PSV APPARAO
771 views • 3 days ago
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #🕉️శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు🙏 #🕉️శ్రీవారి బ్రహ్మోత్సవాలు🚩🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
*బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం*
ఓ బ్రహ్మా! నాకు ఉత్సవాన్ని జరిపించమని స్వామి కోరగా బ్రహ్మ ఆయన ఆజ్ఞను అనుసరించి స్వయంగా ఉత్సవాన్ని జరిపించాడు. కన్యారాశిలో సూర్యుడు ప్రవేశించిన అనంతరం చిత్తా నక్షత్రంలో 'ధ్వజారోహణం', ఉత్తరాషాఢ నక్షత్రం నాడు 'రథోత్సవం', శ్రవణం నాడు 'చక్రస్నానం', ఇలా బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించి జరిపిన ఉత్సవం అయినందున దీనిని "బ్రహ్మోత్సవం” అని అంటారు. పరబ్రహ్మకు చేసిన ఉత్సవం కూడా అయినందున దీనిని 'బ్రహ్మోత్సవం' అని అంటారు.
_ధ్వజారోహణం_
అంకురారోపణ జరిగిన తర్వాత రోజు ఉదయం జరిగే ఉత్సవం 'ధ్వజారోహణ' ఉత్సవం. అనగా గరుడ ధ్వజాన్ని పైకెగరేస్తారు. ఈ ధ్వజారోహణకు ముందు ముద్గా న్నం అనగా పెసరపప్పుతో చేసిన పులగాన్ని (పొంగలి) గరుడునికి నివేదన చేస్తారు. ధ్వజంపై నిలిచిన గరుడుడు శ్రీవారి బ్రహ్మోత్సవానికి రావాల్సిందిగా భక్తులందరినీ ఆహ్వానిస్తాడు. ఈ గరుడుడే సకల దోషాలను, పాపాలను అపవిత్రతను తన దృష్టితో ఎనిమిది యోజనాల దూరం అనగా 96 కిలోమీటర్ల దూరం వరకు తొలగిస్తాడు.
_పెద్దశేష వాహనం_
ధ్వజారోహణం జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామిని పెద్ద శేష వాహనంపై నాలుగు మాడ వీధులలో అంగరంగ వైభవంగా సకల పరిజన పరి చందంగా తాళ, నృత్య, వాద్య, సంగీత, గానసంరంభంతో, వేదపండితుల వేదఘోష లతో, దివ్య ప్రబంధ అధ్యాపకుల ప్రబందాధ్యాయముతో పాటు భక్తుల కోలాహలం మధ్యన స్వామి ఊరేగుతారు.
పెద్దశేష వాహనం అనగా ఆదిశేషుడే. ఆదిశేషుడనగా ఆది- మొదటి, శేషుడు-సేవకుడు అనగా మొదటి సేవకుడు అని అర్థం. శ్రీమన్నారాయణునికి నిరంతరం వెంట ఉండి అతనికి కావాల్సిన అన్ని సేవలు అన్నీ తానే అయ్యి చేస్తాడు ఆదిశేషుడు. స్వామి నివసించడానికి తానే ఇల్లుగా, పడుకోవడానికి శయ్యగా, కూర్చోవడానికి సింహాసనంగా, నడవడానికి పాదుకలుగా, తలకింద తలగడగా, చలివేస్తే దుప్పటిగా, వర్షం, ఎండ వస్తే గొడుగుగా ఇలా స్వామికి ఎప్పుడు ఏ సేవ కావాలన్నా తానే ఆ పరికరంగా మారి సేవ చేస్తాడు కావున 'ఆదిశేషుడు' అని పిలువబడతాడు. అందుకే మొదటి వాహన భాగ్యం ఆదిశేషుడికే స్వామి కల్పించాడు. ఈ విధంగా సేవలు చేయ డమే కాకుండా స్వామి ఏ రూపంలో ఉన్నా తాను కూడా అతనికి తగిన రూపంలో ఉంటూ వెంట అవతరిస్తాడు.
