శ్రీ మహా లక్ష్మి దేవి 🙏
5K Posts • 12M views
#విష్ణుమూర్తి దశావతారాలు🙏🙏నమో వాసుదేవాయ🙏🙏 #🚩🕉️ శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారు🚩🕉️ #జై శ్రీకృష్ణ.. జైజై శ్రీకృష్ణ💐 #శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 #శ్రీ మహా లక్ష్మి దేవి 🙏 #💖జై శ్రీ రాధాకృష్ణ 💖 ------------------------------------- *మార్గశీరమాసారంభః* -------------------------------------- *మార్గశీర మాసం* --------------------------------------- *‘మార్గశీర్ష’ మాసము ఒక విలక్షణమైన మాసము. ‘మార్గశీర్షము’ అంటేనే మార్గములందు శ్రేష్ఠమైనది. ఉపయోగకరమైనదని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తిమార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గములన్నింటికన్నా ప్రధానమైనది, ప్రాముఖ్యతతోపాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది.* -------------------------------------- *శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం.* ---------------------------------------- *‘‘బృహత్సామ తథాసామ్నాం- గాయత్రీ ఛందసా మహం- మాసానాం మార్గశీర్షోహ- ఋతూనాంకుసుమాకరం”* ---------------------------------------- *అనే శ్లోకంలో మార్గశీరాన్నీ నేనే, ఆరు ఋతువులలోనూ పుష్పసౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది.* -------------------------------------- *మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం.* ---------------------------------------- *ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణువుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః’ ఓ నమో నారాయణయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.* --------------------------------------- *మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీని పూజిస్తూ ‘‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’’ చేయడం, ద్వాదశి అభిషేకం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ మాసంలో లవణం దానం చేయటం, ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి.* ---------------------------------------- *చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలంగా లేకపొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది.* --------------------------------------- *జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రునికి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువుని పూజిస్తారు. ప్రాతః కాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహా విష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది.* --------------------------------------- *మాసానాం మార్గశీర్షోసాం (మాసాలలో మార్గశిర మాసాన్ని నేను) అని శ్రీకృష్ణుడు 'భగవద్గీత-విభూతియోగం'లో చెప్పాడు. మార్గశిరమాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించే ఆచారం ఉంది. లక్ష్మీ ఆరాధనవల్లనే గురువారాన్ని లక్ష్మీ వారం అని అంటారు. జ్యోతిషార్థంలో సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అనీ, చాంద్రమానం ప్రకారం మార్గశిరమాసం అనీ అన్నారు. ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం. ఈ మాసంలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, పెరుగు మొదలైనవి. ఈ కాలంలో క్షారగుణాన్ని హరించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి గనుక, ఆహారపదార్థాలలోను, దేవతా సంబంధమైన నైవేద్యాలలోను విరివిగా వాడతారు. ఇవన్నీ ఔషధ విలువలున్నవే! దేహానికి ఉష్ణశక్తిని కలిగించేవే!* ---------------------------------------- *మార్గశిర మాస పూజలో లక్ష్మీవారంనాడు తలకు నూనె పెట్టుకోరాదని, బియ్యం ఇచ్చి ఏమీ కొనరాదని నియమాలుంచారు. మృగశిరతో కూడిన పూర్ణిమ (మార్గశీర్షమున) లవణ దానం చేయాలి. ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి మహావిష్ణువును విష్ణుసహస్రనామముతో ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవశించి మహావిష్ణువును ప్రార్థించినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.* --------------------------------------- *వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది.* --------------------------------------- *శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుజ్ఞయా!* *ఆరభేత వ్రతమిదం, సార్వకామిక మాదతః!!* --------------------------------------- *వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతియనుమతితో ’పుంసవన వ్రతము’ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది. ఈమాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు. దీనినే ’అన్నయజ్ఞము’ అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను, ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది. అంతేకాక కలువపూలతో శివుని అర్చించిన అది మహాఫలమునొసగును. ఈమాసములో ఒకపూట భుజించి, తనశక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధులనుండి, పాపాలనుండి విముక్తినందగలడు. సర్వకళ్యాణ సంపూర్ణుడై, అన్నిరకాల ఓషధులను పొందగలడు.* ---------------------------------------- *ఈమాసములో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామియై బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు. ఈమాసములో రోజంతా ఉపవాసముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆవ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈవిధముగా ఇతరమాసములకంటె మార్గశిరమునందు అనేక విశిష్ట లక్షణములు గలవు. కనుక భగవానుడు* ---------------------------------------- *మార్గశిర మాసం లో పర్వదిన తేదీలు: 2025* ---------------------------------------- *మార్గశిర మాసం ప్రారంభం: నవంబర్ 21, 2025 (శుక్రవారం)* ---------------------------------------- *ముగింపు: డిసెంబర్ 19, 2025 (శుక్రవారం) (అమావాస్యతో ముగుస్తుంది)* --------------------------------------- *మార్గశిర మాసంలో పౌర్ణమి / అమావాస్య 2025:* ---------------------------------------- *మార్గశిర పౌర్ణమి (దత్త జయంతి)* : *డిసెంబర్ 4, 2025 (గురువారం)* -------------------------------------- *మార్గశిర అమావాస్య: డిసెంబర్ 19, 2025 (శుక్రవారం)* --------------------------------------- *మార్గశిర మాసంలో పర్వదినాలు 2025:* --------------------------------------- *నాగ పంచమి / వివాహ పంచమి: నవంబర్ 25, 2025 (మంగళవారం)* ---------------------------------------- *సుబ్రహ్మణ్య షష్ఠి: నవంబర్ 26, 2025 (బుధవారం)* --------------------------------------- *మాసిక దుర్గాష్టమి: నవంబర్ 28, 2025 (శుక్రవారం)* --------------------------------------- *మోక్షద ఏకాదశి (మార్గశిర శుద్ధ ఏకాదశి): (గీతా జయంతి)* *డిసెంబర్ 1, 2025 (సోమవారం)* --------------------------------------- *మత్స్య ద్వాదశి / ప్రదోష వ్రతం (శుక్ల): డిసెంబర్ 2, 2025 (మంగళవారం)* --------------------------------------- *దత్తాత్రేయ జయంతి: డిసెంబర్ 4, 2025 (గురువారం)* --------------------------------------- *సంకట హర చతుర్థి: డిసెంబర్ 7, 2025 (ఆదివారం)* --------------------------------------- *సఫల ఏకాదశి (మార్గశిర బహుళ ఏకాదశి): డిసెంబర్ 15, 2025 (సోమవారం)* ---------------------------------------- *ధను సూర్య సంక్రమణం (మార్గశిర బహుళ ద్వాదశి): డిసెంబర్ 16,2025* ---------------------------------------- *మాస శివరాత్రి (కృష్ణ చతుర్దశి): డిసెంబర్ 18, 2025 (గురువారం)* ---------------------------------------
16 likes
6 shares