#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం
వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం
🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
*సంకటహరవ్రతం*
*సెప్టెంబర్ 10 బుధవారం సంకష్ట హర చతుర్థీ సందర్భంగా...*
సంకటము' అంటే ఇబ్బంది, బాధ, కష్టము, ఆపద మొదలైన అర్థాలను చెప్పుకోవచ్చు. వీటన్నింటినీ తొలగించేదే "సంకటహరవ్రతం". గణపతిని ఆలంబనగా చేసుకుని ఆచరించే ఈ వ్రతానికి 'సంకష్టహర చతుర్థి' అనికూడా పేరు. దీన్నే వ్యవహారములో సంకట చవితి (సంకటహరచవితి) అని కూడా అంటారు.
గణపతి విఘ్నాలను కలిగించే దేవుడని, ప్రతీ పనిలోనూ ముందుగా ఆయనను పూజిస్తే మాత్రం విఘ్నాలను కలిగించడనే భావన కొందరిలో ఉంది. కానీ ఆ భావన సరికాదు. వాస్తవానికి చెడుపనులకు విఘ్నాలను కలిగించి, మంచిపనులు నిరాటంకంగా సాగింపజేసే దైవమే గణపతి. కాగా ఈ సంకటహరవ్రతాన్ని ఆచరించడం వలన ఇబ్బందులు తొలగి అనుకున్న పనులు నెరవేరుతాయి.
సంకటహరవ్రతాన్ని ప్రతీ నెలలో కూడా ఆచరించవచ్చు. నెలలో బహుళములో వచ్చే చవితి రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. అంటే పౌర్ణమి తరువాత 3-4 రోజులలో ఈ సంకటహర చవితి వస్తుందన్నమాట.
ఇక ప్రదోషకాలములో అంటే సూర్యాస్తమయ సమయములో ఏ రోజున చవితి ఉంటుందో. ఆ రోజుననే సంకటహర చవితిని ఆచరించాలి. సాధారణంగా రెండు రోజులలో సూర్యాస్తమయ సమయానికి చవితి ఉండటం జరుగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగినప్పుడు రెండవరోజునే సంకటహరచవితిని జరుపుకోవాలి. ఇటీవలకాలములో పంచాంగాలలోనూ, పలుక్యాలెండర్లలోనూ. ఈ వ్రత తేదీలు తెలియజేయబడుతున్నాయి. అవకాశాన్ని బట్టి 3,5,9,11,21 నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
సంకటహర వ్రతాన్ని నెలలో బహుళచవితిరోజున ప్రారంభించాలి. వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకొని, ఆ తరువాత తలంటుస్నానాన్ని చేయాలి. తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఇంటిలోని దేవునిగదిలోనో లేదా అనుకూలమైన చోట పీటవేసి, దానిపై ముగ్గును వేయాలి. పీటపై గణపతి విగ్రహాన్ని కాని, చిత్రపటాన్ని కాని నెలకొల్పుకోవాలి. తరువాత ఒక చిన్నపళ్ళెములో బియ్యాన్ని పోయాలి. అనంతరం పసుపుముద్దతో మహాగణపతిని చేసుకొని ఒక తమలపాకుపై ఆ పసుపు ముద్దగణపతిని ఉంచాలి. తరువాత ఆ తమలపాకు కొన తూర్పు వైపునకు లేదా ఉత్తరం వైపుగా ఉండేటట్లుగా పళ్ళెంలో బియ్యముపై ఉంచి నిర్విఘ్నంగా వ్రతం పూర్తయ్యేందుకు, మహాగణపతిపూజను చేయాలి.
ఆ తరువాత ఎరుపు లేదా తెల్లని వస్త్రాన్ని (జాకెట్పసును) తీసుకొని దానికి నాలుగు వైపుల పసుపును పూయాలి. అనంతరం వస్త్రాన్ని స్వామిముందు వరచి, అనుకున్న కోరికను నెరవేర్చమని ప్రార్థించాలి.
అటు తరువాత స్వామిని తలచుకుంటూ మూడు దోసిళ్ళ బియ్యాన్ని వస్త్రంపై వేయాలి. అదేవిధంగా రెండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ ఉంచిన తాంబూలాన్ని బియ్యంలో ఉంచాలి. తిరిగి మరొక్కసారి మనసులో కోరికను నెరవేర్చమని స్వామిని వేడుకుంటూ, దాన్ని మూటగా కట్టాలి.
అనంతరం యధావిధిగా గణపతిని పూజించాలి. పూజలో గణపతికి ఇష్టమైన గరికను సమర్పించడం మంచిది. తరువాత అవకాశం మేరకు ఏదైనా దగ్గరలో ఉండే గణపతి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించి, 3,5,11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. ఆలయానికి నెళ్లడానికి అవకాశం లేనప్పుడు ఇంట్లోనే గణపతి స్తోత్రాలను పఠించవచ్చు. సూర్యాస్తమయం తరువాత తిరిగి స్నానం చేసి గణపతి ముందు దీపారాధనను చేసి, లఘువుగా స్వామిని పూజించాలి. అనుకున్న సమయం పూర్తయ్యేంతవరకు పూజలో ఉంచిన గణపతిని కదల్చకూడదు.
వ్రతం చేసిన రోజున సూర్యాస్తమయం అయ్యేంతవరకు (సాయంకాలపూజ. పూర్తయ్యేంత వరకు) ఉప్పు కలిపిన పదార్థాల్ని, ఉడికిన పదార్థాలను తినకూడదు. పాలు, పండ్లు లాంటివి తీసుకోవచ్చు. సాయంకాలం పూజ పూర్తయిన తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్రదర్శనం చేసి, చంద్రునికి కూడా ధూప, దీప నివేదనను అర్పించి మామూలు భోజనాన్ని చేయవచ్చు. ఈ విధంగా అనుకున్నన్ని నెలలు (3,5,11 లేదా 21 చవితులు) వ్రతాన్ని ఆచరించాలి. నియమం పూర్తయిన తరువాత ముడుపు కట్టిన బియ్యాన్ని తీపిగా పొంగలి చేసి గణపతికి నివేదించి, వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ వ్రతం వలస అనుకున్న పనులు తప్పకుండా నెరవేరుతాయని ప్రతీతి.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*