కంచి పరమాచార్య స్వామి లిలలు
106 Posts • 23K views
lakshmiraj👍🤩
619 views 6 months ago
7. వడియాలు - వేద విద్యార్థులు నిరుపేద అయిన ఒక పాట్టియమ్మ ( బామ్మ) పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చి స్వామికి నమస్కారం చేసింది. పాట్టి స్వామివారితో తను మకాం మద్రాసుకు మార్చానని, ఇంటో తయారుచేసిన వడియాలు, అప్పడాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నానని చెప్పింది. మహాస్వామి వారు పార్టీని ఆశీర్వదించి రెండు చీరలు, ఒక కంబళి, చెన్నై వెళ్ళడానికి కొద్ది పైకము ఇచ్చారు. పార్టీ సంతోషంతో వాటిని స్వీకరించి కొద్దిగా తటపటాయిస్తూ, “నాకు ఒక మడిసంచి(మడి వస్తువులు ఉంచుకోవడానికి ఉన్నితో గాని గడ్డితో గాని అల్లిన ఒక సంచి)ని కూడా ఇప్పిస్తే బావుంటుంది స్వామీ” అని అడిగింది. ఆ దయాళువు శిష్యునికి చెప్పి ఒక మడిసంచిని వెతికి తీసుకురావల్సిందిగా ఆజ్ఞాపించారు. శిష్యుడు దాన్ని తీసుకురాగానే స్వామివారు దాన్ని పార్టీకి ఇచ్చారు పాట్టి ఇంకా ఏదో అడగాలి అన్నట్టుగా కొద్దిగా మొహమాటపడుతూ, మాటల్ని సాగదీసూ "మహాస్వామి వారి చేతుల మీదుగా ఒక రుద్రాక్షమాలు కూడా..." అని అడిగింది. చిన్నగా నవ్వి స్వామివారు ఒక రుద్రాక్షమాల తెమ్మని సేవకుణ్ణి ఆజ్ఞాపించారు. అది రాగానే స్వామివారు అరుణగిరినాథర్ పాడిన తిరుప్పుగళ్ లోని "జపమాలై తంత సద్గురునాథా” (జపమాలను ఇచ్చిన సద్గురువా) ఈ వాక్యాలు చెప్పి పాట్టికి అందించారు. పొట్టి స్వామివారి నుండి సెలవు తీసుకుని తెరిగి వెళ్ళింది. అంతటి అనుగ్రహం పొందినా పొట్టి ముఖంలో ఇంకా ఏదో కోరిక తీరలేదు అనే భావనతో వెళ్ళిపోయింది. పొట్టి కొద్దిదూరం వెళ్ళి మరలా తిరిగి వచ్చింది. కొద్దిగా సంకోచిస్తూ అభ్యర్ధనపూర్వకంగా స్వామివారితో. “స్వామీ నాకు ఒకకోరిక మిగిలిపోయింది. మహాస్వామి కోసమని చాలా జాగ్రత్తగా మడితో అప్పడాలు, వడియాలు తీసుకుని వచ్చాను. మీరు వాటిని తీసుకోవాలి” అని చెప్పింది. కావల్సినవి అడిగి తీసుకోవడంలో పాట్టికి సంతోషం కలగలేదు. అందుకే పాట్టి మొహంలో ఆనందం కనబడలేదు. మహాస్వామి వారు భోజనం విషయంలో కఠినమైన నియమాలను పాటిస్తూ వారి కడుపుపై పూర్తి నియంత్రణ కలవారని తెలిసినా, తను ఉండే చోట అందరికీ అమ్ముతున్న ఈ అప్పడాలు వడియాలు ఆ పవిత్రమైన ఉదరంలోకి కూడా వెళ్ళాలని అనుకుంది. అందరికీ అన్నీ ఇచ్చే మహాస్వామి వారికి తను ఈ చిరు కానుకని ఇవ్వాలని అనుకుంది. ఇచ్చి సంతోషపడాలని ఆశిస్తోంది. కరుణాసముద్రులైన మహాస్వామి వారు పాట్టితో "లోకం క్షేమంగా ఉండాలంటే ఇక్కడ వేదం ఎప్పటికీ బ్రతికి ఉండాలి. దానికోసమే నేను చేయగలిగినదంతా చేస్తున్నాను. వేద పాఠశాలలు కనుమరుగవకుండా చాలా కష్టంతో వాటిని కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఈ రోజుల్లో కూడా ఏదో ఒకటి చదువుకుని చేతినిండా సంపాయించుకునే ఉద్యోగం వచ్చే అవకాశం ఉండి కూడా నా మాటలకు విలువిచ్చి ఎంతోమంది తల్లితండ్రులు వారి అబ్బాయిలని వేదపాఠశాలకు పంపుతున్నారు. నామీద ఉన్న భరోసాతో వారి పిల్లల్ని నాకు అప్పగించారు. ఆ పిల్లలే కొద్దో గొప్పో ఇంకొద్దికాలంపాటు వేదం కనుమరుగవకుండా కాపాడగలరు. అటువంటి పిల్లలు నాకు ప్రాణంతో సమానం కనుక, ఏమిచేస్తావంటే శ్రీమఠం నడుపుతున్న వేద పాఠశాల చిన్న కాంచీపురంలో ఉంది. ఆ పాఠశాల