P P P
10 Posts • 3K views
P.Venkateswara Rao
784 views 2 months ago
#P P P నాకో చిన్న డౌట్.. నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆ గుడి గవర్నమెంట్ గుడి కాదు, అది ప్రైవేట్ వాళ్ళది అన్నారు.. మరి టీటీడీ, సింహాచలం, గుడులు govt కదా..? మరి వాటిలో జరిగినపుడు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు..? అలాగే govt medical colleges ni kuda private vallaki ichesi repu private vallu sariga ట్రీట్మెంట్ చేయక ఎవరైనా చనిపోతే, అప్పుడు కూడా ప్రభుత్వం ఇలానే, అది ప్రైవేట్ హాస్పిటల్ మాకు ఏమి సంబంధం లేదు అని అంటే ఎవరికి చెప్పుకోవాలి..✍️
11 likes
18 shares
P.Venkateswara Rao
739 views 3 months ago
#P P P వైద్య రంగంలో తీవ్ర సంక్షోభం! అత్యంత తీవ్రమైన విషయం భారతదేశ ఆరోగ్యరంగం పతన అంచున ఉంది — దీనిని భారత పార్లమెంటరీ కమిటీ కూడా అంగీకరించింది. జీ న్యూస్‌ తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో జరుగుతున్న సర్జరీల్లో సుమారు 44% ఆపరేషన్లు నకిలీ, మోసపూరిత లేదా అవసరం లేని వాటిగా తేలాయి.అంటే దేశంలో జరుగుతున్న దాదాపు సగం ఆపరేషన్లు కేవలం రోగులను లేదా ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బు సంపాదించడానికే చేస్తారు. నివేదిక ప్రకారం — 55% గుండె ఆపరేషన్లు, 48% గర్భాశయం తొలగించే శస్త్రచికిత్సలు (Hysterectomy), 47% క్యాన్సర్ సర్జరీలు, 48% మోకాలి మార్పిడి ఆపరేషన్లు, 45% సిజేరియన్ (C-Section) డెలివరీలు, భుజం, వెన్నెముక వంటి శస్త్రచికిత్సలలో సగం వరకు అవసరం లేనివి లేదా నకిలీగా జరుగుతున్నాయని తేలింది. మహారాష్ట్రలోని ప్రముఖ ఆసుపత్రుల్లో జరిగిన సర్వేలో, పెద్ద ఆసుపత్రుల్లో సీనియర్ వైద్యులకు నెలకు ఒక కోటి రూపాయల వరకు జీతాలు ఇస్తున్నారని తేలింది. దానికి కారణం — ఎవరు ఎక్కువ టెస్టులు, చికిత్సలు, అడ్మిషన్లు, ఆపరేషన్లు చేయిస్తారో (అవసరం ఉన్నా లేకపోయినా), వారికే ఎక్కువ జీతం లేదా బోనస్ ఇస్తారు. (మూలం: BMJ Global Health) టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం — మరణించిన రోగులను కూడా బతికినట్టుగా చూపించి చికిత్స చేసిన ఘటనలు బయటపడ్డాయి. ఒక ఘటనలో, ఒక ప్రసిద్ధ ఆసుపత్రి 14 ఏళ్ల బాలుడిని ఇప్పటికే చనిపోయినా బతికినట్టుగా చూపించి ఒక నెల పాటు వెంటిలేటర్ మీద ఉంచి, కుటుంబం నుండి లక్షల రూపాయలు వసూలు చేసింది. తరువాత అతడిని చనిపోయినట్టుగా ప్రకటించారు. దర్యాప్తులో ఆసుపత్రి దోషిగా తేలి కుటుంబానికి ₹5 లక్షలు పరిహారం ఇచ్చారు. కానీ కుటుంబం ఎదుర్కొన్న మానసిక బాధకు ఎవరు బాధ్యులు? కొన్ని సందర్భాల్లో, మరణించిన రోగిపై కూడా తక్షణ శస్త్రచికిత్స జరుగుతోందని నటించి డబ్బు వసూలు చేసి, తర్వాత “ఆపరేషన్ సమయంలో చనిపోయారు” అని చెబుతారు. (మూలం: Dissenting Diagnosis – డా. గద్రే మరియు శుక్లా) బీమా (మెడిక్లెయిమ్) మోసాలు భారతదేశంలో సుమారు 68% మందికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ, అవసరమైనప్పుడు క్లెయిమ్ తిరస్కరించబడుతుంది లేదా కొంత మాత్రమే చెల్లిస్తారు.