🕉️om namo viswakarma 🙏
961 Posts • 1M views
🌹viswakarma🌹
616 views 9 days ago
#🕉️om namo viswakarma 🙏 #✌️నేటి నా స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #👋విషెస్ స్టేటస్ విరాట్ విశ్వకర్మ దర్శనము - సంకృతి - 1 విశ్వకర్మ ఎవరు? పరమాత్మ , ప్రజాపతి విశ్వకర్మయేనా? స్థావర జంగమాది సకలచరాచర జగత్తును సృష్టించినవాడు ,రుద్ర, విష్ణువు మొదలైన సకల దేవతాకోటిని , గంధర్వ, యక్షుల కిన్నెర,కింపురుష , మానవ జంతు పశు పక్షి ఆది క్రిమి కీటకాలను సృష్టించిన పరమాత్ముడు సృష్టికర్త విశ్వకర్మ. తదుపరి విషయానికి వెళ్దాం. విశ్వకర్మ పరాత్పరుడు సర్వదేవతా స్వరూపుడు. పరమేష్ఠి యన్నను, ప్రజాపతి యనిననూ విరాట్ విశ్వకర్మయే. సృష్టి ఆదిలో శూన్య స్థితిలో ఉన్నప్పుడు పరమాత్మ విశ్వకర్మ తేజోవంతమైన కోటి సూర్యుల కాంతితో వెలుగులు వెదజల్లుతూ బిందు రూపంలో ఉంటాడు. ఒకానొక సందర్భంలో అయన అంతరంగంలో బహుళమవ్వాలి అనే కోరిక కలుగుతుంది. నిరాకారుడైన విశ్వకర్మ బిందు రూప స్థితి నుండే ఆయన లోపల నుండి ఇచ్చా అనే స్త్రీ శక్తి అదే ప్రకృతి శక్తి బయటకు వస్తుంది.. ఎలా అంటే సంస్కృత వాఙ్మయంలో కోరికకు ఇచ్చా అనే శబ్దాన్ని ఉపయోగిస్తారు. ఈ శబ్దాన్ని స్త్రీ లింగము గా పోలుస్తారు. అంటే పరమాత్మ అయిన విశ్వకర్మ అంతరంగము నుండే ప్రకృతి అనబడే స్త్రీ శక్తి కూడా బయటకు వచ్చింది అని మనకు తెలియుచున్నది. పురుషుడు విశ్వకర్మ స్త్రీ శక్తి అయిన ప్రకృతి కలిసి సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మొట్టమొదట విశ్వకర్మ జలాన్ని సృష్టించారు. - (విశ్వకర్మ సూక్తము) క్రింద ఉదాహరించిన మంత్రము ఆధారంగా - మొట్టమొదటగా పంచభూతములను సృష్టించి అదే పంచభూతములను ఉపయోగించుకుని సృష్టిని ప్రారంభించినట్లు మనకు తెలుస్తుంది. పంచభూతముల లో మొట్టమొదటగా జలమును తరువాత వాయువును తర్వాత పృథ్విని వరాహ రూపం ధరించి జలము లోపల నుంచి పైకి తీసుకు వచ్చి, నిరాకార విశ్వకర్మ సాకారుడై ప్రజాపతి త్వష్ట విశ్వకర్మ గా రూపము దాల్చి భూమిపై ఉండే నీటిని తన చేతుల తో తుడిచి కాసేపు విశ్రమించి సృష్టి యజ్ఞము ఆచరించెను అని తెలియుచున్నది. ఇదే విషయాన్ని వేదమంత్రములు ఆధారంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్దాం. వసు రుద్ర ఆదిత్యులు సహిత సకలచరాచర జగత్తును సృజించినది విశ్వకర్మపరమేశ్వరుడే యని వేదము. యో దేవానాం నామధా ఏక ఏవ (10/82/3) దేవతలను సృజించి వారికి నామకరణము జేసి, వారు నిర్వర్తింపవలసిన కార్యములను అప్పగించినది విశ్వకర్మపరాత్పరుడే. 