Magic Share BannerEpisodic Banner

ఇంద్రకీలాద్రి

38 Posts • 183K views
#🔱 దేవి శరన్నవరాత్రులు 🔱 #దుర్గాష్టమి శుభాకాంక్షలు# #కనకదుర్గమ్మ కథ #బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ వైభవం (ఇంద్రకీలాద్రి, విజయవాడ) 🔱🕉️🙏 #ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి ఆ పేరు ఎలా వచ్చింది? - స్థలపురాణ కథ 🙏🌺* 🔱🌸 శ్రీ కనకదుర్గమ్మ తల్లి నామ మహిమ 🌸🔱 🌿 ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో, పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతంపై శ్రీ కనకదుర్గమ్మ తల్లి స్వయంభువుగా వెలసిందని భక్తుల విశ్వాసం. అమ్మవారికి “కనకదుర్గ” అనే పేరు రావడం వెనుక ఒక విశేషమైన పురాణగాథ ప్రచారంలో ఉంది. ⛰️ 🌺 ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆవిర్భావం 🌺 📖 పురాణ కథనం ప్రకారం, ఇంద్రకీలుడు అనే మహర్షి అమ్మవారిని గురించి తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన ఆదిపరాశక్తి ప్రత్యక్షమైంది. 🙏 ఇంద్రకీలుడు లోకకల్యాణం కోసం అమ్మవారు తన పర్వతంపై శాశ్వతంగా కొలువై ఉండాలని ప్రార్థించాడు. భక్తుల కోరికను మన్నించిన అమ్మవారు ఇంద్రకీలాద్రిపై నివాసం ఏర్పరచుకున్నారని స్థలపురాణం చెబుతుంది. ⚔️ 🌺 మహిషాసురుడి సంహారం 🌺 🔱 లోకాలను బాధిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి అమ్మవారు మహిషాసురమర్దినిగా అవతరించిందని పురాణగాథ వివరిస్తుంది. 🪔 దుష్టశక్తులను సంహరించి, దేవతలకు మరియు లోకాలకు శాంతిని ప్రసాదించిన జగన్మాత ఇంద్రకీలాద్రిపై దివ్య తేజస్సుతో ప్రకాశించిందని భక్తులు విశ్వసిస్తారు. ✨ 🌟 మరి “కనకదుర్గ” అనే పేరు ఎలా వచ్చింది? 🌟 🌞 కనకం అంటే బంగారం. పురాణ కథనం ప్రకారం, మహిషాసురుడిని సంహరించిన అనంతరం అమ్మవారు కోట్లాది సూర్యుల కాంతిని తలపించే బంగారు వర్ణపు తేజస్సుతో ఇంద్రకీలాద్రిపై ప్రకాశించిందని చెబుతారు. 🙏 ఆ దివ్య స్వర్ణకాంతిని చూసి దేవతలు అమ్మవారిని “కనకదుర్గ” అని స్తుతించారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖకు చెందిన ఆలయ వివరణలో పేర్కొన్నారు. 🌺 అందుకే బంగారు కాంతితో ప్రకాశించే దుర్గాదేవి అనే భావనలో “కనకదుర్గమ్మ” అనే పేరు భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. 🔱 🌸 అమ్మవారి నామంలోని అంతరార్థం 🌸 💛 కనకం - బంగారం, స్వర్ణకాంతికి ప్రతీక. 🔱 దుర్గ — దుష్టశక్తులను సంహరించి, భక్తులను కాపాడే ఆదిపరాశక్తి. 🌺 ఈ రెండు పదాల సమ్మేళనమైన కనకదుర్గ అనే నామం అమ్మవారి దివ్య తేజస్సును, శక్తిని, మహిమను భక్తులకు గుర్తుచేస్తుంది. 🙏🌺 జై శ్రీ కనకదుర్గమ్మ తల్లి! 🌺🙏 🪔 ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత అందరినీ చల్లగా చూడాలని, సకల శుభాలను ప్రసాదించాలని ప్రార్థిద్దాం.
55 shares
Aaryan Rajesh
560 views • 17 days ago
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌷పంచాంగం🌷 శ్రీరస్తు - శుభమస్తు - ఆవిఘ్నమస్తు, తేదీ ... 20 - 10 - 2026, వారం ... భౌమవాసరే ( మంగళవారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం, తిథి : నవమి* ఉ9.11 వరకు, తదుపరి దశమి, నక్షత్రం : *శ్రవణం* మ3.43 వరకు యోగం : *శూలం* రా11.40 వరకు కరణం : *కౌలువ* ఉ9.11 వరకు, తదుపరి *తైతుల* రా9.51 వరకు, వర్జ్యం : *రా8.00 - 9.43* దుర్ముహూర్తము : *ఉ8.16 - 9.02* మరల *రా10.31 - 11.20* అమృతకాలం : *ఉ6.07 వరకు* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండo : *ఉ9.00 - 10.30* సూర్యరాశి : తుల, చంద్రరాశి : మకరం, సూర్యోదయం : 5.57, సూర్యాస్తమయం : 5.34, *_నేటి విశేషం_* *విజయదశమి* *శమీపూజా* *విజయ ముహూర్తకాలం మ1.42 - 2.28* *_𝕝𝕝ॐ𝕝𝕝 రాజరాజేశ్వరి గా అమ్మవారి దర్శనం - “విజయ దశమీ” - శమీవృక్ష పూజా 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* *శమీవృక్ష పూజా* *━❀꧁🔆꧂❀━* *శ్లో|| ‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ, అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ, శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా, ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా, తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.'' ||* దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది. "శ్రవణా" నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ" అనే సంకేతమున్నది. అందుకనే దీనికి "విజయ దశమి" అను పేరు వచ్చినది. ఏ పనైనా తిథి, వారము, తారా బలము, గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. "చతుర్వర్గ చింతామణి" అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే "విజయం" అని తెలిపి యున్నది. ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము. "శమీ పూజ" చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది, శమీ వృక్షమంటే "జమ్మి చెట్టు". అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుదములను, వస్త్రములను పొంది, శమీవృక్ష రూపమున ఉన్న "అపరాజిత దేవీ" ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు. "శ్రీ రాముడు" ఈ విజయ దశమి రోజున ఈ "అపరాజితా దేవీ" ని పూజించిన అనంతరం రావణుని సంహరించి, విజయము పొందినాడు. అదేంటంటే, శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి, నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా, ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని, శ్రీరామునికి విజయాన్ని కల్గజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పక విమానం లో అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు, అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవీ ని పూజించి, పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. *శ్రీ రాజరాజేశ్వరీ దేవీ* *━❀꧁ 🔆 ꧂❀━* *_శ్లో𝕝𝕝 అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ._* శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. "అపరాజితాదేవి" గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి. *_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ రాజరాజేశ్వరీదేవ్యై నమః 𝕝𝕝卐𝕝𝕝_* *_🌷శుభమస్తు🌷_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #ఇంద్రకీలాద్రి
14 shares