వంటవార్పు అంతా సుందరం అనే అతను చూసుకుంటాడు. నువ్వు తెచ్చిన అప్పడాలు, వడియాలు అతనికిచ్చి, నూనెలో వేయించి పిల్లలకు పెట్టమని చెప్పు. నేను చెప్పానని అతనికి చెప్పు. తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల ఆ పిల్లలు అప్పడాలు వడియాలు తిని చాలా కాలం అయ్యుంటుంది. వారు వాటిని తిని సంతోషంగా ఉంటారు. అదే నాకు సంతోషం. మనల్ని నమ్మిపంపించారు కాబట్టి మనం వారికి కొంచం సంతోషం కలిగించామన్న తృప్తి ఉంటుంది. పాట్టీయమ్మ తెచ్చిన ఆ తినుబండారాలు స్వామివారికి ఇష్టమైన ప్రాణమైన వేదపాఠశాల విద్యార్థులు తినడం ఆమెకూ సంతోషమే. స్వామివారి ఆజ్ఞను పాటించడానికి పాట్టి వెళ్తూ ఉంది. రా. గణపతి, "మైత్రీం భజత" పుస్తకం నుండి #🙏శ్రీశ్రీశ్రీ పరమాచార్య చంద్రశేఖరేంద్ర మహాస్వామి ప్రాతస్మరనీయులు 🙏 #శ్రీ పరమాచార్య స్వామి #పరమాచార్య #కంచి పరమాచార్య స్వామి లిలలు #🙏🏻🌺కంచి పరమాచార్య స్వామి వారి వైభవం 🙏🏻🌺
16 likes
3 shares
lakshmiraj👍🤩
619 views 7 months ago
6. కాళి - కామాక్షి ఒక భక్తురాలు తన పదేళ్ళ కూతురితో కలిసి శ్రీమఠం ముందు బస్సుదిగా ఆ పిల్ల చేతిని పట్టుకుని ఆమె రోడ్డు దాటింది. ఆమె ఏదో ఆలోచిస్తోంది. "శ్రీమఠంలో రద్దీ ఎక్కువగా ఉండదు. భక్తుల తాకిడి ఎక్కువగా లేదు పరమాచార్య స్వామివారి దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇది విషయాలు ఆలోచిస్తోంది. ఆవిడ శ్రీమఠం ప్రవేశ ద్వారం దగ్గరకు రాగానేతను తప్పిపోయినట్లు తెలుసుకుంది. వెంటనే కంగారు పడింది. చుట్టూ వెదికింది ఎక్కడా తన కూతురు కనపడడం లేదు. వెంటనే లోపలికి వెళ్ళి పరమాణ స్వామివారితో చెప్పుకుంది. మహాస్వామి వారు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆ మూసుకుని ధ్యానంలో కూర్చున్నారు.” "వెంటనే కాళికాంబ దేవస్థానానికి వెళ్ళు. ఒక కాగితంపై "నాకూ తప్పిపోయింది. కనిపెట్టి నాకు తెచ్చివ్వు తల్లీ!" అని వ్రాసి ఒక రూపాయిని రక్షిణ ఆ చిట్టితో పాటు దేవస్థానంలోని హుండీలో వెయ్యి. మరలా తిరిగి ఇక్కడికిరా చెప్పారు. అభక్తురాలు ఆందోళనతో. “కాళీ కాళీ” అని మనసులో మననం చేసుకు బయలుదేరింది. ఎంతటి ఆశ్చర్యం! ఎంతటి అద్భుతం! ఆ అమ్మాయి కాసి దేవస్థానం ద్వారం ముందు ఏడుస్తూ నిలబడి ఉంది. కొంతమంది భక్తులు అన్న ఓదారుస్తూ, వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ భక్తురాలు :: తన బిడ్డ అని చెప్పి ఆ పాపను ఓదార్చి తీసుకుని వచ్చింది. ఇంతటి ఆపదనుండి గట్టెంకించిన పరమాచార్య స్వామిపై కృతజ్ఞత పొంగి పొర్లగా నేలపై పడి నమస్కారం చేసింది. "నేను చెప్పినట్టుగా చిట్టిలో రాసి హుండిలో వేసావా?” అని స్వామివారు అడిగారు. "అవును స్వామీ వేసాను. అక్కడ గర్భగుడిలో నాకు కనిపించింది. మహాస్వామివారే. ఇక్కడ నాకు కేవలం కాళికాంబ కనపడుతోంది" అని సంతోషంతో బదులిచ్చింది. మరి పరమాచార్య స్వామివారు కాళియా? కామాక్షియా? సర్వ మాతృస్వరూపములు పరమాచార్య స్వామివారే!! "ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్" పరమాచార్య అనుభవాల సంగ్రహం. #🙏🏻🌺కంచి పరమాచార్య స్వామి వారి వైభవం 🙏🏻🌺 #కంచి పరమాచార్య స్వామి లిలలు #పరమాచార్య #శ్రీ పరమాచార్య స్వామి #🙏శ్రీశ్రీశ్రీ పరమాచార్య చంద్రశేఖరేంద్ర మహాస్వామి ప్రాతస్మరనీయులు 🙏
13 likes
16 shares