'య ఇమా విశ్వ భువనాని' (10/81/1) యను మంత్రభాష్యమునందు 'తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్' అను ఉపనిషత్ వాక్యము నుదహరించి విశ్వకర్మ సమస్తమును సృజించెనని, ఆ సృజించిన సమస్తమునందు విశ్వకర్మపరమేశ్వరుడు అంతః ప్రవేశించెనని ఆచార్యసాయణులవారి భాష్యము. కనుక ఆ తండ్రి లేని ప్రదేశమే లేదన్నది నిర్వివాదాంశము. ఇక ప్రస్తావిత మంత్రాన్ని పరిశీలిద్దాం. “ఆపో వా ఇదమగ్రే సలిలమాసీత్తస్మిన్ ప్రజాపతిర్వాయుర్భూత్వా అచరత్. స ఇమామ్ అపశ్యత్, తాం వరాహో భూత్వా ఆహరత్. తాం విశ్వకర్మ భూత్వా వ్యమార్ట్ సాఽప్రథత సా పృథివ్యభవత్తత్పృథివ్యై పృథివిత్వం తస్యామశ్రామ్యత్ ప్రజాపతిః. స దేవానసృజత వసూన్ రుద్రాన్ ఆదిత్యాన్, తే దేవాః ప్రజాపతిమ్ అబ్రువన్ ప్రజాయామహా ఇతి సోఽబ్రవీత్౹౹ (1) యథాఽహం యుష్మాగ్మ్ంస్థపప్తాఽసృక్ష్యేవం తపసి ప్రజాననమిచ్ఛధ్వమితి తేభ్యోఽగ్నిమాయాతనం ప్రాయచ్ఛదేతేనాఽఽయతనేన శ్రామ్యతేతి తేఽగ్నినాఽఽయతనేనాశ్రామ్యన్తే....... || (2) (అథ కృష్ణయజుర్వేదం - 7 కాండే 1 ప్రపాటకే, 5అనువాకాః) ఇదే విదంగా ఇందులో 18 మంత్రములు కలవు. తాత్పర్యము : - మనం చూసే విశ్వము (అనగా జగత్తు భూమి అని నానార్థములు )మొత్తం జలమయమై ఉండేది. మరియు మనం నిలబడి ఉన్న భూమి సలిలముతో కప్పబడి ఉంటుంది.. "ఇందుకు పూర్వం జలమును సృష్టించినది విశ్వకర్మయే అని ఋగ్వేదం -10 వ మండలము 82 సూక్తము 1 వమంత్రము తెలుపుతున్నది." ఋగ్వేదం యజుర్వేదము కంటే పురాతనమైనది. భూమి నీటితో కప్పబడి మరియు నివాసయోగ్యం కాని కారణంగా, విశ్వకర్మ వాయురూపము ధరించి నలుమూలల శోధించెను.ఆవిధంగా ప్రయాణిస్తున్నప్పుడు అతను నీటిలో భూమిని కనుగొన్నాడు. విశ్వకర్మ భగవంతుడు శ్వేత వరాహ రూపము ధరించి తన కోరలతో ఈ భూమిని పైకి తీసుకుని వచ్చెను. విశ్వకర్మ అప్పుడు త్వష్టవిశ్వకర్మప్రజాపతిగా సాకార రూపాన్ని ధరించాడు మరియు భూమి పైనుండే నీటిని తుడిచివేసి, భూమిని విస్తరించాడు, (పృథ్వీ = విస్తారము అనే అర్థం కూడా ఉంది) ఆ భూమికి అప్పుడు పృథ్వీ అని పేరు పెట్టారు. అది ఇప్పుడు మనం నిలబడి ఉన్న నేల. * అద్భ్యస్సంభూతః పృథివ్యై రసాశ్చ విశ్వకర్మణః సమవర్తతాధి, తస్య త్వష్టా విదధద్రూపమేతి..... అని పురుషసూక్తముయొక్క ఋక్కుననుసరించి జలతత్త్వమునుండి పృథ్వీ తత్త్వానికి తీసుకువచ్చినది పరమాత్మ పురుషుడైన విశ్వకర్మ అనే సత్యము ఋజువు అవుతుంది. విశ్వకర్మ ప్రజాపతి కొంతకాలం విశ్రమించెను.