త్రివేణి సంగమం
6 Posts • 13K views
PSV APPARAO
601 views 2 days ago
#పుణ్య స్నానం చేయడం వలన ఫలం ఏమిటి? #మౌని అమావాస్య ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: పుష్య అమావాస్య / మౌని అమావాస్య / చొల్లంగి అమావాస్య #త్రివేణి సంగమం #సరస్వతి నది * అంతర్వాహిని * త్రివేణి సంగమం *UP:* *మౌని అమావాస్య వేళ.. 1.3 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు* *ఇంటర్నెట్‌ డెస్క్‌:* *మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ (UP)లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌ పరిసరాలు భక్తజనంతో సందడిగా మారాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచి త్రివేణి సంగమంలో 1.3 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మాఘమేళా పవిత్ర స్నానాల కోసం మొత్తం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్‌లను నిర్మించామని, ప్రజలకు అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. సాధారణ, ట్రాఫిక్‌ పోలీసులతో పాటు ఏదైనా అత్యవసర కేసుల్లో సాయం అందించేందుకు వైద్య నిపుణుల బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భద్రతా నియమాలు పాటిస్తూ, అధికారులకు సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.* https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42
11 likes
9 shares