pasuram 2#thirupavai#dhanurmasam
5 Posts • 7K views
🎻🌹🙏తిరుప్పావై 2 వ పాశురము...🦜 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 🌹 వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కు శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్ పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్ శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్ ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్...🌹 🌹ఆండాళ్ తిరువడిగలే శరణం..🌹 🌹రెండవ పాశురం అర్ధం🌹 🌿ఈ లోకములో, ఈ మానవ జన్మలోనే, తరించాలి అని తహతహలాడే మానవు లారా, మేము చేసే మా నోములోని నియమములను వినండి. 🌸తెల్లవారుఝామునే నిద్ర లేచి, స్నానము చేసి, ఆ క్షీరాబ్ది యందు ఆదిశేషుడిపై యోగనిద్ర పోతున్న ఆ సర్వేశ్వరుడి దివ్య పాదపద్మములను పూజించి, సేవిస్తాము. 🌿మేము ఆ స్వామిని పూజించకుండా కాటుకతో మా కంటిని అలంకరించుకోము, పువ్వులను తలలో పెట్టుకోము. ముందుగా మేము చేసేది ఆ స్వామి పూజ మాత్రమే, ఆ స్వామిని కీర్తించి కాని మేము ఏ పని చెయ్యము 🌸. నేతితో చేసినవి కాని పాలతో చేసినవి కాని ముందుగా వేటిని తినము. పెద్దలు చెయ్య వద్దని చెప్పిన పనులను ఎప్పుడూ చెయ్యము. చెడ్డ మాటలు చెప్పము. 🌿సరి అయిన విధముగా, జ్ఞానము కలిగిన సాధువులకు, బిచ్చగాండ్లకు దానధర్మములను చేస్తూ, ఈ మానవ జన్మలోనే తరించే మార్గమును వెతుకుతూ, సంతోషముగా ఆ దారిన నడిచెదము, 🌸అని అంటూ, మనము ఏ పనిని చెయ్యాలి అని అనుకున్నామో, ఆ పనిని ఏ విధముగా చెయ్యగలగాలో మనకు తెలిసి ఉండాలి అని అంటూ, ఆండాళ్ తల్లి ఇందులోని అభిప్రాయముగా చెబుతున్నది...💐🙏 🙏 ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #dhanurmasam #pasuram 2#thirupavai#dhanurmasam #thirupavai #pasuram# dhanurmasam #andal pasuram🕉️
25 likes
28 shares