ఆదిశేషుడు తన వేయి శిరములలో ఒక శిరములోని ఒక చిన్న భాగంలో అఖి లాండ కోటి బ్రహ్మాండములను సిద్ధార్థ (ఆవగింజ) రూపంలో ధరిస్తాడు. ఇంత బ్రహ్మాండాన్ని ఒక ఆవగింజలా ధరించే మహాబలుడు ఆదిశేషుడు. అతనికి కాస్త తల భారంగా అనిపించినపుడు అనగా భూమిపై నివసించే ప్రాణులు సహించరాని పాపా లను చేసినప్పుడు పాపాల భారం మోయలేనని కొంచెం తల కదలిస్తాడు. ఏప్రాంతంలో ఆదిశేషుని తల కదిలితే ఆ ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. ఈ విధంగా ఆది శేషుడు మొదట సకల జగత్తుకు ఆధారం. శ్రీమన్నారాయణుడు రాముడిగా అవత రించినప్పుడు ఆదిశేషుడు లక్ష్మణస్వామిగా వచ్చాడు. తమ్ముడిగా సేవ చేసిన ఫలితంగా కృష్ణావతారంలో అన్నగా అవతరించమని ఆదేశిస్తే కృష్ణునికి అన్నగా బలరామునిగా అవతరించాడు. కలియుగంలో వ్యాకరణ శాస్త్రం తెలియక అంటే మాట్లాడలేక ఇబ్బం దిపడుతున్న జనుల కోసం పాణిని మహర్షి రచించిన 'అష్టాధ్యాయి' సూత్రాలకు వ్యాఖ్యానం చేయడానికి 'పతంజలి'గా అవతరించి మహాభాష్యం రాసి వాక్ శుద్ధిని చేశాడు. ఈ పతంజలే యోగ భాష్యం రాసి మనఃశుద్ధిని, వైద్యశాస్త్రంలో భాష్యం రాసి శరీర శుద్ధిని చేశారు. తరువాత చాలా కాలానికి భగవద్రామానుజులుగా అవతరించి బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేసి 'శ్రీభాష్యం' అను పేరుతో అందించారు. ఇంతటి దివ్యమైన సేవ చేసిన మహానుభావుడు అయినందున మలయప్ప స్వామి మొదటి వాహన సేవా భాగ్యాన్ని ఆదిశేషునికి ఇచ్చారు.
_చిన్న శేష వాహనం_
ధ్వజారోహణం తెల్లవారి ఉదయం మలయప్ప స్వామి చిన్న శేష వాహనం పై నాలుగు మాడ వీధులలో విహరిస్తారు. చిన్న శేషుడు అనగా శేషుని తమ్ముడు వాసుకి. ఈ వాసుకి శ్రీమన్నారాయణుని ఆజ్ఞతో క్షీరసాగర మధన సమయంలో మందర పర్వ తానికి కవ్వపు తాడుగా మారి సముద్రాన్ని చిలకడానికి సహాయం చేశాడు. స్వామి ఆజ్ఞతో తన పడగల నుండి అనగా ముఖముల నుండి విషజ్వాలలు చిమ్ముతూ రాక్షసు లను మూర్ఛాక్రాంతులను చేశాడు. తన విషాన్ని సముద్రంలో ఉద్గారం(వాంతి) చేసి సముద్రంలో హాలాహలం పుట్టడానికి తన వంతు సేవ చేసి ఆ హాలహలాన్ని పానం చేసి లోకాలను రక్షించే అవకాశాన్ని శంకరునికి ఇచ్చి దానికి కృతజ్ఞతగా శంకరుని చేతికి కంకణమైనాడు. తన చెల్లెలైనా 'జగత్కారు' ని 'జగత్కారు' అనే మహర్షికి ఇచ్చి వివాహం చేసి బ్రహ్మ ఆజ్ఞను పాటించి ఆ దంపతుల సంతానమైన ఆస్తికునితో జనమేజయుడు ఆచరించిన సర్పయాగాన్ని నివారించి అఖిల నాగులకు జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు 'వాసుకి', అందుకే మలయప్ప స్వామి వాసుకికి రెండవ సేవా భాగ్యాన్ని ప్రసాదించాడు.
