m.krishnareddy
2K views • 3 months ago
ధరలు నిర్ణయించేది వీళ్లే..
బంగారం ధరను నిర్ణయించే వ్యవస్థను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను వెల్లడిస్తుంది. ఉదయం 10:30 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 3:00 గంటలకు మరోసారి బంగారం ధరలను ప్రకటిస్తుంది. దీన్ని బట్టి ప్రపంచమంతా బంగారం ధరలు అమలు అవుతుంటాయి. దేశాలు తమ టైమ్ జోన్ ప్రకారం ధరలను నిర్ణయించుకుంటాయి. భారత్ లో ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇండియన్ కరెన్సీలో ఈ ధరలను విడుదల చేస్తుంది. అయితే లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అనేది సొంతంగా ధరలను నిర్ణయించదు. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, డాలర్-రూపాయి మారకం విలువ, ఇంపోర్ట్ ఫీజులు, డిమాండ్ అండ్ సప్లై వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఈ ధరని నిర్ణయిస్తుంది. దీనికంటూ కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలుంటాయి. దాన్ని బట్టే ధరలను లెక్క కడుతుంది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬 #😍బంగారం ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్
26 likes
28 shares