కాంగ్రెస్ పార్టీ తెలంగాణ
3K Posts • 35M views
రాజ్యాంగ విలువలు కాపాడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది – ఎమ్మెల్యే జారె 26-01-2026 | సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు పాల్గొన్నారు. అశ్వారావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ క్యాంపు కార్యాలయం, వ్యవసాయ కళాశాల, ప్రెస్ క్లబ్‌లలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను పాటించాలన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మన బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం అశ్వారావుపేట మున్సిపాలిటీలో రూ.50 లక్షలతో నిర్మించబోయే పబ్లిక్ టాయిలెట్లకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. తదుపరి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై అందజేసిన వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. దమ్మపేట మండల కేంద్రంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించిన 108 హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని తెలిపారు. అదే విధంగా మొద్దులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి, డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విద్యే సమాజ అభివృద్ధికి మూలాధారమని, మహానుభావుల విగ్రహాలు విద్యార్థుల్లో నైతిక విలువలు, దేశభక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
5 likes
17 shares
అశ్వారావుపేట అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలి – ఎమ్మెల్యే జారె 03.01.2026 | శనివారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీ లోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వ సహకారం అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మరింత ఫలప్రదంగా అమలవ్వాలని ఆకాంక్షించారు #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #కాంగ్రెస్ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ
9 likes
8 shares
*మహిళల గౌరవం – అభివృద్ధి లక్ష్యంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం : ఎమ్మెల్యే జారె* *22.11.2025 – శనివారం* దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో రాష్ట్ర ప్రభుత్వ *ఇందిర మహిళా శక్తి కార్యక్రమం* లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. దమ్మపేట MPDO కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు స్వయంగా చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, “మహిళల ఆర్థిక స్థితి బలోపేతం కావాలి, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలి అనేదే కాంగ్రెస్ ప్రభుత్వ అసలు ఉద్దేశ్యం. మహిళల గౌరవాన్ని ప్రతిబింబించే భావంతోనే ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టాం” అని పేర్కొన్నారు. అదే రోజున అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా *కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గారు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి మహిళలకు చీరలను* అందజేశారు. గ్రామీణ మహిళల ఆర్థిక పురోగతికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలను ఆయన విపులంగా వివరించారు. #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్ #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🏛️రాజకీయాలు
11 likes
13 shares