Part 2
* ఇదే సమయంలో చైనా మిషనరీ హడ్సన్ టేలర్ గారు మరణించారు.ఇది విన్న ఎమీని దేవుడు మిషనరీగా పిలుస్తున్నట్లు గ్రహించి,జపాన్ కు మిషనరీగా వెళ్లింది.
* అక్కడ వారిలాగే వస్త్రధారణ మరియు ఆహారపు అలవాట్లు నేర్చుకుంది.కొన్ని రోజుల తరువాత ఆమె అనారోగ్యం కారణంగా ఇంటికి తిరిగి వచ్చింది.
* మరలా దేవుని దర్శనంతో భారత దేశంలోనే తమిళ్ నాడు లోని దోహ్నాపూర్ కు మిషనరీగా వచ్చింది.
* అక్కడ ఒక మిషన్ ను స్థాపించి చుట్టూ ప్రక్కల దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించింది.అయితే ఒకరోజు పెరినా అని ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ ఎమీ ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి వివరాలు ఏవి ఎమీకి తెలియదు.
* అయితే ఆ అమ్మాయి దగ్గరలోనే గుడిలో దేవతకు దేవదాసిగా అర్పించబడింది.అప్పటికాలంలో ఆడపిల్లలు శకునం అని అక్కడి గుడిలో దేవదాసిగా దేవతకు అర్పించేవారు.
* తరువాత వీరిని వేశ్యలుగా వాడుకునేవారు.బలవంతపు వ్యభిచారం మరియు నగ్నంగా డ్యాన్స్ లు వేయిస్తు ఆనాటి క్రూరమైన కామాంధులు బ్రాహ్మణులు పైశాచిక ఆనందాన్ని పొందేవారు.
* ఇటువంటి స్థితిలో నున్న పెరినాను ఎమీ చేర్చుకోవడం ద్వారా ఆమెపై కిడ్నాపర్ గా కేసు వేశారు.ముందుముందుకు వీరిని కాపాడటంలో ఎమీ చాలా నిందలు, అవమానాలు వ్యతిరేకతలు అనుభవించింది.
* ఆలయాలలో వదిలివేసి వెళ్లిన చిన్న చిన్న ఆడపిల్లలను కాపాడటానికి వేషం వేసుకొని,రంగు మార్చుకొని గుళ్ళలోనికి వెళ్లి దొంగతనంగా పిల్లలను తెచ్చుకుని వారిని రక్షించేది.అందుకే ఎమీకి "పిల్లలను ఎత్తుకెళ్లే అమ్మ"అనే పేరు వచ్చింది.
* ఇలా పిల్లలను అనేకులను రక్షిస్తూ పోషిస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ తీవ్రంగా శ్రమపడింది.
* ఎమీ ఎంతగా దేవుని కొరకు సమర్పించుకోందంటే చాలా తెల్లగా ఉండే తన శరీరానికి భారతీయుల వలె ముదురు గోధుమ రంగును పుసుకునేది.ఇక్కడి వారీలాగే వస్త్రధారణ మరియు ఆహారపు అలవాట్లు నేర్చుకుంది.ఎందుకంటే ఎమీ ఆత్మల రక్షణ కొరకు తన జీవితంలో ఏది ప్రియంగా ఎంచుకోలేదు. తనకు ఎంతో అనారోగ్యం ఉన్న దేవుని సేవ చేసింది.
* ఇలా అనేకమంది ఆడపిల్లలకు విద్య,చేతి వృత్తి పనులు నేర్పిస్తూ ఇంకా నెలలు నిండని పిల్లలను చూసుకుంటు ఎన్నో గొప్ప పనులు చేసింది.
* ఎమీ తన అవసరాలను దేవునితో తప్ప ఎన్నడూ ఇతరులతో చెప్పుకునేది కాదు.
* ఆమె చివరి క్షణంలో ప్రభుత్వం వారు ఆమె సేవలను గూర్చి అభినందిస్తూ సత్కరించడానికి ఆహ్వానిస్తే ఎమీ వెళ్లకుండా తనతో ఉన్న ఒక స్త్రీని ఆమె పంపించింది.ఎమీకి తాను ప్రజల మెప్పును పొందడానికి ఏ మాత్రమూ మనస్సు లేదు.
* ఇలా దాదాపు 55 సంవత్సరాలు అలుపెరుగని సేవ చేసి కొన్ని వేలమంది బాలికలను రక్షించి,అనేకమంది ప్రజలను రక్షణలో నడిపించి మన దేశంలోనే 1951 జనవరి18 న తన ప్రాణాలను విడిచింది.
దేవుడు ఎమీ కార్మైకెల్ ను వాడుకున్నట్లు తన రాజ్య వ్యాప్తిలో నిన్ను కుడా వాడుకోవాలని అనుకుంటున్నాడు.కానీ ఎమీ లాగా నీ జీవితమంతటినీ క్రీస్తు బలిపీఠం మీద సమర్పిస్తావా..?
#wordofgod#jesuslovesyou#praisegod#amen🙌