PSV APPARAO
714 views • 3 months ago
#🦬సదర్ ఉత్సవాలు@హైదరాబాద్🎉 #సదర్ ఉత్సవాలు #సదర్ ఉత్సవాలు💐🎂 #సదర్ పండగ ... భాగ్యనగర్లో సదర్ సమ్మేళనం ... సదర్ అంటే యాదవ సంస్కృతి 🐮🐄🐃
'సదర్' ధూమ్ ధామ్ కు సిద్ధమవుతున్న భాగ్యనగరం - స్పెషల్ అట్రాక్షన్ గా 'బహుబలి దున్నరాజులు '
సదర్ పండగ ...సదర్ సమ్మేళనం ... సదర్ అంటే యాదవ సంస్కృతి 🐮🐄🐃
దీపావళి మరుసటి రోజు జరిగే సదర్ సమ్మేళనానికి హైదరాబాద్ నగరంలో సిద్ధమవుతోంది. ఇప్పటికే యాదవులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 19 వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో భారీ స్థాయిలో సదర్ సమ్మేళన్ నిర్వహిస్తున్నారు.
సదర్ పండగకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఈ పేరు వింటే హైదరాబాద్ లో వైబ్రేషన్ అని చెప్పొచ్చు. సదర్ అంటే యాదవ సంస్కృతి..!! ఈ పండగొచ్చిందంటే… నగరంలో లో పెద్ద ధూమ్ ధామ్ ఉండాల్సిందే...! దీపావళి తర్వాత వచ్చే ఈ వేడుక... ఎంతో ప్రత్యేకమనే చెప్పొచ్చు. డప్పు చప్పుళ్లు, అందంగా ముస్తాబు చేసిన దున్నరాజుల విన్యాసాలు చూస్తే ఆ సందడి ఒక్క మాటాలో చెప్పలేం. అలాంటి సందడికి భాగ్యనగరం సర్వం సిద్ధమవుతోంది. నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
హరియాణా నుంచి వచ్చిన దున్నరాజు
యాదవ సామాజిక వర్గం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాలకంటూ ప్రత్యేక చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా జరిగే ఈ వేడుకలకు వేర్వురు పేర్లు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రకరకాలుగా పిలుస్తుంటారు. మన దగ్గర మాత్రం ‘సదర్’ పేరుతో నిర్వహిస్తుంటారు.
గతంతో పోల్చితే… ప్రస్తుతం ఈ పండగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గతేడాది కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇందుకోసం పలు రాష్ట్రాల నుంచి నుంచి దున్నరాజులను తీసుకువస్తారు. లక్షలు వెచ్చించి ఇక్కడికి తరలిస్తారు. నగరంలోని సైదాబాద్, నారాయణగూడ, సైదాబాద్, అమీర్ పేట, ఖైరరాబాద్, షెక్ పేట ఏరియాలో ఈ పండగను ఎక్కువగా జరుపుతుంటారు. నవంబర్ 2024లో తెలంగాణ ప్రభుత్వం సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది.
యాదవులకు ఈ సదరు ఉత్సవం లక్ష్మీ పూజలాంటిందని చెప్పొచ్చు.ఎక్కువగా పాల వ్యాపారం చూసే వీరు.... దున్నపోతులు, ఆవులు, గొర్రెలను అన్నంపెట్టే తల్లులగా భావిస్తుంటారు. కాబట్టి అవే వారికి లక్ష్మీ. అందుకే సదరు ఉత్సవం రోజున వాటికి శుభ్రంగా స్నానం చేయించి, పూలదండలతో అందంగా అలంకరంచి పండుగలా జరుపుకుంటారు. ఈ క్రమంలో బంగారంతో అలంకరిస్తారు. మెడకు భారీ బంగారు గొలుసులను తగిలిస్తారు. ఈ వేడుకను చూసేందుకు జనాలు కూడా భారీగా తరలివస్తుంటారు. ఈ పండుగను సాధారణంగా దీపావళి తర్వాత రెండు రోజుల పాటు జరుపుకుంటారు.
సదర్ సమ్మేళనం - సీఎం రేవంత్ కు ఆహ్వానం…
ఈ నెల 19 వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో భారీ స్థాయిలో సదర్ సమ్మేళన్ నిర్వహిస్తున్నారు.శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందగా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందజేశారు.
హర్యానా నుంచి దున్నరాజులు..!
ఈసారి జరగబోయే పండగ కోసం హర్యానా రాష్ట్రాంలోని రోహ్‌తక్, హిస్సార్ ప్రాంతాల నుంచి బాహుబలి వంటి దున్నరాజులను హైదరాబాద్ సిటీకి తీసుకొచ్చారు. రోలెక్స్, ఘోలు-2, కోహినూర్, బజరంగీ వంటి దున్నరాజాలు ఇందులో ఉన్నాయి. ఇవి ముర్రా జాతికి చెందినవి.
అక్టోబర్ 22 సాయంత్రం నిర్వహించే ఉత్సవంలో అలంకరించిన ఎద్దులతో కూడిన భారీ ఊరేగింపు ఉంటుంది. ఇందులో ఉండే దున్నరాజులు… సుమారు 12 అడుగుల పొడవు ఉంటాయి. వీటికి ప్రతిరోజూ డ్రైఫ్రూట్స్‌తో పాటు రోజుకు 20 లీటర్ల పాలను ఆహారంగా అందిస్తారు. రోజూ ఆయిల్ మసాజ్ కూడా ఉంటుంది.
ఈసారి ఘనంగా జరుపుతాం - ఎడ్ల హరిబాబు
సదర్ ఫెస్టివల్ నిర్వాహకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ మాట్లాడుతూ “మేము గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సదర్ పండుగను ఘనంగా జరుపుకోబోతున్నాము. మేము హర్యానా నుండి గోలు 2, బజరంగీ, రోలెక్స్ బాషా వంటి ఐదు ఎద్దులను తీసుకువచ్చాము. సదర్ పండుగ కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ముషీరాబాద్ లో తొమ్మిది ఎద్దులతో సదర్ పండుగ నిర్వహిస్తున్నాం. ఈ ఊరేగింపు నారాయణగూడలో ముగుస్తుంది, మొత్తం తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది ప్రజలు హాజరవుతారు” అని వివరించారు.
#దీపావళి సదర్ పండుగ జై యాదవ్ జైమదవ్💪💪✊
7 likes
4 shares