Peerlu
12 Posts • 64K views
MANA VOICE
973 views 6 months ago
మీకు మీకుటుంబ సభ్యులకు ---------- పీర్ల పండుగ శుభాకాంక్షలు (మొహర్రం) ...... #HappyMoharram2025 #Moharram2025 #peerlapanduga #manavoiceWishes #manavoice #moharam #moharam status 786 #moharam #happy moharam #Peerlu
7 likes
19 shares
MANA VOICE
1K views 6 months ago
పీర్ల పండుగ: హస్త రూపంలో ఉన్న విగ్రహానికి దట్టీలు కట్టి ఎత్తుకొని ఊరేగుతూ... అలాయి ఆడుతూ... మాలిద్ధ ముద్దలు చేసి... పానీయం, కందూరు అంటూ యాటలు(గొర్రె/మేక) బలి ఇస్తూ... 10రోజులు తెలంగాణలోని ప్రతి పల్లె కులాలకు అతీతంగా... మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పెద్ద పండుగ ఇది. ఇది శోకానికి సంబంధించిన ముస్లింల పండుగ అయినా.. దీన్ని హిందువులు, ముస్లింలు అత్యంత వైభవంగా... ఆనందంగా జరుగుపుకుంటారు. • ఈ ప్రాంతాల్లో జరుపుకునే పండుగకు ఇంచుమించు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ° పీర్ల పండుగను తెలంగాణలోని పాత మహబూబ్ నగర్ లోని... పాలమూరు(వికారాబాద్ లోని కొన్ని ప్రాంతాలు కూడా), నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి, షాద్ నగర్, నారాయణపేట, వంటి ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు. కోయిలకొండ లోని భీమ్ ఫాతిమా పీరుకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. ° హైదరాబాద్లోని 400ఏళ్ల చరిత్ర ఉన్న బాదేషాహీ అశుర్ఖానలో జరిగే పీర్ల పండుగ దేశంలోనే పేరొందింది. ° సూర్యాపేటలో వళ్లభాపురం-ఉండ్రుగొండ పీర్ల పండుగ, అదిలాబాద్ లోని రుయ్యాడి పీరులు చాలా ఫేమస్ ° ఆంధ్రలోని అనంతపూర్ లో ఉన్న ఓ కుంటలో వెలసిన గూగుడు కుళ్లాయి పీరు అత్యంత ఘనంగా జరుపుతారు. ......... #peerlapanduga #Moharram2025 #muharramFestival #ManavoiceSpecialStory #TelanganaFestival #moharam #moharam status 786 #moharam #happy moharam #Peerlu
14 likes
14 shares