
Seetha Usha Rani
@seethausha
ఎలా అయినా బతుకు మావ.. మంచిగా మాత్రం బతకాలి అనుకోకు
ఈ విషయం పూర్తిగా బాలు గారి వ్యక్తిగతం అయినప్పటికీ..
విడిపోవాలి అనుకున్న వాళ్లకు..
కలిసి ఉండాలి అని కోరుకున్న వాళ్ళంటే నచ్చేది కాదు..
అందుకే ఆయన విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారు..
ఆంధ్రావాళ్ళు అంటే తెలంగాణ వాళ్లకు మంట కాదు.. తెలంగాణ వ్యతిరేకులు ఎప్పటికీ ఇక్కడి వాళ్ళకు నచ్చరు.. #viral
#🤩నా ఫేవరెట్ హీరో🤩 #🎬మూవీ ముచ్చట్లు #🎬సినిమా రివ్యూ #🎬నా ఫేవరెట్ మూవీ🤩
పరువు హత్యల నేపథ్యంలో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.
అలాంటిదే రాజు Weds రాంబాయి కూడా..
సీన్స్, డైలాగ్స్ అన్నీ మనకు నచ్చకపోయినా క్లైమాక్స్ తో హిట్ కొట్టేశారు రాజు, రాంబాయి..
తెలంగాణ స్లాంగ్ లో అందరూ సరిగా సెట్ అవ్వలేదు కానీ గ్రామీణ వాతావరణాన్ని మాత్రం బాగా చూపించారు.
హీరో, హీరోయిన్ లు చాలా నేచురల్ గా చేసారు.
90's కిడ్స్ ఈ లవ్ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారు.
ఆ కాలంలోకి తీసుకెళ్లే కొన్ని సీన్స్ కి థియేటర్ లో విజిల్స్ పడుతున్నాయ్..
హీరో WWE లో ఓ డైలాగ్ చెప్తుంటాడు సిట్యూషన్ తో సంబంధం లేకుండా అదైతే చిరాగ్గా ఉంటది.
క్లైమాక్స్ కి మాత్రం బూ..తులు వస్తాయి Father క్యారెక్టర్ మీద కోపంతో..
అది నిజంగా జరిగింది అని చెప్తుంటే.. అన్నీ మర్చిపోయి.. అప్పటి ఆ ప్రేమికులపై జాలేస్తుంది..
ఒక్క క్లైమాక్స్ తో చాలా మిస్టేక్స్ కొట్టుకుపోయాయి హిట్ టాక్ నడుస్తుంది కానీ డైలాగ్స్, సీన్స్ కొంచెం ఫ్రెష్ గా ఉండుంటే బ్లాక్ బస్టర్ అయ్యేది.
ఫైనల్ గా..
రాజు వెడ్స్ రాంబాయి మన టీనేజ్ లోకి తీసుకెళ్లి.. కాస్త ఎమోషనల్ అయ్యేలా చేసారు..
#RajuWedsRambai #usharaniseetha #seethausharani #RajuWedsRambaiOnNov21st Venu Udugula
#👨🦱అంతర్జాతీయ పురుషుల దినోత్సవం👨🏽🤝👨🏼
స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే..
అయినా ఎవరి గొప్పదనాలు,
ఎవరి ప్రత్యేకతలు వాళ్లకున్నాయ్..
ఈరోజు మీరోజు..
ఇప్పుడైనా కొన్ని మాట్లాడాలి..
మాకు బలంగా ఉంటూ..
మీ బాధ్యతలు నెరవేస్తున్నందుకు థ్యాంక్యూ..
కుటుంబానికి రక్షకుడిగా ఉంటూనే..
సంపాదిస్తూనే.. సహనంగా ఉంటున్నందుకు థ్యాంక్యూ..
మీరు ఎన్నో త్యాగాలు చేస్తూ..
మాకు ప్రేమ పంచి, ధైర్యాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్యూ..
రాత్రి పగలు కష్టపడి..
కుటుంబానికి గౌరవాన్ని తీసుకొస్తున్న లెజెండ్స్ కి..🙏
మీరు ఎప్పుడూ అలా నవ్వకండి..
మీరు మాల మాములు మనుషులే అప్పుడప్పుడు కన్నీటి చుక్కలు కార్చండి..
మీరు ఒంటరి కాదు..
మీకోసం మేమున్నాం..
మీ బాధ్యతలు, త్యాగాలు, పోరాటాలు చూసి గర్వపడుతున్నాం,
కష్టాల్లో మేము మీకు అండగా ఉంటాం..🤝
నా లైఫ్ లో హీరోల్లా ఉన్న..
మా ఆయనకు, తమ్ముళ్లకు, ఫ్రెండ్స్ కి..👇❤️
#mensday #usharaniseetha #seethausharani #HappyMensDay
#🏏భారత మహిళలు తొలిసారి ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించారు🔥
హమ్మయ్యా..
