Failed to fetch language order
సనాతన హిందూ ధర్మం దేశ రక్షణ ధర్మ రక్షణ
141 Posts • 441K views
దేశం మొత్తం మీద వినాయకచవితి ఖర్చు లక్ష అరవై వేల కోట్లు అయిందని గగ్గోలుపెడుతున్న హిందూవ్యతిరేక నాస్తిక సంఘాలు! అదేమరి హిందూ మతం గొప్పతనం. ఇప్పటికైనా తెలిసిందా హిందువుల పండుగల విలువ! ఈ మా పండగ వల్ల వివిధ కులవృత్తుల వారికి అందరికీ ఈ లక్ష అరవై వేల కోట్ల రూపాయల డబ్బు వారి ఇండ్లకు చేరింది. వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి, వారి సహాయకులైనవారికి, మట్టి అందించేవారికి, రంగులుఅమ్మేవారికి, రంగులు వేసేవారికి, మ్యాదర సోదరులు తాటాకు/వెదురు కర్రలతో వేసే తాత్కాలిక మంటపాలు ద్వారా మరియు షామియానా వారు వేసే టెంట్లు ద్వారా వారికి ఉపాధి దొరికింది. ఈసారి ఫాబ్రికేషన్ పందిళ్లు వేసే వాళ్ళకి కూడా ఉపాధి అయ్యింది. సన్నాయి, బ్యాండ్ మేళం వారికి లోపల డెకరేషన్ చేసే వారికి, క్లాత్ వర్క్ చేసే టైలర్ లకు పని దొరికింది. పువ్వులపంటల వారికి, కోసేవారికి, అల్లేవారికి, అమ్మేవాళ్లకి, దండలు కట్టేవారికి, పూజకు పూలు, పూల డెకరేషన్ల ద్వారా అధిక ధరలు గిట్టుబాటు అయ్యాయి. ట్రాలీలు, లారీలు, వివిధ బళ్ళు నడిపే వారికి విగ్రహాలు మంటపాలకు తేవటానికి, మరల నిమజ్జనానికి తీసుకువెల్లటానికి అధిక ధరలు చెల్లింపులు జరుగుతాయి. రాబోయే పది రోజుల్లో దాదాపు ప్రతి మంటపంలో అన్నదానాలు జరుగుతాయి. కలిసి భోజనాలు జరుగుతాయి. సమాజంలో మతసామరస్యత పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినగల్గుతారు. వంట మనుషులకు, సహాయకులుకు, టెంట్ హౌజ్ సామగ్రి వారికి డబ్బులు గిట్టబాటు అవుతుంది. వివిధ రకాల డెకరేషన్. లైటింగ్, సౌండ్ అందించే వారికి మంచి ధరకు వారి సామాగ్రిని అద్దెకు ఇస్తారు. బ్రాహ్మణులకు, పురోహితులకు మంచి సంభావన దక్కుతుంది. కొబ్బరికాయలు, అరటిపండ్లు, పాలవెల్లికి కట్టే పండ్లు, పూజచేసే పత్రి, మామిడాకులు ఇలా వీటిన్నటినీ ఈ రోజుల్లో కొనటమే కనక సన్నకారు రైతులు అందరూ వారి ఇండ్లకీ కొంత ఈ ధనం చేరింది. ఈసారి మట్టి విగ్రహాలు కూడా బాగా ధర పలికాయి. హరికధలు, బుర్రకధలు, నాటకాలు, ప్రవచనాలు, భరత నాట్యాలు, సంగీత కచేరీలు, ఊరేగింపులలో నృత్యాలు, కోలాటాలు, నాదస్వర డోలు సహనాయిలు, చివరికి తోలుబొమ్మలాటలు వారితో సహా ప్రతీ కళాకారుడు ఈ వినాయక చవితి పేరు చెప్పకుని తన కుటుంబంతో కలసి తృప్తిగా భోంచేసేది ఈ డబ్బులతోనే. ఆఖరికి కూలిపనికి వెళ్లేవారు కూడా నాలుగు పందిర్లకు స్తంభాలు తవ్వే పనికో, షెడ్లకు రాడ్లు ఎత్తే పనికో, పైన ఆకులు వేసే రేకులు వేసే పనికో, పోతే నాలుగు డబ్బులొస్తాయని ఎదురుచూసేది కూడా ఈ వినాయక చవితి కోసమే. నవతరానికి సనాతన సంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మంటపల నుంచే అంటే అతిశయోక్తి కాదు. ఆర్థిక మాంద్యం బారిన వివిధ దేశాలు పడుతుంటే మనం మాత్రం ఎందుకు ఇలా ధీమాగా ఉన్నామో ఎప్పటికీ ఈ సోకాల్డ్ మేధావులకు అర్ధంకాదు. ప్రతి పండగ మనకు ఒక్కో మేలును కల్గిస్తు ఒక్కో కులానికి ఏడాది పొడుగునా ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ప్రతి ఒక్క కులమూ గొప్పదే. ఏ కులం లేకుండా మరొక కులం మనుగడ సాగించలేదు. కులం అంటే వృత్తి. మా భక్తి చాటున వ్యావహారిక, సాంస్కృతిక, సనాతన సంప్రదాయాలు, వాటి వలన సమభావం, తద్వారా వసుధైక కుటుంబం అనే సిద్దాంతం దాగి ఉంది. చివరిగా ఒకమాట. మా పండగలలో ధనం ధర్మ భద్దంగా చందాల రూపంలో సేకరించి అందరికీ పంచబడుతుంది. మాకు మేము పని కల్పించుకుని సమాజాన్ని బతికించుకుని నిలబెట్టుకునే ధర్మం మాది. గమనిక: ఇక నిమజ్జనం దాకా పూలు వ్యాపారం ఒక రేంజ్ లో ఉంటుంది. నిమజ్జనం ఊరేగింపులో మళ్లీ అన్ని వృత్తుల వారికి పనులు దొరుకుతాయి. సేకరణ... 🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺 #🕉️ గణపతి బప్పా మోరియా #సనాతన హిందూ ధర్మం #హైందవ ధర్మం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతన హిందూ ధర్మం దేశ రక్షణ ధర్మ రక్షణ
8 likes
10 shares
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
46 likes
37 shares