మిగతా భారాన్ని కుటుంబమే భరించాల్సి వస్తుంది. సుమారు 3,000 ప్రసిద్ధ ఆసుపత్రులు బీమా సంస్థల ద్వారా నకిలీ క్లెయిమ్‌ల కారణంగా బ్లాక్‌లిస్టు అయ్యాయి.కోవిడ్ కాలంలో అనేక ఆసుపత్రులు నకిలీ కోవిడ్ కేసులు చూపించి బీమా కంపెనీలను మోసం చేశాయి. మానవ అవయవాల అక్రమ రవాణా 2019లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెలుగులోకి తెచ్చిన ఘటనలో,కాన్పూర్‌కి చెందిన సంగీత కశ్యప్‌కు ఉద్యోగం పేరుతో ఢిల్లీ ఫోర్టిస్ ఆసుపత్రికి తీసుకెళ్లి, “హెల్త్ చెక్‌అప్” పేరుతో చేర్చారు.ఆమె “డోనర్” అనే పదం విన్న వెంటనే అప్రమత్తమై తప్పించుకుంది. తర్వాత పెద్ద అంతర్జాతీయ అవయవాల స్మగ్లింగ్ రాకెట్ బయటపడింది, అందులో డాక్టర్లు, సిబ్బంది, పోలీసులు కూడా ఉన్నారు. హాస్పిటల్ రిఫరల్ మోసం కొంతమంది వైద్యులు తప్పుడు రోగనిర్ధారణ చేసి రోగిని పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు. అపోలో, ఫోర్టిస్, ఏపెక్స్ వంటి ఆసుపత్రుల్లో రిఫరల్ ప్రోగ్రామ్‌లు నడుస్తున్నాయి. ఉదాహరణకు — ముంబై కోకిలాబెన్ ఆసుపత్రి 40 మంది రోగులను పంపితే ₹1 లక్ష, 50 మందికి ₹1.5 లక్షలు, 75 మందికి ₹2.5 లక్షలు ఇచ్చే ఆఫర్ పెట్టింది. రోగి పరిస్థితి ఎలా ఉన్నా, డాక్టర్‌కు రిఫరల్ ఫీజు నేరుగా బ్యాంక్‌లో జమ అవుతుంది. డయాగ్నోసిస్ ల్యాబ్ మోసాలు ఇది కోట్ల కాదు, అరబుల రూపాయల వ్యాపారం.బెంగళూరులో జరిగిన ఆదాయపు పన్ను దాడిలో, ఒక ప్రసిద్ధ ల్యాబ్ వద్ద ₹100 కోట్లు నగదు మరియు 3.5 కిలోల బంగారం లభించాయి.ఇవి డాక్టర్లకు లంచంగా ఇవ్వడానికి ఉంచినవే. డాక్టర్లు అవసరం లేని టెస్టులు రాయడం ద్వారా 40–50% కమిషన్ తీసుకుంటారు. భారతదేశంలో 2 లక్షలకుపైగా ల్యాబ్‌లు ఉన్నప్పటికీ, కేవలం 1,000 మాత్రమే ధృవీకృతమైనవి. ఫార్మా కంపెనీల మోసాలు 20–25 పెద్ద ఔషధ కంపెనీలు ప్రతి సంవత్సరం డాక్టర్లపై ₹1,000 కోట్లు ఖర్చు చేస్తాయి. కోవిడ్ సమయంలో డోలో టాబ్లెట్ తయారు చేసే కంపెనీ మోసం బయటపడింది. తమ మందులు రాయించేందుకు డాక్టర్లకు నగదు, విదేశీ పర్యటనలు, ఫైవ్‌స్టార్ హోటల్ వసతి ఇస్తారు. ఉదాహరణకు — USV Ltd. ప్రతి డాక్టర్‌కి ₹3 లక్షలు లేదా ఆస్ట్రేలియా/అమెరికా ట్రిప్ ఇస్తుంది. ఆసుపత్రులు – ఫార్మా కంపెనీల గూటి కొన్ని కంపెనీలు శస్త్రచికిత్స పరికరాలు, మందులు తక్కువ ధరకు ఆసుపత్రులకు ఇస్తాయి, కానీ రోగుల నుండి 10 రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. ఇండియా టుడే విచారణ ప్రకారం, EMCURE కంపెనీ తయారు చేసిన క్యాన్సర్ ఔషధం టెమిక్యూర్ ఆసుపత్రికి ₹1,950కి దొరుకుతుంది, కానీ రోగి వద్ద నుండి ₹18,645 వసూలు చేస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) 2016లో ప్రభుత్వ కమిటీ తెలిపింది — MCI కొత్త మెడికల్ కాలేజీలను అనుమతించడంలో మాత్రమే చురుకుగా ఉంది, కానీ డాక్టర్లు మరియు ఆసుపత్రులపై నియంత్రణ పూర్తిగా విఫలమైంది. MCI నిబంధనలు (పాలించబడని ముఖ్యమైనవి): 1. డాక్టర్ బ్రాండెడ్ మందులు కాకుండా జనరిక్ మందులు మాత్రమే రాయాలి. 2. చికిత్స ప్రారంభానికి ముందు తన ఫీజు స్పష్టంగా చెప్పాలి. 3. పరీక్షలు/చికిత్సకు ముందు రోగి అనుమతి తప్పనిసరి. 