పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు
13 Posts • 3K views
PSV APPARAO
578 views 10 days ago
#పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు #పూరీ జగన్నాథ్ మహాప్రభు టెంపుల్ రహస్యం #పూరీ జగన్నాథ్ స్వామి విశిష్టత #పూరీ జగన్నాథ్ #🙏పూరి జగన్నాద్ గుడి ఆలయ రహస్యం పూరీ జగన్నాధ స్వామి...........!! ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!! పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీయే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీలేంటో ఓసారి తెలుసుకొండి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే. జెండా.! ఈ ఆలయ గోపురం పైన ఉండే జెండాకు కూడా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే.. గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. కానీ.. ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా.. వ్యతిరేక దిశలో ఊగుతుంది. చక్రం.! పూరీ జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే. ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది. మీరు పూరీలో ఎక్కడ ఉండి అయినా సరే.. ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే.. అది మీ వైపే తిరిగినట్టు కనిపిస్తుంది. అది ఆ చక్రం ప్రత్యేకత. అలలు.! సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపునకు ఉంటుంది. పగటి పూట అలా వీస్తుంది. సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపునకు వీస్తుంది. కానీ.. పూరీలో మాత్రం అంతా రివర్స్. దానికి విభిన్నంగా గాలి వీస్తుంది. పక్షులు.! జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఆలయం పైకి పక్షులు వెళ్లవు. పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు.. అనే విషయం మాత్రం ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు. గోపురం నీడ.! జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా.. సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. దీని నిర్మాణం అలా ఉంటుందా? లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా? అనేది మాత్రం అంతు చిక్కడం లేదు. ప్రసాదం వృథా చేయరు.! పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృథా చేయరు. మొత్తం తినేస్తారు. అలల శబ్దం.! సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే.. సముద్రంలో నుంచి వచ్చే శబ్దం వినిపించదు. కానీ.. అడుగు బయటపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది రథ యాత్ర... పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది ఇదే. పూరీ రథ యాత్ర. ఈ రథ యాత్రలో రెండు రథాలు ఉంటాయి. శ్రీమందిరం, గుండిజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లాలి. అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు. మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు. రథాలు.! పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. బంగారు చీపురు.! రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు. విగ్రహాలు.! ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు. గుండీజా ఆలయం.! ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో విశిష్టత ఏంటంటే.. గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే.. రథం తనంతట తానే ఆగిపోతుంది. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీలాగానే ఉండిపోయింది. దేవుడికి ప్రసాదం.! పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం.. వాటిని మట్టి కుండల్లో వండుతారు. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు. రుచి కూడా ఉండదు కానీ.. దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు ఘుమఘుమలాడుతాయి. ఎంతో మధురంగా ఉంటాయి ప్రసాదాలు.
13 likes
7 shares
PSV APPARAO
1K views 6 months ago
#పూరి జగన్నాథ్ స్వామి వైభవం 🛕పూరి జగన్నాథ్ ఆలయంలో జరుగు ఉత్సవాలు / PURI UTSAVALU 🕉️🙏🙏🙏 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరి జగన్నాథ రథ యాత్ర 2025 🛕🙏 #శ్రీ జగన్నాథుని రథయాత్ర 🛕గుండిచా మార్జనమ🙏 #పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు 🔔 *జై జగన్నాథ్* 🔔 *జగన్నాథ - రథయాత్ర సంపూర్ణ వివరాలు* 1) పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం ) 2) రథయాత్ర ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ ) 3) పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రోజులు జగన్నాథుడు కొలువై ఉండే మందిరం పేరేమి?( గుండిచా ) 4) జగన్నాథుడు పయనించే రథం పేరేమి? (నంది ఘోష ) 5) జగన్నాధుని రథం ఎత్తు ఎంత?( 23 గజాలు) 6) జగన్నాధుని రథచక్రాలు ఎన్ని?(18) 7) బలబద్రుని రథం పేరేమిటి?( తాళద్వజం ) 8) బలబద్రుని రథం ఎత్తు ఎంత?(22 గజాలు ) 9) బలబద్ధుని రవి చక్రాలు ఎన్ని?(16) 10) సుభద్రాదేవిని తీసుకొని వచ్చే రథం పేరేంటి?( దర్పదలన ) 11) సుభద్రా దేవి రథం ఎత్తు ఎంత?(21 గజాలు) 12) సుభద్ర దేవి రథం చక్రాలు ఎన్ని?(14) 13) జగన్నాథ రథ తయారీ ప్రక్రియ పేరేమిటి?( రధ ప్రతిష్ట) 14) రథయాత్ర మార్గాన్నిఏమని పిలుస్తారు?( బడదండ ) 15) రథాలపై రెపరెపలాడే జెండాలను ఏమంటారు?( పావన బాణా ) 16) జగన్నాథ రథ తయారీలో పాల్గొనే వడ్రంగులు ఎంతమంది?(60 మంది) 17) జగన్నాథ రథం పై వేసే అలంకరణ వస్త్రాన్ని ఏమంటారు?( చాంద్వా ) 18) అలంకరణ వస్త్రాన్ని కుట్టే దర్జీలు ఎంతమంది?(14 మంది) 19) జగన్నాధ రథ అలంకరణ కోసం ఉపయోగించే వస్త్రం ఎన్ని మీటర్లు?(1200) 20) రథయాత్రకు సేవ చేయడానికి శిక్షణ పొందే వారిని ఏమంటారు?( దైవపతులు) 22) రథయాత్రకు ముందు మార్గాన్ని శుభ్రం చేసే ప్రక్రియను ఏమంటారు?( చెరాపహారా ) 23) రధాన్ని లాగడాన్ని ఏమంటారు?( రాధా తానా) 24) జగన్నాధుని ప్రథమ సేవకుడు ఎవరు?( పూరి రాజు ) 25) జగన్నాథ ప్రసాదాన్ని తయారు చేసేది ఏ కులము వ్యక్తి?( మంగలి) 26) ప్రసాద తయారీలో వినియోగించే పాత్ర ఏ లోహం? ( మట్టి) 27)జగన్నాధుని విగ్రహం ఏ లోహంతో తయారవుతుంది?( దారు/ చెక్క ) 28) జగన్నాథ రథయాత్ర కొనసాగే దూరం ఎంత?( రెండున్నర కిలోమీటర్లు ) https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
65 likes
20 shares