P.Venkateswara Rao
649 views • 2 months ago
#విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪 #పవన్ కళ్యాణ్
*జనసేన మాత్రమే టార్గెట్..❗*
SEPTEMBER 2, 2025🎯
ఇటీవల కాలంలో జనసేనపై నెగెటివిటీ పెరుగుతోంది. కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాయి. మూడు పార్టీలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. అయితే కొన్ని కీలక అంశాల్లో జనసేన మాత్రమే టార్గెట్ కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అలాగే సుగాలి ప్రీతి కేసు విషయంలో జనసేన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రధాన కారణం... కేంద్రంలోని మోదీ సర్కార్. ఏదైనా వుంటేనే, ఆ పార్టీ వివరణ ఇచ్చుకోవాలి. కానీ అలా జరగడం లేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ట కరణపై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ వివాదాస్ప కామెంట్స్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు నాడు జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అలాగే కొందరు నాయకులు ప్లాట్లు తీసుకుని, సర్దుబాటు చేసుకున్నారని ఆయన అన్నారు. ఇది స్టీల్ ప్లాంట్ కార్మికులకు తీవ్ర కోపం తెప్పించింది.
అలాగే 2017లో చంద్రబాబు పాలనలో సుగాలి ప్రీతి హత్యాచారానికి గురైంది. ఆ కేసును అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శ వుంది. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిందో, ఆ కేసు విషయమై పవన్కల్యాణ్ తీవ్రస్థాయిలో దాడి చేశారు. వైసీపీ హయాంలోనే సుగాలి ప్రీతిపై అఘాయిత్యం జరిగిందన్న సంకేతాలు వెళ్లాయి.
నిజానికి జగన్ హయాంలోనే సుగాలి ప్రీతి కుటుంబానికి అంతోఇంతో న్యాయం జరిగింది. ఆ విషయం ప్రచారం చేసుకోవడం చేతకాలేదు. సుగాలి ప్రీతికి అన్యాయం చేశారనే ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లి, రాజకీయంగా నష్టం జరిగింది. ఇప్పుడు అదే సుగాలి ప్రీతి కేసు జనసేన మెడకు చుట్టుకుంది.
ఈ కేసు విషయమై టీడీపీ, బీజేపీ నోరు మెదపడం లేదు. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అసలు ఆ అమానుష ఘటన ఏపీలోనే జరగలేదన్నట్టు మౌనం పాటిస్తుండడం విశేషం. అందుకే జనసేన ఎక్కువ టార్గెట్ అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్, అలాగే సుగాలి ప్రీతి విషయంలో జనసేన నెగెటివిటీని ఎదుర్కొంటుండగా, పాజిటివిటీ మాత్రం చంద్రబాబు, లోకేశ్ ఖాతాల్లో పడుతుండడం విచిత్ర పరిణామం.
10 likes
14 shares