_హంసవాహనం_
చిన్న శేషవాహన సేవ జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామి హంస వాహ నం పై విహరిస్తారు. శ్వేత వర్ణంతో పాలని, నీటిని వేరు చేయగల ఏకైక పక్షి 'హంస' కావున దీనిని జ్ఞానానికి ప్రతీకగా వ్యవహరిస్తారు. అంటే మంచిచెడులేవో తెలిపి దేనిని ఆచరించాలో తెలియజేసే దానిని జ్ఞానం అంటారు. జ్ఞానాన్ని స్వీకరించి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పాలను స్వీకరించి నీటిని విడిచిపెట్టాలి. జ్ఞానాన్ని ప్రభోదించే సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులను పరమహంసలు అంటారు.
ఒకసారి బ్రహ్మలోకంలో ఋషులందరూ ఎవరు కనబడినా మీరెవరు? అని అడుగుతారని ఇచ్చట మీరు అన్నదానికి అర్థం ఏమిటని బ్రహ్మను ప్రశ్నించారు. శరీరాన్ని ఉద్దేశించా లేక ఆత్మనా. ఒకవేళ శరీరమే అయితే ఏ రూపమో ప్రత్యక్షంగా కనబడుతోంది కదా. ఆత్మ స్వరూపం ఒక్కటే కావున ఆత్మను ఎవరని అడగడం కుదరదు అయినందున మీరెవరు అనే ప్రశ్న తప్పు కదా అని బుషులు బ్రహ్మను ప్రశ్నించారు. సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక బ్రహ్మ శ్రీమన్నారాయణునిస్మరిం చగా వారికి తత్త్వాన్ని తెలుపడానికి స్వామి ఒక హంస రూపంలో వారి ముందుకు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన హంసను చూసిన ఋషులు మీరెవరని అడుగగా హంస గా కనబడుతున్నాను కదా లోపల ఉన్న ఆత్మ మీలో ఉన్నదాని వంటిదే కదా మరి మీరె వరు అని మీరే ఎలా అడిగారు అని హంసరూపంలో ఉన్న స్వామి తిరిగి ప్రశ్నించారు. ఇదంతా చూసిన ఋషులు వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనుకొని సాష్టాం గ దండ ప్రణామం చేసి చేతులు జోడించి స్వామీ! మా సందేహాన్ని తొలగించండని ప్రార్థించారు. నేను మనిషిని, నేను పశువును, నేను రాక్షసుడిని అని చెబితే అవన్నీ శరీరాలు, నేను అంటే శరీరం కాదు కదా. శరీరమే ఆత్మ అనుకున్న వారే నేను మనిషిని అంటారు. కాని ఆత్మజ్ఞానం ఉన్నవారు భగవంతుడు ఆత్మగా ఉన్నా, జీవాత్మ ఆత్మగా ఉన్నా మానవ శరీరాన్ని అని చెప్పాలి, వీరే ఆత్మజ్ఞానులు, మీరెవరు అన్న ప్రశ్నకు ఆత్మ జ్ఞానం ఉన్న వారా లేనివారా అని అర్థం. ఇలా ఆత్మ, అనాత్మ వివేకాన్ని క్షీరనీర న్యాయంతో తొలగించిన అవతారం హంసా వతారం. అందుకే మనలోని అహంకారాన్ని తొలగించి ఆత్మ వివే కాన్ని కలిగించాలనే అనుగ్రహ బుద్ధితో స్వామి హంసను తన వాహనంగా చేసుకొని ఆత్మను శరీరం మోయటం లేదు. ఆత్మే శరీరాన్ని మోస్తుందని తెలియ జేస్తున్నాడు. పరమాత్మ జీవాత్మకు ఆధారం. అదే విధంగా జీవాత్మ శరీరానికి ఆధారం, ఈ ఆత్మను తాను స్వయంగా మోసుకొని తన లోకానికి చేర్చేవాడు పరమాత్మ అన్న ధర్మ సూక్ష్మాన్ని బోధించడమే హంస వాహనంలోని ఆంతర్య మని స్వామి స్వయంగా హంస వాహనం పై విహరిస్తూ బోధిస్తాడు.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
22 likes
9 shares