🎥‘ఉప్పు కప్పురంబు’ మూవీ రివ్యూ..స్మశానం నిండినది
12 Posts • 288K views
Seetha Usha Rani
6K views 6 months ago
#🎥‘ఉప్పు కప్పురంబు’ మూవీ రివ్యూ..స్మశానం నిండినది ఉప్పు కప్పురంబు.. ఈ మూవీ పేరు బాగుంది, కీర్తి సురేష్, సుహాస్ తో మంచి కాస్టింగ్ ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయ్, కానీ అస్సలు కథే స్ట్రాంగ్ గా లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఉప్పు కప్పురంబు! స్టోరీ ఏం ఉండదు.. ఊర్లో వచ్చిన ఓ సమస్య చుట్టూ కథ మొత్తం నడుస్తుంది. ఆ డైలాగ్స్, స్క్రీన్ ప్లే, కామెడీ ఏదీ చెప్పుకునేంత గొప్పగా లేకపోగా కొన్ని సీన్స్ లో కామెడీ ఇంత బలవంతంగా ఉందేంటీ అనిపిస్తుంది. ఆ కేరక్టర్ కి అస్సలు కీర్తి సురేష్ సెట్ అవుతుంది అని డైరెక్టర్ కు ఎందుకు అనిపించిందో..! మూవీ మొత్తంలో ఏదైనా బాగుంది అంటే.. సుహాస్ కు వాళ్ళ అమ్మకు మధ్య ఉన్న సీన్స్ మాత్రమే..! ఒకసారి చూడొచ్చు.. బాగున్నట్టూ అనిపిస్తూనే చివర్లో ఎలా Disappoint అవుతామో తెలుస్తుంది. నిన్న Amazon Prime లో డైరెక్ట్ రిలీజ్ అయ్యింది. #uppukappurambuonprime #Uppukappurambu #usharaniseetha #seethausharani #keerthysuresh #Suhas #UppukappurambuMovie
82 likes
68 shares