🌿🌼🙏సంకష్టహర చతుర్ధి🙏🌼🌿
7 Posts • 127 views
Rochish Sharma Nandamuru
1K views 6 months ago
నేడు సోమవారం 28-07-2025 దూర్వాగణపతి వ్రతం : "శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే" విఘ్నేశ్వర పూజకు మొట్ట మొదటగా చదువ వలసిన ఈ శ్లోకమును చదివి ప్రార్దించినచో సర్వ విఘ్నములు తొలిగి శుభములు కలుగును. విద్యార్దులకు విద్య అధికమగును. మోక్షార్దులకు మోక్షము, ధనము కోరిన వారు ధనము పొందెదరు. పిదప షోడశోపచార పూజను చేయవలెను. షోడశోపచారములనగా ఆవాహన, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం, ప్రదక్షిణములు మొదలగునవి దుర్వా పత్రములతో ఈ పూజ చేయవలెను. శ్రీ మహాగణపతి భక్తుల కోర్కెలన్నీ తీర్చును. దూర్వాగణపతి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించినవారికి సకల సుఖసౌఖ్యాలు, శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం... #🌅శుభోదయం #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🕉️ గణపతి బప్పా మోరియా #🌿🌼🙏సంకష్టహర చతుర్ధి🙏🌼🌿
28 likes
16 shares
Rochish Sharma Nandamuru
21K views 6 months ago
🌿🌼🙏సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు🙏🌼🌿 గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి , రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని , పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్ట హర చతుర్థి *మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా , చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి 🌿🌼సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం🌼🌿 సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి , తరువాత గణపతిని పూజించాలి.అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానినిపసుపు , కుంకుమలతో అలంకరణను చేయాలి.మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండుఖర్జూరాలు , రెండు వక్కలు , దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.సంకటనాశన గణేశ స్తోత్రం , సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కానిచేయిన్చుకోనవచ్చును. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు.సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి 🌺🌺🌺🌹ఓం గం గణపతయే నమః🌷🌺🌺🌺 #🌅శుభోదయం #🌻సోమవారం స్పెషల్ విషెస్ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🌿🌼🙏సంకష్టహర చతుర్ధి🙏🌼🌿 #🙏శ్రీ వరసిద్ధి వినాయక స్వామి🕉️
248 likes
230 shares