4. ప్రతి రోగి యొక్క రికార్డును కనీసం 3 సంవత్సరాలు భద్రపరచాలి. 5. అనైతిక లేదా అర్హతలేని డాక్టర్లను వెల్లడించడం వైద్యుల బాధ్యత. ప్రభుత్వ పథకాలలో కూడా భారీ అవినీతి ఉదాహరణకు, మాజీ సైనికులు లేదా ప్రభుత్వ ఉద్యోగులు చిన్న వ్యాధులతో చేర్చబడి, నకిలీ చికిత్స బిల్లులు చూపించి ప్రభుత్వ పథకాల ద్వారా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో ఆసుపత్రి సిబ్బంది మరియు అవినీతిపరులైన అధికారులు భాగస్వాములు అవుతున్నారు. 👉 ఈ సందేశం ప్రతి పౌరుడి వరకు చేరాలి, తమను తాము మరియు తమ కుటుంబాన్ని రక్షించుకునే విధంగా జాగ్రత్తగా ఉండాలి. సత్యమేవ జయతే 🇮🇳 వాట్సప్ నుంచి వచ్చిన సమాచారం
8 likes
8 shares
P.Venkateswara Rao
843 views 4 months ago
#P P P #ఏపీ అప్ డేట్స్..📖 #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ *పులివెందులకు బాబు సర్కార్ రిటర్న్ గిఫ్ట్❗* SEPTEMBER 5, 2025🎯 స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసినందుకు, రిటర్న్ గిఫ్ట్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు సాధించి ఇస్తామని టీడీపీ, బీజేపీ నాయకులు గొప్పగా చెప్పారు. చెప్పినట్టే జరిగింది. ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు. పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా చేశామని చంద్రబాబు దంపతులు, మంత్రులు నారా లోకేశ్, సవిత, అలాగే కడప జిల్లా నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాబుకు పులివెందుల జెడ్పీటీసీ గెలుపును గిఫ్ట్ ఇచ్చామని టీడీపీ, బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఇంత వరకూ అంతా బాగుంది. మరి పులివెందులకు చంద్రబాబు సర్కార్ రిటర్న్ గిఫ్ట్ ఏం ఇచ్చిందో తెలుసుకుందాం. ఇదే పులివెందుల రూరల్ పరిధిలో వైఎస్ జగన్ హయాంలో అద్భుతమైన వైద్య కళాశాల, ఆస్పత్రిని నిర్మించారు. వైద్య కళాశాలలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వ మనసులో వేరే ఆలోచనలు వుండడంతో అనుమతుల్ని కూడా వద్దని లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పులివెందులతో పాటు మరో తొమ్మిది మెడికల్ కళాశాలల్ని పీపీపీ విధానంలో నడపాలని బాబు కేబినెట్ తీర్మానించింది. మొదటి విడతలో పులివెందుల మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు నిర్ణయించడం గమనార్హం. ప్రభుత్వ నేతృత్వంలో నడపాల్సిన పులివెందుల మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే, వైద్య విద్యను, అలాగే ప్రజారోగ్యాన్ని మరింత భారం చేయడం తప్ప, మరొకటి కానేకాదనే విమర్శ వెల్లువెత్తుతోంది. మరీ ముఖ్యంగా పులివెందులలో గత ఏడాదిలోనే మెడికల్ కళాశాలను ప్రారంభించాల్సి వుండగా, కేవలం వ్యాపారం కోసం జాప్యం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా టీడీపీ, బీజేపీ నాయకులు పులివెందుల జెడ్పీటీసీని బాబుకు గిఫ్ట్ ఇస్తే, ప్రభుత్వం మాత్రం రిటర్న్ గిఫ్ట్ అక్కడి వైద్య కళాశాలను ప్రైవేట్పరం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలే ఆలోచించాలి.
14 likes
8 shares