PSV APPARAO
656 views • 1 months ago
#శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల వేంకటేశుని వైభవం #తిరుమల వైభవం
👆 *హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్ప*
*రామభక్త హనుమంతునిపై భక్తులను కటాక్షించిన శ్రీమలయప్ప*
తిరుమల, 2026 సెప్టెంబరు 20:: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.
వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ హనుమంత వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ “గోవిందా… గోవిందా…” అంటూ స్వామివారిని దర్శించుకున్నారు.
*హనుమంత వాహనం – భగవద్భక్తికి ప్రతీక*
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శేషాచలాధీశుడు శ్రీరామావతారంలో తన పరమభక్తుడైన హనుమంతునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులలో అగ్రగణ్యుడైన హనుమంతుడు భగవంతునిపై అచంచలమైన భక్తి, సేవాభావం, శరణాగతికి ప్రతిరూపంగా నిలుస్తాడు.
గురుశిష్యులైన శ్రీరాముడు, హనుమంతుల దివ్యసంబంధం భక్తి, జ్ఞానం, సేవాతత్వాల సమన్వయాన్ని చాటిచెబుతుంది.
హనుమంత వాహనంపై కోదండరాముని దర్శించుకోవడం ద్వారా భక్తులకు భగవద్భక్తి, ధర్మనిష్ఠ, శరణాగతి భావాలు మరింతగా పెంపొందుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
10 shares