తరువాత భూమిపై ఎనిమిది మంది వసువులలు, ఏకాదశ రుద్రులు మరియు ద్వాదశ ఆదిత్యులను వీరందరికీ పరపాలకుడు ఇంద్రుడు ఆయనపై ప్రజాపతిని సృష్టించారు, విశేషవివరములు : - అష్ట వసువులు. 1. ఆప 2. ధ్రువ 3.సోముడు 4. అథర్వుడు 5. అనిలుడు 6. ప్రత్యూషుడు 7. అనలుడు 8. ప్రభాసుడు. ఏకాదశ రుద్రులు: - 1. ఆజను 2. ఏకపాదుడు. 3. అహిర్బుద్ధ్నుడు 4. త్వష్టృ 5. రుద్ర 6. హర 7. శంభుడు 8. త్ర్యంబకుడు 9. అపరాజితుడు 10. ఈశానుడు 11. త్రిభువనుడు. "రుధ్ రోదన రోదయతి ఇతి రుద్రః, రోదయాతి అసురాన్ రుద్రాః రుదిర్ = అస్రు విమోచన రుజం దుఃఖం ద్రావయన్తి ఇతి రుద్రాః రుతం వేదాత్మకం కల్పదౌ రువంతి ఇతి. " రుద్రుడు దుఃఖమును ఇచ్చేవాడు - ద్వాదశ ఆదిత్యలు: - 1. ఇంద్రుడు 2. ధాత 3. పర్జన్యుడు 4. త్వష్ట 5. పూష 6. ఆర్యముడు 7. భగుడు 8. విశ్వంత 9. అంశుమంత 10. వరుణ 11. మిత్ర 12. విష్ణు ఈ దేవతలందరినీ విశ్వకర్మయే సృష్టించెనని వేదం స్పష్టం చేసింది. సాధారణంగా సనాతనహిందూధర్మంలో దేవతల సంఖ్య అత్యధికంగా ఉందని చెప్పేరూఢీ ఉంది. ఎంతమంది అంటే 33 కోట్ల మంది . 33 కోట్ల మంది దేవతలు ఎవరు? ఈ ప్రశ్నను ఎవరైనా చెప్పేందుకు సాధ్యమవుతుందా? కానీ వేదం స్పష్టంగా ఇక్కడ 33 కోట్ల దేవతల పేర్లను చెప్పింది. పై ఉదాహరించిన సారాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మనకు 33 కోట్లు దేవతల పేర్లు లభిస్తాయి. సృష్టికర్త విశ్వకర్మ అష్ట వసువులును ఏకాదశ రుద్రులను , ద్వాదశఆదిత్యుల సృష్టించాడు మరియు వారందరికీ ఒక రాజు ఇంద్రుడు, సర్వోన్నత పరమాత్మ విశ్వకర్మకు ఇంద్రుడుకు మధ్య ప్రజాపతి విశ్వకర్మ చేత సృష్టించబడ్డారు ఇప్పుడు లెక్క చూడండి అష్టవసువులు = 8 ఏకాదశ రుద్రులు. = 11 ద్వాదశఆదిత్యులు. = 12 ఇంద్రుడు. = 1 ప్రజాపతి. =__ 1__ మొత్తం దేవతలు. = 33 కోట్లు వేద మంత్రంలో వేదపరిభాషలో కోటి అంటే ఒక వర్గం లేక జాతి అని అర్థము. ఉదాహరణకు, దేవతా కోటి, గంధర్వ కోటి మనుష్య కోటి అనే పదాలు దేవతా వర్గం గంధర్వ వర్గం,మనుష్య వర్గం అని చెప్పవచ్చు. ఇప్పుడు మీకు 33 కోట్ల మంది దేవతల పేర్లు తెలుసుకున్నారు కదా. విశ్వకర్మ భగవంతుడు వారందరినీ సృష్టించాడు మనకు వేదం తెలుపుతున్నది. విశ్వకర్మ పరాత్పరుడే జగత్సర్జనార్థమై మొదట ప్రజాపతి గాను, తరువాత వాయురూపమును తానే