మొత్తానికి గెలిచేశారు..🎉 🎊
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో అదరగొట్టి.. విశ్వవిజేతలయ్యారు❤️
సూపర్ ఫామ్ లో ఉన్న ప్రతీక గాయం నుంచి తప్పుకోవడంతో టీమ్ లోకి వచ్చిన షెఫాలీ.. బ్యాటింగ్(87), బౌలింగ్ (2) లో అదరగొట్టింది👏
దీప్తి శర్మ (58) రన్స్, ఐదు వికెట్స్ తో మ్యాచ్ ను మన వైపు తిప్పింది👏👌
సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్డ్ (101) ఒంటరి పోరాటం చేసింది..
క్రీజులో తను ఉన్నంతసేపు మన బౌలర్స్/మ్యాచ్ చూసే వాళ్ళకి చెమటలు పట్టాయి.
తను ఔట్ అవ్వగానే విన్నింగ్ కన్ఫర్మ్ అయిపోయింది.😃
#🏏2వ T20 లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విజయం
మిథాలీ రాజ్..❤️
ఎన్ని సెలబ్రేషన్స్ పిక్స్ చూసినా నాకు హై ఇచ్చే పిక్ ఇది..
ఈరోజు మహిళ క్రికెట్ కి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం..
ఒకప్పుడు తను వేసిన బాటే.. 👣
ప్రభుత్వం నుంచి, స్పాన్సర్స్ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేని రోజుల్లో నుంచి..
ఈరోజు స్టేడియాలు నిండి,
రాత్రుళ్లు మేల్కొని మరీ మ్యాచ్ లు చూసే రోజులకు వచ్చింది భారత మహిళా క్రికెట్..💪
నిన్న వరల్డ్ కప్ అందుకున్న చాలామంది అమ్మాయిలు..
మిథాలీని స్ఫూర్తిగా తీసుకొని క్రికెట్ లో అడుగు పెట్టిన వాళ్ళే..🤩
నువ్విచ్చిన స్పూర్తే ఈ కప్ అని.. 🏆
గౌరవంగా తన చేతిలో వరల్డ్ కప్ పెట్టిన సందర్భం ఇది..😍
#cricket #🇮🇳టీమ్ ఇండియా😍 #usharaniseetha #CWC25 #MithaliRaj #cricketlovers
#🏏2వ T20 : ఆస్ట్రేలియా vs ఇండియా
Home Ground లో సెమీస్ కూడా వెళ్తారో లేదో అనుకుంటే ఏకంగా ఫైనల్ కే వెళ్ళారు.
కష్టంగా సెమీస్ కి వచ్చి..
ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే పోయినట్టే అని అంతా అనుకున్నారు.
* అందులోనూ 339 టార్గెట్,
* అంతకు ముందు సూపర్ ఫామ్ లో ఉన్న ప్రతీక లేదు,
* లేడీ స్వెహ్వాగ్ షెఫాలీ, మందన్న త్వరగా ఔట్ అయ్యారు,
* కెప్టెన్ కౌర్ అస్సలు ఫామ్ లోనే లేదు..
* నెంబర్ వన్ టీమ్ బౌలింగ్, ఫీల్డింగ్ గురించి తెలిసిందే..
ఇలాంటి సమయంలో..
👉 ఇండియా గెలవాలి అన్న ఆశ తప్పా, గెలుస్తుంది అన్న నమ్మకం లేదు..!
అప్పుడు వచ్చారమ్మా..
కెప్టెన్ కౌర్, జమీమా రోడ్రిక్స్..
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఔరా అనిపించారు👌
* ఏడుసార్లు వరల్డ్ ఛాంపియన్స్ ను ఓడించి సగర్వంగా ఫైనల్ లో అడుగుపెట్టారు.
* మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో భారీ లక్ష్యాన్ని పూర్తి చేసిన జట్టుగా రికార్డు సృష్టించారు.
రోడ్రిక్స్ సూపర్ సెంచరీ (127),
కౌర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (89) మర్చిపోలేము..
వాళ్ళు గెలిచి.. ఏడుస్తూ.. ఏడ్పించేశారు..
మిగిలిన ఒక్కటి సౌతాఫ్రికా తో సండే ఉన్నప్పటికీ..
నా వరకైతే.. ఇప్పటికే వరల్డ్ కప్ గెలిచేసాం అనే ప్రౌడ్ ఫీలింగ్❤️
#cricket #usharaniseetha #seethausharani #cricketlovers #jemimahrodrigues #CWC25
#🗞️అక్టోబర్ 30th అప్‌డేట్స్💬
మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ త్వరలో ఇండస్ట్రీలో అడుగు పెట్టనుంది..
ఒకప్పుడు జాన్వీ Mother మంజుల Industry లోకి రావాలి అనుకున్న కుదరలేదు..
#JanviSwaroop అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి.
ఇంతకు ముందు "మనసుకు నచ్చింది" మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది జాన్వీ.
#🤩నా ఫేవరెట్ హీరో🤩










