూడెంట్ కావొచ్చు. నా ముందే జిప్ ఓపెన్ చేశాడు. షాక్ అయ్యాను' అని ఆమె తెలిపింది. #🗞️నవంబర్ 12th ముఖ్యాంశాలు💬 #📰ఈరోజు అప్డేట్స్ #📰ప్లాష్ అప్డేట్స్ #👉నేరాలు - ఘోరాలు🚨