ధరించి తానే వరాహరుపమును ధరించెను. ఇంతేకాక పురుష , హిరణ్యగర్భ , త్వష్ట , బ్రహ్మణస్పతి ఇత్యాది రూపములను ధరించెను. తాను సృజించిన దేవదానవాది సకలచరాచరములకు రూపములను నామములు వారు చేయవలసిన కార్యములను నిర్ధారించుటయే కాక వారందరి యందు అంతరాత్మగా ప్రవేశించెను." తత్సృష్ట్వ తదేవానుప్రావిశత్" కొంతమంది అజ్ఞానజనిత అహంకారం గలవ్యక్తులు వేదం లో ఏముందో తెలియక తెలుసుకొనే ప్రయత్నం చేయక పురాణములను మాత్రమే అధ్యయనం చేసిన పురాణపండితులు విశ్వకర్మ పరమాత్మను ఆర్కిటెక్చర్ అని దేవతలకు సేవలు చేసే శిల్పి అని టీవీల్లో చెప్పుకుని గరికగడ్డి లాంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ముందుగా వైదికదేవతలు అంటే ఎవరో తెలుసుకుందాం. సనాతన హిందూ ధర్మానికి వేదాలు ఆధారం అని అందరికీ తెలుసు. వేదాలలో జ్జానము , విజ్ఞానము రెండు కూడా సమరూపంగా చెప్పబడ్డాయి. "వేదాలు పౌరషేయాలా? అపౌరుషేయాలా? ఈ సందేహం చాలా మందికి ఉంది. ఈప్రశ్న అయోమయంలో పడేస్తుంది దీని గురించి తెలుసుకుందాం. వేదాలు మన పూర్వపు ఋషులు తపస్సు చేసినప్పుడు ఆ తపోఫలంగా పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకుని ఆపరమాత్ముని ముఖమందు ప్రత్యక్ష మైన మంత్రాల సముదాయమే వేదాలు. పరమాత్మ , వేదపురుషుడు విశ్వకర్మయే అని వేదాలు తెలుపుతున్నవి.ఉదాహరణకు పురుషసూక్తము లో చెప్పబడిన పురుషుడు విశ్వకర్మయే. వేదాలు వేదపురుషుడు ముఖంనుండి ఉద్భవించినవి కనుక వేదాలను పౌరషేయాలు అని అంటారు. వేదాలలో దేవతలకు సంబందించన వర్ణన స్తుతులు సూక్తములు ఉంటాయి మరియు జ్ఞానం విజ్ఞానభరిత విషయాలతో నిండి ఉంటుంది. ఈ వేదాలలో వివిధ దేవతలు పరిచయం చేయబడతారు మరియు వారి వర్ణననకూడా ఉంటుంది. వేదలలో ఉల్లేఖించబడిన దేవతలను వైదిక దేవతలు అంటారు. వేద దేవతలను విడిచిపెట్టి మిగతా పురాణాలు జనపదసాహిత్యంలో లభించే దేవతలను పౌరాణిక జానపద దేవతలుగా చెప్పబడ్డారు. వేదాలు ఏమిటో తెలిసినప్పటికీ కొందరు అజ్ఞానులు విశ్వకర్మను చిన్నస్తాయి దేవునిగా వైశ్వకర్మణులు మాత్రమే కొలిచే దేవతగా పిలుస్తారు. వేదాలు వేదపురుషుడు , పరమాత్మ విశ్వకర్మను ధాతా విధాతా పరమోత సందృక్ అని అత్యున్నత దేవత విశ్వకర్మయే అని వేదాలచే ప్రశంసించబడ్డారు. వేదాలలో విష్ణువు రెండు చేతులతో కనిపిస్తాడు. విష్ణువు నాలుగు చేతులతో ఆయుధధారి దేవతగా పురాణాలలో మాత్రమే కనిపిస్తాడు, దశఅవతారాలు వేదాలులో లేవు .......... రుద్రుడు