జై శ్రీకృష్ణ భగవద్గీత శ్లోకములు🙏
4K Posts • 19M views
#శ్రీ కృష్ణ #జై శ్రీకృష్ణ భగవద్గీత శ్లోకములు🙏 #భగవద్గీత శ్రీకృష్ణ లీలలు #భగవద్గీత #ఓం నమశ్శివాయ 🙏 హరే కృష్ణ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏శ్రీ గోమాతాయై నమః🙏 విష్ణు సహస్రనామం ఎలా జనించింది? శ్రీకృష్ణ పరమాత్ముడు భీష్ముని సకల శాస్త్రాలలో పారంగతుడిగా, మహా ధర్మజ్ఞుడిగా భావించాడు. లోకంలో ధర్మాన్ని ప్రామాణికంగా వివరించగల వ్యక్తి భీష్ముడొక్కడేనని శ్రీకృష్ణుడు గుర్తించాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధం అనంతరం, పాండవులతో సహా శ్రీకృష్ణుడు స్వయంగా భీష్ముని శరణు చేరాడు. అయన చివరి ఉపదేశాలను పరమాత్ముడే సాక్షీభూతమై వినేలా చేశాడు. శరశయ్యపై ఉన్న భీష్ముడు పాండవులకు రాజధర్మం, ఆపద్ధర్మం, మోక్షధర్మం వంటి అనేక ధర్మ విషయాలను బోధించాడు. అదే సందర్భంలో లోకానికి శ్రేయస్సును ప్రసాదించే విష్ణు సహస్రనామాలను కూడా ఉపదేశించాడు. మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన అనంతరం భీష్ముడు విష్ణుమూర్తిని సహస్రనామాలతో స్తుతించి, విశ్వరూప దర్శనాన్ని పొంది తన ఇచ్ఛానుసారంగా తనువు చాలించాడు. భీష్ముడు విష్ణు సహస్రనామాలను ప్రకటించిన ఈ పవిత్ర దినాన్ని “జయ ఏకాదశి” మరియు “విష్ణు సహస్రనామ జయంతి” అని పెద్దలు పేర్కొంటారు. ఈ రోజున భక్తిశ్రద్ధలతో విష్ణు సహస్రనామ జపం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని, జన్మాంతం వరకు హరి సాన్నిధ్యం లభిస్తుందని భీష్ముడు ఉవాచగా చెప్పబడింది.             🌹🌹🌹🌹
13 likes
10 shares