ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
589 Posts • 47K views
PSV APPARAO
892 views 7 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #గణేశారాధన/గణపతి ఆరాధన 🙏 #🕉️గణపతి ఆరాధన ఈ రోజు సంకటహర చతుర్థి గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి , రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని , పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకష్ట హర చతుర్థి *మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి* అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా , చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి. *☘సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం☘* సంకటహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి.ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి , తరువాత గణపతిని పూజించాలి.అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానినిపసుపు , కుంకుమలతో అలంకరణను చేయాలి.మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండుఖర్జూరాలు , రెండు వక్కలు , దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.సంకటనాశన గణేశ స్తోత్రం , సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.శక్త్యానుసారము గరిక పూజను కాని , గణపతి హోమమును కానిచేయిన్చుకోనవచ్చును.సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు.సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. https://whatsapp.com/channel/0029Va4YUC6DeONFF8EDwQ2V
14 likes
7 shares
PSV APPARAO
1K views 27 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మాస శివరాత్రి ... విశిష్టత పరమశివునికి ఇష్టమైన రోజు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #శుభ కార్తీక మాసం - ఈ మాసంలో జరుపుకొనే పూజలు- నోములు - పండుగ లు #ఇదే మాస శివరాత్రి విశిష్టత! *మాస శివరాత్రి* *ఈరోజు "మాస శివరాత్రి" ...* ప్రతి నెల అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశి తిధిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి. *మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి ?* మహాశివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు , అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. *చంద్రోమా మనస్సో జాతః* అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూపడము వలన జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడమో , చంచల స్వభావులుగా మారడమో , మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపములో ఉన్న ప్రజల యొక్క మనస్సు , ఆరోగ్యం , ధనం , ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అందుకే మనం గమనించవచ్చు .., అమావాస్య తిధి ముందు ఘడియాలలో కొందరి అనారోగ్యం మందగించండం లేదా తిరగబెట్టడం , ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణము ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉన్నది. *మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి ?* ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 5 , 11 , 18 , 21 , 56 , 108 ఇలా ప్రదక్షణములు చేయవచ్చు. అలాగే ఈ రోజు శివాలయములో పూజలో ఉంచిన చెరకు రసమును భక్తులకు పంచినచో వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆరోజు ప్రదోష వేల శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. ఇవేమీ చేయడానికి అవకాశము లేని వారు , ఆరోగ్యవంతులు , అలాగే గృహములో అశుచి దోషము లేని వారు ఈ రోజు ఉపవాసము ఉండి , మూడు పూటలా చల్లటి నీటితో వీలు అయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి. *మాస శివరాత్రిని జరుపుకోవడము వలన ఉపయోగములు ?* ప్రత్యేకించి ఈ రోజు ను సశాస్త్రీయంగా జరుపుకోవడము వలన మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలు నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు , అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా , పెంకిగా , బద్దకంగా , మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి దేవాలమునకు వెళ్ళే అలవాటును చేయించగల్గితే వారిలో కాలక్రమము లో ఖచ్చితముగా మార్పు వస్తుందని భావించవచ్చు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కావున మనం అందరం కూడా ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని సశాస్త్రీయంగా జరుపుకోవడము ద్వారా శుభములను పొందవచ్చు. #namashivaya777
12 likes
24 shares