పాశుపతుడుగా వేదాలలో కనిపిస్తాడు. త్రిశూలధారి శివుడు వేదాలలో కానరాడు. ఇక్కడ శివుడు , చతుర్బాహువిష్ణువు , చతుర్ముఖ బ్రహ్మ , దేవీదేవతలు చాలా వరకు పౌరాణిక జానపద దేవతలు అని గ్రహించగలరు. పరమాత్మవిశ్వకర్మ విశ్వకర్మవంశ బ్రాహ్మణులకు అంటే, వైశ్వకర్మణులకు మాత్రమే విశ్వకర్మ భగవంతుడు పరమాత్మ కాదు, సమస్త సృష్టికి కూడా పరమాత్మ విశ్వకర్మయే. కొంతమంది స్వార్ధపరులైన, విదేశీ విప్రులు ప్రజలకు వేదాలను దూరం చేశారు మరియు దాని స్థానంలో తప్పుడు కల్పత కళ్ళిబొళ్ళి పురాణాలను భర్తీ చేశారు. వేదాలు ఏవిధంగా దూరం చేసారంటే సామాన్యులు వేదం వింటే చెవిలోని సీసపు లోహం చెవుల్లో కరిగించి పోసేవారు. వేదాలు సామాన్య ప్రజలు ఉచ్ఛరిస్తే, వారి నాలుక తెగ కోసి కత్తిరించబడతాయి.ఈవిధంగా కఠినంగా శిక్షలు అమలు చేయిస్తూ తద్వారా వేదాలను ప్రజలకు దూరం చేశారు. అలా చెబుతూపోతే ఈరోజుకు తేలదు వ్యాసం చాలా పెద్దది అవుతుంది. నేను "విరాట్ విశ్వకర్మ దర్శన సంకృతి " అనే శీర్షికతో భాగాలుగా వ్రాస్తూ ఉంటాను. నేను విశ్వకర్మ విభూతులను వేదాలలో ఉన్న ఆధారాలతో వ్రాస్తాను. మీరు చదివి తెలుసుకుని ఇతరులకు పంపించండి. ఈ విలువైన వ్యాసాన్ని ప్రజలందరికీ అందజేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. (ఫేస్ బుక్ నుండి సేకరించ బడింది)
13 likes
10 shares
🌹viswakarma🌹
1K views 12 days ago
#🕉️om namo viswakarma 🙏 #🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్ #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #😇My Status ఆది దేవుడే విశ్వకర్మ రా ఆది అంత్య ములే విశ్వకర్మ రా విశ్వములో విరాటుడై వెలసిన వాడూ భువనానికి భౌవనుడై భాసిల్లెను రా దేవతలకు దేవుడవై దేవ శిల్పిగా అవతరించి అందరినీ ఆదుకొనేనుగా || ఆది || ఊర్ధ్వ సప్త లోకాలకు ఊతము నీవే అధః సప్త లోకాలకు ఆధారమే గా ఆదియు నీవే అంత్యము నీవే అనాద్యనంతజ్యోతి రూప విశ్వకర్మ రా || ఆది || నిరాకారుడూ జ్యోతి రూపుడూ పంచాననుడూ విశ్వరూపుడూ అవతారం ఆరంభం విశ్వకర్మరా అండపిండ బ్రహ్మాండం విశ్వకర్మ రా || ఆది || కువలయ మీవే కూర్మము నీవే మత్యము నీవే మకరము నీవే సూర్యుడుని సానబట్టి సంధ్యకిచ్చిన సప్తకోటి దేవతలకు ఆరాధ్యుడవూ ||ఆది|| సృష్టివి నీవే దృష్టివి నీవే వ్యష్టివి నీవే సమిష్టివి నీవే సకల జగతి సౌందర్యం సృష్టి కర్తరా నిరాకార నిరాలంబ విశ్వ కర్మరా || ఆది ||
20 likes
23 shares